Divorce Danger For Men : విడాకులు తీసుకున్న మగవాళ్లకే అనారోగ్య సమస్యలు ఎక్కువట.. ! ఇది వైద్య నిపుణుల రిపోర్ట్..
విడాకులు తీసుకున్న మగవాళ్లకే అనారోగ్య సమస్యలు ఎక్కువని వైద్య పరిశోధనలు తేల్చాయి. హఠాన్మరణం, గుండెపోటు, మానసిక రుగ్మతలు వస్తాయంటున్నారు. మహిళలకు మాత్రం ఇలాంటి సమస్యలు లేవని తేలింది.
విడాకులు తీసుకుని ఒంటరిగా ఏడేళ్లకుపైగా ఉంటున్న మగవాళ్లెవరైనా మీకు తెలుసా ? అలాంటి వారు ఉంటే వారిని అర్జంట్‌గా వెంటనే మరో అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోమని చెప్పండి లేకపోతే.. హఠాన్మరణం, మానసిక వైకల్యం, హార్ట్ ఎటాక్స్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ విషయం తాజాగా లండన్ సైంటిస్టులు నిర్వహించిన ఆరోగ్య పరిశోధనలో తేలింది. విడాకులు తీసుకుని ఒంటరిగా నివరిస్తున్న ఆడ, మగ వాళ్లపై అనేక రకాల టెస్టులు చేసి.. చివరికి విషయాన్ని కనిపెట్టారు. మగజాతిని కాపాడే ప్రయత్నం చేశారు.
Also Read: ఆ పుస్తకంలోని సింగిల్ పేజీని రూ.24 కోట్లకు అమ్మేశారు.. ఒక్క పేజీ అంత ఖరీదా?
సంసార జీవితంతో విసిగిపోయి.. ఇక భార్యే వద్దనుకుని ఒంటరిగా జీవిస్తున్న వారి సంఖ్య ఇటీవల పెరిగిపోతోంది. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ వీరి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఇలాంటి వారిలో అనారోగ్యానికి గురవుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. దీంతో విడాకులకు... అనారోగ్యానికి ఏమైనా సంబంధం ఉందా.. అని సైంటిస్టులు.. విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్న మహిళలు, పురుషులను సుదీర్ఘ కాలం పాటు పరిశీలించారు. టైమ్లీగా వారి హెల్త్ రిపోర్టులను విశ్లేషించారు. ఇలా 48 నుంచి 62 ఏళ్ల మధ్య దాదాపుగా 4800 మంది ఆరోగ్య రిపోర్టులను పరిశీలించి.. అన్ని వివరాలు క్రీడకరిస్తే మగవాళ్లకు ఒళ్లు గగుర్పొడిచే విషయాలు బయట పడ్డాయి.
Also Read: ఈ చేప భలే డ్రైవింగ్ చేస్తోంది.. ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ కేసు పెట్టరు కదా?
ఒంటరిగా ఉన్న పురుషుల్లో పదిహేజు శాతం అధికంగా రక్త ప్రసరణల్లో తేడాలు గుర్తించారు. అలాగే ఇతర శరీర పోషకాలకు అవసరమైన ప్రోటీన్లు.. ఇతర మెడికల్ నీడ్స్ చాలా తక్కువ మొత్తంలో అందుతున్నట్లుగా గుర్తించారు. ఒక బ్రేకప్ ఉన్న వారికి ఈ తీవ్రత కాస్త తక్కువే.. రెండు అంత కంటే బ్రేకప్‌లు అయిన వారికి మరింత ప్రమాదం ఉందని గుర్తించారు. ఒంటరిగా ఉండటం వల్ల మారే ఆహారపు అలవాట్లు కూడా ఈపరిస్థితి కారణం అని అంచనా వేశారు.
Also Read: నరక ద్వారం.. 50 ఏళ్లుగా ఇక్కడి భూమి మండుతూనే ఉంది.. చిన్న తప్పు ఎంత పనిచేసింది!
అయితే ఈ పరిశోధనలో తేలిన మరో కీలకమైన అంశం ఏమిటంటే.. ఎన్ని బ్రేకప్‌లు అయినా మహిళలు స్థిరంగా .. స్ట్రాంగ్‌గా ఉంటున్నారు. వారి ఆరోగ్యానికి ఎలాంటి ముప్పూ .. ఈ బ్రేకప్‌ల వల్ల రావడం లేదు. విడిపోవడం అంటూ జరిగితే ... అది మగాడే ఎక్కువగా నష్టపోతున్నారని.. చివరికి ఆరోగ్య పరంగా అదే జరుగుతోందని.. ఈ పరిశోధనలో తేలినట్లయింది.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి