అన్వేషించండి

Corbevox Booster Dose:మరో బూస్టర్ డోస్ వచ్చేస్తోంది, డబుల్ ఇమ్యూనిటీ గ్యారెంటీ

హైదరాబాద్‌ కంపెనీ బయోలాజికల్ లిమిటెడ్ సంస్థ తయారు చేసిన కార్బివాక్స్‌ బూస్టర్ డోస్‌ని ఆమోదించిన డీసీజీఐ. రోగనిరోధక శక్తి పెరుగుతుందని తేల్చి చెబుతున్న పరిశోధకులు.

కార్బెవాక్స్ బూస్టర్‌ డోస్‌కి డీసీజీఐ ఆమోదం 

రెండున్నరేళ్లుగా కరోనా మనల్ని వదలటం లేదు. వరుస వేవ్‌లతో విరుచుకు పడి చాలా భయపెట్టింది. ఈ వైరస్ వల్ల చాలా కుటుంబాలు ఆత్మీయులను కోల్పోయాయి. ఈ పరిస్థితులను గమనించి వెంటనే వ్యాక్సిన్ తయారీలో మునిగిపోయారు శాస్త్రవేత్తలు. ఏడాదిలోనే వైరస్‌కు విరుగుడు కనిపెట్టారు. ఒక్కో సంస్థ క్రమంగా వ్యాక్సిన్‌లు అందుబాటులోకి తీసుకొచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు వ్యాక్సినేషన్
ప్రక్రియ కొనసాగుతోంది. ఇటీవల ఒమిక్రాన్ వేరియంట్ వచ్చి అందరినీ భయపెట్టినా అప్పటికే టీకాలు తీసుకోవటం వల్ల ప్రభావం పెద్దగా కనిపించలేదు. బూస్టర్ డోస్ తీసుకుంటే ఇక ఏ చింతా ఉండదని తేల్చి చెప్పారు వైద్యులు. ఒమిక్రాన్ వేరియంట్ వచ్చిన సమయంలో చాలా మంది బూస్టర్ డోస్‌లు తీసుకున్నప్పటికీ తరవాత ఈ ప్రక్రియ నిలిచిపోయింది. మళ్లీ ఫోర్త్ వేవ్ భయాలు మొదలవుతుండటం వల్ల అందరి దృష్టి బూస్టర్‌ వైపు మళ్లింది. ఈ క్రమంలోనే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా-DCGI మరో కొత్త బూస్టర్ డోస్‌కి అనుమతినిచ్చింది. 18ఏళ్లు పైబడి, రెండు డోసులు తీసుకున్న వారెవరైనా ఈ బూస్టర్ డోస్‌ తీసుకోవచ్చని పేర్కొంది. 

ఆ విషయంలో రికార్డు సృష్టించిన కార్బెవాక్స్

హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్ ఈ లిమెటెడ్ సంస్థ కార్బెవాక్స్ పేరిట తయారు చేసిన బూస్టర్ డోస్‌ను వినియోగించేందుకు డీసీజీఐ ఆమోదం తెలిపింది. గతంలో కొవాగ్జిన్ లేదా కొవిషీల్డ్ టీకాలు తీసుకున్న వాళ్లు కూడా ఈ బూస్టర్ తీసుకోవచ్చని పేర్కొంది డీసీజీఐ. దేశంలో ఈ తరహా అనుమతి పొందిన తొలి వ్యాక్సిన్‌గా ఘనత సాధించింది కార్బెవాక్స్. ఈ వ్యాక్సిన్‌కు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్‌ ఫలితాలను డీసీజీఐకి నివేదించింది బయోలాజిక్ ఈ లిమిటెడ్ సంస్థ. ఈ ఫలితాలను విశ్లేషించిన నిపుణుల బృందం బూస్టర్‌ డోస్‌గా వినియోగించేందుకు అంగీకరించింది. ఈ డోస్ తీసుకున్న వారిలో రోగనిరోధక శక్తి పెరిగిందని, భద్రత పరంగానూ అన్ని ప్రమాణాలకు తగినట్టుగా ఉందని తేల్చి చెప్పింది. సెకండ్ డోస్ తీసుకున్న వారెవరైనా ఆర్నెల్ల తరవాత ఈ కార్బెవాక్స్ బూస్టర్ డోస్ తీసుకోవచ్చు.

బూస్టర్ డోస్‌ల అవసరాలు తీర్చుతాం: బీఈ సంస్థ ఎమ్‌డీ మహిమ దాట్ల

డీసీజీఐ నిర్ణయంపై హర్షం  వ్యక్తం చేశారు బయోలాజికల్ ఈ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మహిమ దాట్ల. దేశంలో బూస్టర్ డోస్‌ల అవసరాలు తీర్చే అవకాశం తమ సంస్థకు దొరికిందని అన్నారు. ఈ అనుమతితో మరోసారి తమ సంస్థ ప్రపంచ స్థాయి ప్రమాణాలు పాటిస్తోందని రుజువైందని చెప్పారు.  ఇప్పటికే 12-17 ఏళ్ల పిల్లలకు కార్బెవాక్స్ టీకాలు అందిస్తున్నారు. ఇప్పటి వరకు 50 లక్షల డోసులు అందించినట్టు ఆ సంస్థ వెల్లడించింది. ఇప్పటి వరకూ 10కోట్ల డోసులను కేంద్ర ప్రభుత్వానికి సరఫరా చేసింది బయోలాజికల్ ఈ లిమిటెడ్ సంస్థ. 

టాప్ హెడ్ లైన్స్

Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Cancer Risk: అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !
అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !
Frequent Urination: ప్రయాణాలకు బయల్దేరే ముందు పనులు చేస్తే పదే పదే టాయిలెట్‌ సమస్య పరిష్కరించవచ్చు! 
ప్రయాణాలకు బయల్దేరే ముందు పనులు చేస్తే పదే పదే టాయిలెట్‌ సమస్య పరిష్కరించవచ్చు!
Intermittent Fasting Risks: మీరు 16:8 ఉపవాసం పాటిస్తున్నారా? ముందు పరిశోధనలు చెప్పేది వినండి!
మీరు 16:8 ఉపవాసం పాటిస్తున్నారా? ముందు పరిశోధనలు చెప్పేది వినండి!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: ఆరు హత్యలు జరిగిన గ్రామాలకు వెళ్లేందుకు నేతల ప్రయత్నం- అడ్డుకున్న పోలీసులు 
ఆరు హత్యలు జరిగిన గ్రామాలకు వెళ్లేందుకు నేతల ప్రయత్నం- అడ్డుకున్న పోలీసులు 
Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Ramayana Trailer : విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
Leopard In Tirumala: తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
HYDRAA Inaction On Owaisi Encroachments: ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
Telangana Political Mind Games: విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
Embed widget