Mobile Phones in ICU: ఐసీయూలోకి మొబైల్ తీసుకువెళ్తే ఏమౌతుంది?
ఐసీయూలోకి మొబైల్ తీసుకువెళ్తే ఏమవుతుంది? ఐసీయూలోకి మొబైల్ ఫోన్ తీసుకువెళ్లడం మంచిది కాదని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. ఇలా చేయడం వల్ల రోగి ఆరోగ్యానికి ప్రమాదమని తెలిపింది.
ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ).. ఆసుపత్రిలో ఇది చాలా సెన్సిటివ్ వార్డ్. సీరియస్ పేషెంట్స్ ను ఈ వార్డులో ఉంచుతారు. ఇక్కడ రోగికి చికిత్సను అందించేందుకు చాలా మిషన్లు ఏర్పాటు చేస్తారు. అయితే ఇలాంటి వార్డుల్లోకి మొబైల్ ఫోన్ తీసుకువెళ్లడం ప్రమాదమా? అవును కచ్చితంగా ప్రమాదమేనని తాజా అధ్యయనంలో తేలింది. చాలా మెడికల్ ఎగ్లామినేషన్ మిషన్లకు ఒక మీటర్ దూరంలో ఫోన్ ఉన్నా అవి సరిగా పనిచేయవని తాజా అధ్యయనం చెబుతోంది.
ఎందుకు?
ఐసీయూలో ఉన్న రోగులను సూక్ష్మజీవుల (జమ్స్) నుంచి కాపాడేందుకు వారిని ఈ వార్డులో పెడతారు. మరి అలాంటి వార్డుకు స్మార్ట్ ఫోన్స్ తీసుకువెళ్తే.. వాటితో పాటు వివిధ రకాల బ్యాక్టీరియాను వచ్చే అవకాశం ఉందని అధ్యయనం వెల్లడించింది. అందుకే వైద్యులు ఐసీయూలోకి మొబైల్ ఫోన్స్ తీసుకురావడానికి అనుమతి లేదు. ఐసీయూలోకి మొబైల్ తీసుకువెళ్లడం వల్ల వచ్చే అనర్థాలు ఏంటో చూద్దాం.
ఐసీయూలో మొబైల్ వినియోగించడం లేదా తీసుకువెళ్లడం వల్ల రోగికి తీవ్ర ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అందుకే వైద్యులు, నర్సులు ఇతరులు మొబైల్ ఫోన్ తీసుకువెళ్లకూడదు. వైద్యుల చేతిలో ఉండే 100 ఫోన్లలో దాదాపు 56 మొబైల్స్ పై బ్యాక్టిరియా, వివిధ రకాల వైరస్ లు ఉంటాయట. ఇందులో చాలా క్రిములు యాంటీబయోటిక్స్ ను కూడా తట్టుకొని జీవించగలవు.
ALSO READ:
Covid 19 India New Cases: దేశంలో కొత్తగా 40,134 కేసులు.. భువనేశ్వర్‌లో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి
ఏమవుతుంది?
ఫోన్ వినియోగించేటప్పుడు చేతులకు ఉన్న క్రిములు, చమట కీప్యాడ్ పై ఉండిపోతుంది. మాట్లాడేటప్పుడు నోటిలో నుంచి ఉమ్ము తుంపర్లు ఫోన్ పై పడతాయి. ఈ కారణంగా మొబైల్ కీ ప్యాడ్ పై బ్యాక్టీరియా, వైరస్ లు చేరే అవకాశం ఎక్కువ ఉంది. మొబైల్ స్క్రీన్స్ ను శుభ్రయం చేయకపోతే ఇవి మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఐసీయూలోకి మొబైల్ ఫోన్స్ పట్టికళ్తే ఇన్ని ప్రమాదాలు ఉన్నాయన్నమాట.
టిక్ టాక్ బ్యాన్ కాకముందు కొంతమంది వైద్యులు, నర్సులు ఆసుపత్రిలో వీడియోలు చేసి పోస్ట్ పెట్టడం తీవ్ర చర్చకు దారితీసింది. కరోనా వార్డుల్లోనూ ఇలాంటి ఘటనలు కనిపించడంతో ఆరోగ్యశాఖ సీరియస్ గా తీసుకుంది. అలాంటి సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంది. రోగి ఆరోగ్యమై అత్యంత ప్రధానమని వెల్లడించింది. అయితే ఎంతోమంది వైద్యులు, సిబ్బంది కరోనా సమయంలో రోగులను కంటికి రెప్పలా కాపాడి నిజమైన వారియర్స్ అనిపించుకున్నారు.
ALSO READ:
Drones Spotted, Jammu Kashmir: మరోసారి జమ్మూలో డ్రోన్ల కలకలం.. భద్రతా దళాలు అప్రమత్తం