News
News
వీడియోలు ఆటలు
X

Nose knows: ముక్కుకు తెలుసు.. కొవిడ్‌ ఎవరిలో తీవ్రమవుతుందో!

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్​ కోట్లాది మందికి సోకినా.. అందులో కొంత మంది మాత్రమే తీవ్రంగా ప్రభావితమయ్యారు. అలా జరిగేందుకు కారణాలు ఏమిటి? ఎవరిపై ఇలాంటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది? పరిశోధనా వివారాలు ఇవే..

FOLLOW US: 
Share:

కొవిడ్‌ బాధితుల్లో కొంతమందే తీవ్రస్థాయి అనారోగ్యం బారిన పడుతున్నారెందుకు? ఎలాంటి వారిలో ఈ పరిస్థితి తలెత్తుతోంది? అన్న చిక్కుముడిని విప్పేందుకు అమెరికా శాస్త్రవేత్తలు పరిశోధన సాగించారు. అనారోగ్య తీవ్రతను లెక్క కట్టడానికి వైద్య నిపుణులు సాధారణంగా రక్త పరీక్షలు చేస్తుంటారు. అయితే, ముప్పును అంచనా వేయడానికి అదేమీ అంత సరైన పరీక్ష కాదంటున్నారు.. మసాచుసెట్స్, మిసిసిపీ విశ్వవిద్యాలయాల పరిశోధకులు!

ముక్కు, నోటి కుహరంలోని కణాలను పరీక్షించడం ద్వారా కొవిడ్‌ బాధితుల్లో ఎవరెవరు తీవ్ర అనారోగ్యం బారినపడే ప్రమాదముందన్నది తెలుసుకోవచ్చని ప్రతిపాదించారు. పరిశోధనలో భాగంగా వారు గత ఏడాది ఏప్రిల్‌-సెప్టెంబరు మధ్య 35 మంది కొవిడ్‌ బాధితుల నాసికా రంధ్రాల్లోంచి నమూనాలను సేకరించారు. ఒక్కో నమూనాలో సగటున 562 కణాలు ఉన్నట్టు వారు లెక్కగట్టారు. ప్రతి కణంలోని ఆర్‌ఎన్‌ఏను నిశితంగా విశ్లేషించారు.

'శరీర అంతర్భాగాల వరకూ కరోనా వైరస్‌ వ్యాపించడానికి ముందే.. ముక్కు, నోరు దాన్ని ఎదుర్కొంటాయి. వైరస్‌ సోకగానే వాటిలోని కణాలు ఎలా స్పందిస్తాయన్న అంశంపై దృష్టి సారించాం. తద్వారా బాధితుడికి స్వల్ప లక్షణాలుంటాయా? తీవ్ర అనారోగ్యం ఎదురవుతుందా? అన్నది ప్రాథమికంగా అంచనా వేయొచ్చు. కరోనా వైరస్‌ ముక్కు లేదా నోటిలోకి ప్రవేశించగానే.. కణాల మధ్యనుండే ఎపీథెలియాల్‌ ధాతువుల్లో మార్పు చోటుచేసుకుంటుంది. ఈ క్రమంలోనే శ్లేష్మాన్ని ఉత్పత్తిచేసే సీక్రెటరీ, గోబ్లెట్‌ కణాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతాయి. శ్వాసనాళంలో బ్యాక్టీరియా ప్రయాణానికి దోహదపడే అపరిపక్వ సీలియేటెడ్‌ కణాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతాయి.

వీటి స్థాయులను తెలుసుకోవడం ద్వారా.. కరోనా వైరస్‌కు రోగనిరోధక వ్యవస్థ ప్రాథమికంగా ఎలా స్పందిస్తోంది, శరీరంలోని కణాలు వాటికి ఎలా లొంగిపోతున్నాయి, వైరస్‌ లోడు ఎంత వేగంగా పెరుగుతోందన్న విషయాలను తెలుసుకోవచ్చు. తద్వారా అనారోగ్య తీవ్రతను అంచనా వేయొచ్చు' అని పరిశోధనకర్త అలెక్స్‌ షాలెక్‌ వివరించారు.

కరోనా డెల్టా వేరియంట్..

కరోనాలో వెలుగు చూసిన వేరియంట్లన్నింటిలోకి అత్యంత ఎక్కువ సాంక్రమిక శక్తిని ప్రదర్శిస్తున్న డెల్టా రకాన్ని కట్టడి చేయడానికి ముమ్మర చర్యలు అవసరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వేరియంట్‌ బారినపడినవారికి దగ్గరగా వెళ్లిన వారిని ప్రారంభ దశలోనే గుర్తించడానికి వ్యవధి తక్కువగా ఉంటోందని పేర్కొన్నారు. కొవిడ్‌-19 టీకాలు ప్రజలందరికీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాని నేపథ్యంలో ఈ రకం ఉద్ధృతికి కళ్లెం వేయాలంటే ఇలాంటివారిని శరవేగంగా గుర్తించడం ముఖ్యమని స్పష్టంచేస్తున్నారు.

2019లో చైనాలోని వుహాన్‌లో వెలుగుచూసిన కరోనా రకం మొదట పలు దేశాల్లో విస్తరించింది. అయితే గత ఏడాది మార్చిలో.. మరింత ఎక్కువ సాంక్రమిక శక్తి కలిగిన డి614జి రకం వచ్చిపడింది. అనంతరం బ్రిటన్‌లో ఆల్ఫా రకం బయటపడింది. 2021 ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా దీని వ్యాప్తి ఎక్కువగా కనిపించింది. ఈలోగా డెల్టా రకం వచ్చిపడింది. కొన్ని ఉత్పరివర్తనల వల్ల దీని వ్యాప్తి ఆల్ఫా కన్నా చాలా ఎక్కువగా ఉంది. టీకాల ద్వారా లభించిన రోగనిరోధక శక్తిని కొంతమేర ఏమార్చే సామర్థ్యాన్ని సొంతం చేసుకుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వుహాన్‌ రకంతో పోలిస్తే.. డెల్టా వేరియంట్‌ సోకిన వ్యక్తి నుంచి వెయ్యి రెట్లు ఎక్కువగా వైరస్‌ వెలువడుతున్నట్లు ఒక అధ్యయనం తేల్చింది. డెల్టా వల్ల ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం, ఐసీయూలో చికిత్స తీసుకోవాల్సి రావడం, మరణం ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటాయని మరో పరిశోధన పేర్కొంది.

 

Published at : 26 Jul 2021 01:28 PM (IST) Tags: Corona corona virus covid 19 corona cases delta virus nose

సంబంధిత కథనాలు

Diabetes: డయాబెటిస్ ఉందా? మీ గుండె జాగ్రత్త, నిశబ్దంగా చంపేస్తుందట!

Diabetes: డయాబెటిస్ ఉందా? మీ గుండె జాగ్రత్త, నిశబ్దంగా చంపేస్తుందట!

Dark Chocolate: డార్క్ చాక్లెట్‌లలో ఆ రెండు భారీ లోహాలు, చెబుతున్న తాజా నివేదిక

Dark Chocolate: డార్క్ చాక్లెట్‌లలో ఆ రెండు భారీ లోహాలు, చెబుతున్న తాజా నివేదిక

Ice Apple: వేసవిలో తాటి ముంజలను తప్పనిసరిగా ఎందుకు తినాలి?

Ice Apple: వేసవిలో తాటి ముంజలను తప్పనిసరిగా ఎందుకు తినాలి?

Diabetes: డయాబెటిస్ ఉంటే ఈ పండ్లు అధికంగా తినకూడదు

Diabetes: డయాబెటిస్ ఉంటే ఈ పండ్లు అధికంగా తినకూడదు

నెలసరి నొప్పితో బాధపడుతున్నారా? ఈ అలవాట్లు, పనులకు దూరంగా ఉండండి

నెలసరి నొప్పితో బాధపడుతున్నారా? ఈ అలవాట్లు, పనులకు దూరంగా ఉండండి

టాప్ స్టోరీస్

Apple Vision Pro: ప్రపంచాన్ని కళ్ల ముందుకు తెస్తున్న యాపిల్ - విజన్ ప్రో హెడ్‌సెట్ లాంచ్ - రేటు ఎంతంటే?

Apple Vision Pro: ప్రపంచాన్ని కళ్ల ముందుకు తెస్తున్న యాపిల్ - విజన్ ప్రో హెడ్‌సెట్ లాంచ్ - రేటు ఎంతంటే?

KTR Mulugu Tour: ఈ 7న ములుగు జిల్లాలో కేటీఆర్‌ పర్యటన, కలెక్టరేట్ సహా పలు పనులకు శంకుస్థాపన

KTR Mulugu Tour: ఈ 7న ములుగు జిల్లాలో కేటీఆర్‌ పర్యటన, కలెక్టరేట్ సహా పలు పనులకు శంకుస్థాపన

యాపిల్ విజన్ ప్రో హెడ్ సెట్ ఎలా ఉంది? - ఎలా పని చేస్తుంది? - ఈ ఫొటోలు చూస్తే ఫుల్ క్లారిటీ!

యాపిల్ విజన్ ప్రో హెడ్ సెట్ ఎలా ఉంది? - ఎలా పని చేస్తుంది? - ఈ ఫొటోలు చూస్తే ఫుల్ క్లారిటీ!

iOS 17 Features: ఐవోఎస్ 17లో మూడు సూపర్ ఫీచర్లు - లాంచ్ చేసిన యాపిల్!

iOS 17 Features: ఐవోఎస్ 17లో మూడు సూపర్ ఫీచర్లు - లాంచ్ చేసిన యాపిల్!