Covid 19 Cases India: మళ్లీ కరోనా విజృంభణ.. కొత్తగా 42 వేల కేసులు నమోదు
నిన్న 30 వేలకు పడిపోయిన కరోనా కేసులు నేడు అమాంతంగా 42 వేలకు పెరిగాయి. 562 మంది వైరస్ కు బలయ్యారు.
దేశంలో కొత్తగా 42,625 కరోనా కేసులు నమోదుకాగా 562 మంది మృతి చెందారు. 36,668 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రికవరీ రేటు 97.37%.గా ఉంది.
దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం 4,10,353గాఉంది. మొత్తం కేసుల్లో ఇది 1.29%.
- మొత్తం కేసులు: 3,17,69,132
- మొత్తం రికవరీలు: 3,09,33,022
- మొత్తం మరణాలు: 4,25,757
- యాక్టివ్ కేసులు: 4,10,353
- మొత్తం వ్యాక్సినేషన్: 48,52,86,570 ( గత 24 గంటల్లో 62,53,741)
కేరళలో 23,676 కేసులు..
కేరళలో కొత్తగా 23,676 కేసులు నమోదుకాగా 148 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 34.49 లక్షలకు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 17,103కి చేరింది.
రాష్ట్రంలో సోమవారం 13,984 కేసులు నమోదయ్యాయి. అంతకుముందు వరుసగా 6 రోజుల పాటు 20 వేలపైనే కరోనా కేసులు వెలుగుచూశాయి. సోమవారం నుంచి ఇప్పటివరకు 15,626 మంది వైరస్ నుంచి బయటపడ్డారు. మొత్తం రికవరీల సంఖ్య 32,58,310కి పెరిగింది. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1,73,221కి పెరిగినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.
మహారాష్ట్రలో 6,005 కొత్త కేసులు..
మహారాష్ట్రలో కొత్తగా 6,005 కేసులు నమోదుకాగా 177 మంది వైరస్ తో మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 63,21,068కి పెరిగింది. మొత్తం మరణాల సంఖ్య 1,33,215కి చేరింది. 6,799 మంది కరోనా నుంచి రికవరయ్యారు.
22 లక్షల వ్యాక్సిన్ డోసులు..
ఉత్తర్ ప్రదేశ్ ఒక్కరోజులోనే 22 లక్షల కొవిడ్ వ్యాక్సిన్ డోసులు ఇచ్చి రికార్డ్ సృష్టించింది. దేశంలోనే 5 కోట్ల టీకాలను అందించిన మొదటి రాష్ట్రంగా మరో మైలురాయిని అందుకుంది ఉత్తర్ ప్రదేశ్. ఈ విషయంపై ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ వల్లే ఇది సాధ్యమైందన్నారు. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేసుకోవాలని.. కరోనా నుంచి తమను తాము రక్షించుకోవాలని యోగి ఆదిత్యనాథ్ కోరారు. కరోనా టీకాలను సురక్ష కవచాలుగా అభివర్ణించారు.
దేశంలో థర్డ్ వేవ్ వచ్చేసరికి కరోనా కేసులు అత్యధికంగా రోజుకు లక్ష నుంచి లక్షా 50 వేలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించాయి. కరోనా నిబంధనలు తప్పక పాటించాలని సూచిస్తున్నాయి.
ALSO READ:
India Post Raksha Bandhan Initiative: 101 దేశాలకు రాఖీలు పంపనున్న భారత తపాలాశాఖ
Yo Yo Honey Singh: తాగుడు, అమ్మాయిలతో ఎఫైర్లు.. ప్రముఖ సింగర్ పై భార్య సంచలన ఆరోపణలు!