US Corona : అమెరికాలో కరోనా సునామీ.. ఒక్క రోజులో పది లక్షల కరోనా కేసులు..!

అమెరికాలో కరోనా కేసుల సునామీ కనిపిస్తోంది. ఆదివారం ఒక్క రోజే పది లక్షల కేసులు నమోదయ్యాయి.

FOLLOW US: 

అగ్రరాజ్యం అమెరికా కరోనా గుప్పిట్లో చిక్కుకుంది. కరోనా సునామీ వచ్చే ప్రమాదం ఉందని అక్కడి నిపుణులు అంచనా వేసిన రోజుల్లోనే ఆ తరహా పరిస్థితి కనిపిస్తోంది. సోమవారం ఒక్కరోజే అమెరికాలో పది లక్షలకుపైగా కేసులు నమోదైనట్లుగా జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ ప్రకటించారు. గురువారం ఈ సంఖ్య ఐదు లక్షలకు  దిగువనే ఉంది. మూడు రోజులోనే రెట్టింపు అయింది. అయితే ఈ పది లక్షల కేసుల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఎన్ని అన్నదానిపై స్పష్టత లేదు. సాధారణ కరోనా వైరస్‌తో పాటు ఒమిక్రాన్ వైరస్ కూడా శరవేగంగా విస్తరిస్తోంది.  ఒమిక్రాన్ వ్యాప్తి .. ఐదారు రెట్లు ఎక్కువగా నిపుణులు ఇప్పటికే నిర్ధారించారు. 

Also Read: బీ అలర్ట్.. మరో కొత్త వేరియంట్ వచ్చేసింది.. ఒమిక్రాన్ కన్నా అంతకుమించి!

ఈ కారణంగా నమోదవుతున్న కేసుల్లో ఒమిక్రాన్ వేరియంట్ కూడా అత్యధికం ఉంటాయని భావిస్తున్నారు. కరోనా పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతూండటంతో  అధ్యక్షుడు బైడెన్ ,  ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ..., కరోనా కట్టడికి నియమించిన ప్రత్యేక బృందంతో సమావేశం కావాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అమెరికాలో ఇప్పటికే వ్యాక్సినేషన్ రెండు డోసులు  దాదాపుగా పూర్తయ్యాయి. అయితే వ్యాక్సినేషన్ వేసుకున్న వారికి సైతం కరోనా సులువుగా సోకుతూండటంతో..., బూస్టర్ డోసును పంపిణీ చేస్తున్నారు. 

Also Read: విజయనగరం జిల్లాలో కరోనా కలకలం... కొత్తవలస పాఠశాలలో 19 మంది విద్యార్థులు, ఒక టీచర్ కు పాజిటివ్

ఫైజర్ - బయోన్‌టెక్ సంస్థ తయారు చేస్తున్న బూస్టర్ డోస్‌ 12 నుంచి 15 ఏళ్ల వయసుగల వారికి కూడా వినియోగించేందుకు అత్యవసర అనుమతిని అమెరికా ఎఫ్‌డీఏ మంజూరు చేసింది. కరోనా కారణంగా అమెరికాలోని చాలా రాష్ట్రాలు ఆంక్షలు విధించాయి. టెస్టుల కోసం పెద్ద ఎత్తున జనం క్యూ కడుతున్నారు. మొదటి విడత కరోనా తరహా పరిస్థితులు ఇప్పుడు అమెరికాలో కనిపిస్తున్నాయి. అయితే మృతుల సంఖ్య మాత్రం అసాధారణ రీతిలో లేకపోడంతో అక్కడి ప్రభుత్వం ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఆస్పత్రిలో చేరే వారు తక్కువగా ఉన్నప్పటికీ ముందు జాగ్రత్తగా పెద్ద ఎత్తున తాత్కాలిక వైద్య సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వం గతంలో తరహా అత్యవసర పరిస్థితులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. 

Also Read: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు కరోనా పాజిటివ్.. టెస్టులు చేయించుకోవాలని వారికి సూచన

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 04 Jan 2022 05:50 PM (IST) Tags: America corona cases omicron cases tens of millions of cases in a single day in America corona trading America

సంబంధిత కథనాలు

Omicron Variant BA.4 in Hyderabad:  హైదరాబాద్ వాసులకు అలర్ట్ -  కొత్త ఒమిక్రాన్ వేరియంట్ మొదటి కేసు ఇక్కడే !

Omicron Variant BA.4 in Hyderabad: హైదరాబాద్ వాసులకు అలర్ట్ - కొత్త ఒమిక్రాన్ వేరియంట్ మొదటి కేసు ఇక్కడే !

Covid-19 Cases India: దేశంలో కొత్తగా 2259 కరోనా కేసులు- 20 మంది మృతి

Covid-19 Cases India: దేశంలో కొత్తగా 2259 కరోనా కేసులు- 20 మంది మృతి

Corona Cases: దేశంలో కొత్తగా 1,829 కరోనా కేసులు- 33 మంది మృతి

Corona Cases: దేశంలో కొత్తగా 1,829 కరోనా కేసులు- 33 మంది మృతి

Covid 19 Vaccine Gap: కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక నిర్ణయం, వ్యాక్సిన్ డోసుల మధ్య గ్యాప్‌ తగ్గింపు - వారికి మాత్రమే !

Covid 19 Vaccine Gap: కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక నిర్ణయం, వ్యాక్సిన్ డోసుల మధ్య గ్యాప్‌ తగ్గింపు - వారికి మాత్రమే !

Covid Update: దేశంలో తగ్గిన కరోనా కేసులు- 28 రోజుల తర్వాత 2 వేలకు లోపు!

Covid Update: దేశంలో తగ్గిన కరోనా కేసులు- 28 రోజుల తర్వాత 2 వేలకు లోపు!
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Russia Ukraine War : ఉక్రెయిన్‌పై గెలిచాం - ప్రకటించేసుకున్న రష్యా !

Russia Ukraine War :  ఉక్రెయిన్‌పై గెలిచాం - ప్రకటించేసుకున్న రష్యా !

Subrahmanyam Death Case: టీడీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు, సుబ్రహ్మణ్యం మృతి కేసులో కాకినాడ జీజీహెచ్‌ వద్ద ఉద్రిక్తత

Subrahmanyam Death Case: టీడీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు, సుబ్రహ్మణ్యం మృతి కేసులో కాకినాడ జీజీహెచ్‌ వద్ద ఉద్రిక్తత

Begumbazar Honor Killing : నా అన్నలే హత్య చేశారు, వారిని ఉరితీయాలి - మృతుని భార్య సంజన డిమాండ్

Begumbazar Honor Killing : నా అన్నలే హత్య చేశారు, వారిని ఉరితీయాలి - మృతుని భార్య సంజన డిమాండ్

Telangana TET Exam : తెలంగాణ టెట్ వాయిదాపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు

Telangana TET Exam : తెలంగాణ టెట్ వాయిదాపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు