By: ABP Desam | Updated at : 06 Jul 2022 04:21 PM (IST)
image credit: pexels
మనలో చాలా మందికి నిద్రపోయేటప్పుడు పాలు తాగి పడుకోవడం అలవాటు. అదే అలవాటుతో మాంసాహారం తిన్నా తర్వాత కూడా తాగుతాం. రెస్టారెంట్ కి వెళ్ళిన సమయంలో కూడా నాన్ వెజ్ తిన్నా తర్వాత మిల్క్ షేక్ తాగడం లేదా పాలతో తయారు చేసిన పదార్థాలు తినడం చేస్తాం. అలా చెయ్యడం ఆరోగ్యానికి ప్రమాదమని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఇది మన జీర్ణ క్రియని దెబ్బ తీయడంతోపాటు అనేక అనారోగ్య సమస్యలని తెచ్చి పెడుతుందని అంటున్నారు. కొన్ని పదార్థాలని కొన్నిటితో కలిపి తినడం మంచిది కాదని అభిప్రాయపడుతున్నారు. సరైన ఆహార పదార్థాల కాంబినేషన్ తోనే మనం తినాలని చెబుతున్నారు. వాత, పిత, కఫాలలో సమతుల్యత లోపిస్తుంది. అవి సరిగా లేకపోతే మన శరీరం అనారోగ్యానికి గురవుతుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. అందుకే మన ఇళ్ళల్లో పెద్ద వాళ్ళు కూడా మాంసాహారం తిన్న తర్వాత పెరుగు తినకూడదని చెప్తారు.
చికెన్ తిన్న తర్వాత పాలు తీసుకుంటే వచ్చే అనార్థాలు..
చికెన్ తిన్న తర్వాత పాలతో కూడిన పదార్థాలు తీసుకోవడం వల్ల మన జీర్ణవ్యవస్థకి ఆటంకం ఏర్పడుతుంది. ఎందుకంటే అవి రెండు వేర్వేరు గుణాలని కలిగి ఉండే పదార్థాలు. ఇవి రెండు కలిపి తినడం వల్ల మన పొట్టలో హానికర యాసిడ్స్ ఫామ్ అవుతాయి. అది మన జీర్ణప్రక్రియని దెబ్బతీస్తుంది. దీని వల్ల అరుగుదల సమస్యలు వస్తాయి. అంతే కాకుండా కడుపులో వికారం, కడుపు నొప్పి, పొట్ట ఉబ్బరం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, తీవ్రమైన చర్మ సమస్యలు, మల బద్దకం వంటి ఇబ్బందులని ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఒక వేళ మీరు మాంసాహారం తిన్న తర్వాత కూడా పాల పదార్థాలు తీసుకోవాలని అనుకుంటే ఆ రెండిటికి మద్య కనీసం రెండు గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. కానీ ఈ వాదాన్ని డైటీషియన్స్ కొట్టి పడేస్తున్నారు. అలాంటి సమస్యలేమీ ఉండవని అంటున్నారు. చికెన్ లేదా చేపలు తిన్న తర్వాత పాలు తాగడం వల్ల ఎటువంటి హానికర ప్రభావాలు ఉండవని పోషకాహార నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చికెన్, చేప వంటి పదార్థాలు జీర్ణమయ్యేందుకు కొంత సమయం పడుతుంది. అవి తిన్న తర్వాత లిక్విడ్ తీసుకోవడం వల్ల జీర్ణ ప్రక్రియను కొద్దిగా మందగించేలా చేస్తుంది. మాంసాహారం తిన్న తర్వాత లిక్విడ్ తీసుకోవడం వల్ల కడుపు నిండుగా అనిపిస్తుందని అంతే కానీ ఎటువంటి అనారోగ్య సమస్యలు రావని పోషకాహార నిపుణులు అంటున్నారు.
ఓ మై గాడ్, కోవిడ్ సోకినవారికి మూర్చల ముప్పు - మాస్క్ పెట్టుకోపోతే కష్టమే!
స్పైసీ ఫుడ్ తిన్న తర్వాత కడుపులో మంటగా ఉందా? ఇవిగో ఆయుర్వేద చిట్కాలు
టాయిలెట్లో టైంపాస్? గంటలు గంటలు కూర్చుంటే చెప్పుకోలేని రోగం వస్తుందట!
30 Days Water Challenge: 30 డేస్ వాటర్ ఛాలెంజ్ - ఈ ట్రెండ్ ఫాలో కావద్దు, ప్రాణాలు పోతాయ్, ఎందుకంటే..
ఈ లక్షణాలు మీలో కనిపిస్తే రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని అర్థం, ఏం తినాలంటే
High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
Tees Maar Khan Movie Review - తీస్ మార్ ఖాన్ రివ్యూ : రేసుగుర్రంలా దూసుకు వెళ్ళాలనుకున్న ఆది సాయి కుమార్, సినిమా ఎలా ఉందంటే?
Anasuya: 'నా మాటలను రాజకీయం చేయొద్దు' - నెటిజన్లకు అనసూయ రిక్వెస్ట్!
Wanted PanduGod Review: వాంటెడ్ పండుగాడ్ రివ్యూ: సుధీర్, అనసూయ, సునీల్ల పండుగాడు మెప్పించాడా?