Small Onion: ఈ ఉల్లిపాయ మగవారు తింటే ఆ విషయంలో తిరుగుండదట!
సాంబారులో చిన్న ఉల్లిపాయలు కనిపిస్తే, తినకుండా తీసి పడేస్తున్నారా? అయితే మీరు చాలా మిస్ అయిపోతున్నట్టే లెక్క.
సాంబారులో ప్రత్యేకంగా వేసే ఉల్లిపాయలు ఉంటాయి. అవి చాలా చిన్నగా ఉంటాయి. అందుకే మనం చిన్న ఉల్లిపాయలనే పిలుచుకుంటాం. ఇవి తమిళనాడు చాలా ప్రసిద్ధి. అక్కడ వీటిని ‘చెట్టికులం స్మాల్ ఆనియన్’ అంటారు. వీటితో సాంబారు చేస్తే రుచి అదిరిపోతుంది. తమిళనాడు నుంచి ఈ చిన్న ఉల్లిపాయలు చాలా ప్రాంతాలకు ఎగుమతి అవుతాయి. అలాగే మన దగ్గర కూడా కొన్ని చోట్ల చిన్న ఉల్లిపాయల్ని పండిస్తున్నారు. వీటిని ముక్కలు కోయకుండా తొక్కతీసి నేరుగా సాంబారులో వండేటప్పుడే వేసేస్తారు. అయినా ఇది చక్కగా, మెత్తగా ఉడికి మంచి రుచిని ఇస్తుంది. వీటిని తినేటప్పుడు మాత్రం కొంతమంది తీసి పడేస్తారు. వీటిని తినడం వల్ల లాభాలు తెలిస్తే ఇలా తీసి పడేయరు. ముఖ్యంగా మగవారికి ఈ చిన్న ఉల్లిపాయలు చాలా మేలు చేస్తాయి.
మగవారికెంతో మేలు
కామోద్దీపన ఆహారాలలో ఈ చిన్న ఉల్లిపాయను కూడా చేర్చుకోవాలి. ఇది పునరుత్పత్తి అవయవాలను బలంగా మారుస్తుంది. మగవారు వీటిని తినడం వల్ల టెస్టోస్టెరాన్ స్థాయిలు పెరుగుతాయి. దీనివల్ల లైంగిక శక్తి పెరుగుతుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తరచూ తినే మగవారిలో స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. అంతేకాదు వీర్యకణాల్లోని చలనశీలతను పెంచుతుంది. అంటే చురుగ్గా కదిలేలా చేస్తుంది. అల్లియం సెపా అనే సహజమైన యాంటీ ఆక్సిడెంట్ వీటిలో ఉంటుంది. దీని కోసమే వేల ఏళ్లుగా సంప్రదాయ వైద్యంలో ఉల్లిపాయను వాడుతున్నారు. ఇది వీర్యంలోని డీఎన్ఏ దెబ్బతినకుండా కాపాడుతుంది. సంతానోత్పత్తి శక్తిని పెంచుతుంది. అందుకే లైంగిక సమస్యలున్న మగవారు రోజూ చిన్న ఉల్లిపాయలను తింటే సగం చికిత్స చేయించుకున్నట్టే.
అందరికీ లాభమే
ఈ చిన్న ఉల్లిపాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు, సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి గుండెకు హాని చేసే ట్రైగ్లిజరైడ్లను తగ్గిస్తాయి. అలాగే కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా కాపాడతాయి. రక్తం గడ్డకట్టకుండా కూడా రక్షిస్తాయి. వీటిలో విటమిన్ సి, బి, పొటాషియం అధికంగా ఉంటాయి. పొటాషియం అధికంగా ఉండడం వల్ల రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. కాబట్టి అధిక రక్త పోటు ఉన్నవారికి చిన్న ఉల్లిపాయలను తింటే చాలా మంచిది. దీనిలో యాంటీ బ్యాక్టిరియల్ లక్షణాలు అధికం. కాబట్టి వైరస్, బ్యాక్టిరియాల నుంచి ఇది కాపాడుతుంది.
వీటిలో ఆర్గానిక్ సల్ఫర్ సమ్మేళనాలు అధికంగా కాబట్టి శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి. గుండె జబ్బులు, స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని కూడా ఇవి తగ్గిస్తాయి. వీటిని వండుకుని తిన్నా మంచివే, లేక పచ్చిగా తిన్నా చాలా మేలే. నిజానికి పచ్చివి తింటే మరిన్ని లాభాలు దక్కే అవకాశాలు ఉన్నాయి.
Also read: ఈ ఉద్యోగులు ఎంత అదృష్టవంతులో, రెండు వారాలు విదేశీ ట్రిప్పుకి తీసుకెళ్లిన బాస్
Also read: ఈ హోటల్‌లో ఉచితంగా ఉండొచ్చు, కానీ మీరు దానికి ఒప్పుకోవాలి