News
News
X

Viral news: ఈ ఉద్యోగులు ఎంత అదృష్టవంతులో, రెండు వారాలు విదేశీ ట్రిప్పుకి తీసుకెళ్లిన బాస్

కొన్ని కంపెనీలు ఉద్యోగులను సంతోషపెట్టడానికి ఎంతైనా ఖర్చుపెడతాయి.

FOLLOW US: 

కొన్ని కంపెనీలలో పనిచేసే ఉద్యోగులను చూస్తే వాళ్లెంత అదృష్టవంతులో అనిపిస్తుంది. ఇదిగో అలాంటి  అదృష్టవంతుల జాబితాలో ఈ ఉద్యోగులను చేర్చుకోవచ్చు. వారంతా ప్రపంచంలో బెస్ట్ బాస్ తమ బాసేనంటే మెచ్చుకుంటున్నారు. ఈ సంస్థను వదిలిపోమంటూ ఉబ్బితబ్బిబవుతున్నారు. ఆ కంపెనీని నడిపిస్తున్నది ఓ లేడీ బాస్. ఆ ఉద్యోగులు ఇంతగా ఎందుకు ఆనందపడుతున్నారంటే... వారి బాస్ ఉద్యోగులందరినీ రెండు వారాల ట్రిప్పుకు తీసుకెళ్లింది. అది ఖర్చులన్నీ తానే భరించింది. అంతే కాదు ఆ రెండు వారాలు పెయిట్ లీవ్ ప్రకటించింది. ఇంతకీ ఎక్కడికి తీసుకెళ్లిందో తెలుసా? ఇండోనేషియాలోని అందాల దీవి బాలీకి. 

ఇంతకీ ఏ సంస్థ?
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉంది మార్కెటింగ్ సంస్థ సూప్ ఏజెన్సీ. టీమ్ బిల్డింగ్ లో భాగంగా ఈ ట్రిప్ ను సంస్థ ఏర్పాటు చేసింది. ఉద్యోగులు ఎంత సంతోషంగా ఉంటే ఉత్పాదకత అంత బావుంటుందని ఆ సంస్థ భావించింది, అందుకే ఇలా విదేశీ ట్రిప్పులు ప్లాన్ చేసింది. బాలీలో ఉన్న అనేక అందమైన ప్రదేశాలను ఉద్యోగులకు తిప్పి చూపించారు. ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కాట్యా మాట్లాడుతూ ‘ పని సమయాల్లోనే కాదు, బయట కూడా మేమంతా ఒక టీమ్ గా ఉండడం ముఖ్యమని నేను భావిస్తున్నాను. ఇలాంటి ట్రిప్పులు బంధాన్ని బలపడేలా చేస్తాయని నమ్ముతున్నాను’ అని తన అభిప్రాయాన్ని పంచుకుంది. 

కరోనా వచ్చాక జీవితంలోనే కాదు ఉద్యోగంలో కూడా చాలా మార్పులు వచ్చాయని ఆమె అభిప్రాయపడ్డారు. ఎక్కడ్నించైనా పనిచేసుకోవడాన్ని కరోనా నేర్పిందని అన్నారు. బాలీలో ఉద్యోగుల కోసం విలాసవమైన విల్లాను బుక్ చేశారు. అక్కడే చాలా సేపు సేదతీరారు. అక్కడున్న అగ్నిపర్వాతాల మీదకి ఎక్కి కొత్త ప్రపంచాన్ని చూశారు ఉద్యోగులు. 

View this post on Instagram
 
A post shared by Soup Agency (@soup_agency)

Also read: ఈ హోటల్‌లో ఉచితంగా ఉండొచ్చు, కానీ మీరు దానికి ఒప్పుకోవాలి  

Also read: జనరిక్ మందులు అంటే ఏమిటో తెలుసా? అవెందుకు తక్కువ ధరకే దొరకుతాయంటే

Also read: తేనెను ఎలా వాడితే విషపూరితమవుతుందో చెప్పిన సద్గురు, ఇలా తింటే సేఫ్

Published at : 06 Jul 2022 12:57 PM (IST) Tags: Viral video Viral news Bali Good Company Comapny boss

సంబంధిత కథనాలు

Vitamin K2: విటమిన్ K2 - ఇది లోపిస్తే ఆరోగ్యానికి చేటు, ఈ ఆహారాన్ని ఎక్కువగా తీసుకోండి

Vitamin K2: విటమిన్ K2 - ఇది లోపిస్తే ఆరోగ్యానికి చేటు, ఈ ఆహారాన్ని ఎక్కువగా తీసుకోండి

Food: ఈ టేస్టీ ఫుడ్ వద్దు డూడ్, పొట్ట పెంచేస్తాయ్, పరేషాన్ చేసేస్తాయ్!

Food: ఈ టేస్టీ ఫుడ్ వద్దు డూడ్, పొట్ట పెంచేస్తాయ్, పరేషాన్ చేసేస్తాయ్!

Drinking Water: భోజనం మధ్యలో నీరు తాగితే బరువు పెరుగుతారా? ఈ అలవాటు వల్ల ఎన్ని నష్టాలో చూడండి

Drinking Water: భోజనం మధ్యలో నీరు తాగితే బరువు పెరుగుతారా? ఈ అలవాటు వల్ల ఎన్ని నష్టాలో చూడండి

Breakfast: మీ గుండె పదిలంగా ఉండాలంటే ఈ బ్రేక్ ఫాస్ట్ తినెయ్యండి

Breakfast: మీ గుండె పదిలంగా ఉండాలంటే ఈ బ్రేక్ ఫాస్ట్ తినెయ్యండి

Organ Donation: తొలి అవయవదానం ఎప్పుడు జరిగిందో తెలుసా? అవయవదానంపై ఉన్న అపోహలు - వాస్తవాలు ఇవే

Organ Donation: తొలి అవయవదానం ఎప్పుడు జరిగిందో తెలుసా? అవయవదానంపై ఉన్న అపోహలు - వాస్తవాలు ఇవే

టాప్ స్టోరీస్

Telangana TDP Votes : టీడీపీ మద్దతుంటే తెలంగాణలో విజయం ఖాయమా ? రాజకీయ పార్టీలేం ఆలోచిస్తున్నాయి ?

Telangana TDP Votes :  టీడీపీ మద్దతుంటే తెలంగాణలో విజయం ఖాయమా ? రాజకీయ పార్టీలేం ఆలోచిస్తున్నాయి ?

Karthikeya 2 Movie Review - కార్తికేయ 2 రివ్యూ : ద్వారకా నగరం - శ్రీకృష్ణుడు దాచిన రహస్యం - నిఖిల్ సినిమా ఎలా ఉందంటే?

Karthikeya 2 Movie Review - కార్తికేయ 2 రివ్యూ : ద్వారకా నగరం - శ్రీకృష్ణుడు దాచిన రహస్యం - నిఖిల్ సినిమా ఎలా ఉందంటే?

64 మెగాపిక్సెల్ కెమెరాతో 5జీ ఫోన్ - లాంచ్ చేసిన టెక్నో!

64 మెగాపిక్సెల్ కెమెరాతో 5జీ ఫోన్ - లాంచ్ చేసిన టెక్నో!

Balakrishna Watched Bimbisara : 'బింబిసార' చూసిన నందమూరి బాలకృష్ణ - బాబాయ్ అండ్ ఫ్యామిలీ కోసం అబ్బాయ్ స్పెషల్ షో

Balakrishna Watched Bimbisara : 'బింబిసార' చూసిన నందమూరి బాలకృష్ణ - బాబాయ్ అండ్ ఫ్యామిలీ కోసం అబ్బాయ్ స్పెషల్ షో