Free Hotel: ఈ హోటల్‌లో ఉచితంగా ఉండొచ్చు, కానీ మీరు దానికి ఒప్పుకోవాలి
రూపాయి ఖర్చు లేకుండా ఓ ఏసీ హోటల్ లో ఉండగలమా? ఓ హోటల్ అనుమతిస్తోంది.
![Free Hotel: ఈ హోటల్‌లో ఉచితంగా ఉండొచ్చు, కానీ మీరు దానికి ఒప్పుకోవాలి If you go there, you can stay in this hotel for free, but you have to accept it Free Hotel: ఈ హోటల్‌లో ఉచితంగా ఉండొచ్చు, కానీ మీరు దానికి ఒప్పుకోవాలి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/06/ca2ebca6df6c8f601e4274d658babdf51657090126_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఏసీ హోటల్ అంటే చాలా ప్రైవసీ ఉంటుంది, కోరిన ఆహారం వస్తుంది,లగ్జరీగా ఉంటుంది... అందుకే ఎక్కువ మంది ఫైవ్ స్టార్ హోటళ్లలో ఉండేందుకు ఇష్టపడతారు. కానీ సామాన్యులు ఆ ఖర్చును భరించలేరు. ఓ స్టార్ హోటల్ మాత్రం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎవరైనా తమ ప్రత్యేక సూట్‌లో వచ్చి ఉండొచ్చు. ఇందుకోసం రూపాయి కూడా ఛార్జ్ చేయరు. అందమైన గది, మెత్తటి పరుపు, కళ్లు చెదిరే ఫర్నిచర్... లోపల అడుగుపెడితే ఇంద్రభవనంలా ఉంటుంది. ఇది కనుక మీకు నచ్చితే వెళ్లి ఫ్రీగా ఉండొచ్చు. కాకపోతే ఒక షరతు మాత్రం ఉంది. ఆ గది గోడలు పారదర్శకమైన గాజుతో చేసినవి. మీరు లోపల చేసే ప్రతి పని బయటికి కనిపిస్తుంది. అందులోనూ ఈ గదిని హోటల్ లోకి అడుగుపెట్టగానే ఎంట్రన్స్ లోనే కట్టారు. పక్కన రిసెప్షన్ కూడా ఉంటుంది. వచ్చి పోయే వారందరికీ మీరు కనిపిస్తారు. ఈ షరతు వల్ల మీకు ఇబ్బంది లేకపోతే ఆ గదిని నచ్చినట్టు వాడుకోవచ్చు.
ఇంతకీ ఎక్కడ?
ఇలాంటి గది ఎక్కడుందా అని ఆలోచిస్తున్నారా? మన దేశంలో కాదు లెండి, స్పెయిన్‌లోని ఇబిజా అనే దీవిలో ఉంది ఈ హోటల్. పేరు పారడైజ్ ఆర్ట్ హోటల్. ఆ ప్రత్యేక గది పేరు ‘జీరో సూట్’. ఈ గదిలో ఎవరు ఉంటారో వారే ఆ హోటల్‌కి సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా మారిపోతారు. ఈ గదిలో ఉచితంగా ఒక్క రాత్రి మాత్రమే ఉండవచ్చు. డీజే, సినిమాలు, రేడియో కార్యక్రమాలు ఇలా చాలా కళాత్మక ప్రదర్శనలు ఆ గదిలో ఉన్నవారి కోసం ఏర్పాటు చేస్తారు.
బాత్రూమ్ సంగతి ఏంటి?
ఈ విషయంలో మాత్రం హోటల్ సిబ్బంది ఉదారతను చాటుకున్నారు. వాటికి మాత్రం అపారదర్శకమైన గోడలను పెట్టారు. ఈ గదిలో ఓ రాత్రి బస చేసిన వారు తమ అనుభవాలను పంచుకున్నారు. కొంతమంది ఆ గదిలో నిద్రపోవడం ఓ పీడకల అని కామెంట్ చేశారు. మరొక వ్యక్తి ‘ఆ గదిలో నిద్రపోతే నాకు దుస్తుల్లేకుండా పబ్లిక్‌లో నిద్రపోయిన ఫీలింగ్ వచ్చింది’ అని అన్నారు.
కేవలం తమ హోటల్ ప్రచారం కోసమే ఇలాంటి వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది యాజమాన్యం.
View this post on Instagram
Also read: జనరిక్ మందులు అంటే ఏమిటో తెలుసా? అవెందుకు తక్కువ ధరకే దొరకుతాయంటే
Also read: తేనెను ఎలా వాడితే విషపూరితమవుతుందో చెప్పిన సద్గురు, ఇలా తింటే సేఫ్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)