Chapathi or Phulka: చపాతి, పూరీ, పుల్కా... వీటిల్లో ఏది తింటే మంచిది?
బరువు తగ్గడానికి ప్రయత్నించే వాళ్లు చపాతీ, పుల్కా తింటుంటారు. కొంతమంది గోధుమ పిండితో చేసిన పూరీ తింటారు. వీటిల్లో ఏది తింటే ఆరోగ్యమో తెలుసా?
ఒక ఆహార పదార్థం మంచిదా? కాదా? అని ఎలా నిర్ణయిస్తాం. అందులో వాడే పదార్థాలు, వండే విధానాన్ని బట్టి అది మంచిదా, కాదా అంచనా వేస్తాం. బరువు తగ్గేందుకు ప్రయత్నించే వాళ్లంతా తినేది చపాతీలు, పుల్కాలే. పూరీలు తినేవాళ్లు కూడా ఉన్నారు. కానీ ఈ మూడింటిలో ఏవి తింటే ఆరోగ్యమో తెలుసుకోవాలన్న ఆత్రుత మాత్రం అందరిలో ఉంది.
ఓసారి గుండ్రంగా ఒత్తి నూనెలో వేయిస్తే పూరీ అవుతుంది. ఇది నూనెకి నిలయం. తక్కువ తినడం చాలా మేలు. మైదాపిండితో చేసే పూరీలకు పూర్తిగా దూరంగా ఉండడం మంచిది. గోధుమపిండి పూరీలను అప్పుడప్పుడు తినొచ్చు. ఒంటిపొర మీద ఒత్తితే పుల్కా అవుతుంది. దీనికి నూనె అవసరం లేదు. నేరుగా నిప్పు మీద కాల్చి తింటారు. ఇక నాలుగు మడతలు పెట్టి, లోపల కాస్త నూనెను వేసి ఒత్తి, పెనంపై నూనెలో కాల్చేది చపాతి. పూరీలు, చపాతీల తయారీలో నూనె అవసరం పడుతుంది. ఇవి బరువు పెరిగేందుకు, చెడు కొలెస్ట్రాల్ పెరిగేందుకు సహకరిస్తాయి. కానీ పుల్కాలకు నూనె అవసరం లేదు. కనుక ఇవి తింటే బరువు పెరిగే అవకాశం లేదు. అలాగే కొలెస్ట్రాల్ కూడా ఒంట్లో చేరదు. ఈ మూడింటిలో పుల్కానే మంచిదని చెప్పవచ్చు. షుగర్ వ్యాధిగ్రస్తులకు, గుండె జబ్బుల వారికి, ఊబకాయులకు పుల్కా చాలా మంచి చేస్తుంది.
పుల్కాలు తినడం వల్ల రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. మలబద్దకం సమస్య కలుగదు. జీర్ణవ్యవస్థను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. పుల్కాలు తింటున్నప్పుడు దానికి జతగా తాజా కూరగాయలతో వండిన కూరలు తినడం అత్యవసరం. బరువు తగ్గాలనుకునే వారు పుల్కాలకు జతగా పనీర్ వంటి కూరలను తినడం వల్ల పెద్దగా ఉపయోగం లేదు.
నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ప్రకారం రెండు పుల్కాలు తింటే దాదాపు 70 నుంచి 100 కేలరీలు శరీరంలోకి చేరతాయి. గోధుమపిండిలో ఉండే విటమిన్ బి1, ఒంట్లో చేరే ఫ్రీరాడికల్స్ తో పోరాడుతుంది. పుల్కా ద్వారా కాల్షయం, మెగ్నీషియం, ఫాస్పరస్, సోడియం వంటివి శరీరానికి అందుతాయి.
Also read: బంగాళాదుంపలతో చేసిన వంటలను రుచి చూసే ఉద్యోగం... జీతం ఎంతంటే...
Also read: మనం తినే ఆహారం సరిపోదంట.... మరికొంచెం గట్టిగా తినమంటున్నారు...
Also read: విఘ్నాధిపతికి గోధుమ కుడుముల నైవేద్యం...
Also read: ఎర్రబియ్యం తింటే బానపొట్ట మాయం... మధుమేహులకు అమృతం
Also rad: నిజమేనా.... మిలిటరీ డైట్ తో వారంలో బరువు తగ్గొచ్చా?