News
News
X

Ayurvedam: మానసిక ఆందోళనకు అశ్వగంధారిష్టతో చెక్ పెట్టొచ్చు, దీనితో ఇంకా ఎన్నో లాభాలు

ఎలాంటి సైడ్ ఎఫెక్టులు లేకుండా పనిచేసే మందులు ఆయర్వేదంలో ఉన్నాయి.

FOLLOW US: 
Share:

అల్లోపతి వెంటనే రోగంపై ప్రభావం చూపిస్తుంది. అందుకే ఇప్పుడు దానిని ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు. కానీ ఈ మందులు వేసుకుంటే కొందరిలో సైడ్ ఎఫెక్టులు వచ్చే అవకాశం ఉంది. కానీ ఆయుర్వేదం మందులో కాస్త నెమ్మదిగా సమస్య ప్రభావం చూపినప్పటికీ ప్రభావవంతంగా పనిచేస్తాయి. ముఖ్యంగా ఎలాంటి సైడ్ ఎఫెక్టులు ఉండవు. ఆధునిక జీవితంలో ఒత్తిళ్ల మధ్య నలిగిపోతున్న మనుషుల్లో మానసిక సమస్యల పెరిగిపోతున్నాయి. యాంగ్జయిటీ ఎక్కువ మందిని వేధిస్తుంది. ఇది పెద్ద సమస్య కాకపోయినా, పెట్టే ఇబ్బంది మాత్రం ఎక్కువే. చికిత్స తీసుకోకపోతే గుండెపై ఒత్తిడిపడేలా చేస్తుంది. ప్రశాంతంగా నిద్రపోనివ్వదు, తిననివ్వదు. అందుకే మానసిక ఆందోళన లక్షణాలు కనిపిస్తే కచ్చితంగా చికిత్స తీసుకోవాలి. ఆయుర్వేదంలో దీనికి మంచి మందు ‘అశ్వగంధారిష్ట’. దీన్ని అశ్వగంధతో పాటూ మంజిష్ట, శ్రీగంధం,వస వంటి 23 మూలికలు వేసి తయారు చేస్తారు.

యాంటీ డిప్రెసెంట్..
అశ్వగంధ వల్లే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఇక అశ్వగంధారిష్ట వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కొందరికి ఎంత తిన్నా శారీరక అలసట వేధిస్తుంది. అలాంటి వారికి అశ్వగంధారిష్ట మేలు చేస్తుంది. అలాగే మానసిక ఆందోళనతో బాధపడేవారు ఉదయం, సాయంత్రం రెండు సార్లు అశ్వాగంధారిష్టను తీసుకోవాలి. ఎంత మోతాదు తీసుకోవాలో ఆయుర్వేద వైద్యులను సంప్రదించాలి. సొంతంగా తీసుకోవడం మంచిది కాదు. ఏ మందులు పనిచేయమని శరీరాలపై కూడా అశ్వగంధారిష్ట ప్రభావవంతంగా పనిచేస్తోంది ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. దీన్ని యాంటీ డిప్రెసెంట్ గా పిలుస్తారు. జ్ఞాపకశక్తి తగ్గుతున్నవారు దీన్ని వాడవచ్చు. అలాగే డిప్రెషన్, మూర్ఛ, స్కిజోఫ్రెనియా, నీరసం, బధ్దకం వంటివి తగ్గడానికి కూడా దీన్ని సూచిస్తారు ఆయుర్వేద వైద్యులు. 

అశ్వగంధ అంటే...
దీన్ని తెలుగు పెన్నెరుగడ్డ అంటారు. ఇది చిన్న మొక్క. వేరుతో పాటూ దుంపలు ఏర్పడతాయి. ఆ దుంపలనే ఔషధాలలో వాడతారు. ఈ దుంప వాసన గుర్రం నుంచి వచ్చే వాసనలా ఉంటుంది. అందుకే దీనికి అశ్వగంధ అని పేరు పెట్టారు.  అశ్వగంధ, అశ్వగంధారిష్ట... రెండు వేరు వేరు ఔషధాలు. రెండు కూడా మంచివే. అశ్వగంధలో కేవలం ఆ దుంప పొడి మాత్రమే ఉంటుంది. కానీ అశ్వగంధారిష్టలో అశ్వగంధతో పాటూ మరిన్ని మూలికలు కలిపి ఉంటాయి. అయితే ఈ మందులు వెంటనే ప్రభావం చూపించవు. రోజూ తీసుకుంటే దాదాపు నెల రోజులకు మీకు ప్రభావం కనిపిస్తుంది. 

Also read: డయాబెటిస్ ఉంటే బంగాళాదుంపలు తినడం పూర్తిగా మానేయక్కర్లేదు, ఇలా వండుకుని తినండి

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Published at : 14 Dec 2022 09:41 AM (IST) Tags: Anxiety Mental anxiety Ayurvedam tips for anxiety Ayurvedam medicine Ashwagandharishta

సంబంధిత కథనాలు

కడుపులో మంటగా ఉందా? ఈ ఆయుర్వేద చిట్కాలతో వెంటనే ఉపశమనం

కడుపులో మంటగా ఉందా? ఈ ఆయుర్వేద చిట్కాలతో వెంటనే ఉపశమనం

Triphala Churnam: త్రిఫల చూర్ణం తీసుకుంటే అందం, ఆరోగ్యం- దాన్ని ఎలా తీసుకోవాలంటే?

Triphala Churnam: త్రిఫల చూర్ణం తీసుకుంటే అందం, ఆరోగ్యం- దాన్ని ఎలా తీసుకోవాలంటే?

Belly Fat: పొట్ట దగ్గర కొవ్వు కరగడం లేదా? ఈ ఆయుర్వేద మార్గాలు ట్రై చేసి చూడండి

Belly Fat: పొట్ట దగ్గర కొవ్వు కరగడం లేదా? ఈ ఆయుర్వేద మార్గాలు ట్రై చేసి చూడండి

Stomach Bloating: పొట్ట ఉబ్బరంగా ఉంటుందా? భోజనం చేసిన తర్వాత ఇలా చేస్తే ఆ సమస్య ఉండదు

Stomach Bloating: పొట్ట ఉబ్బరంగా ఉంటుందా? భోజనం చేసిన తర్వాత ఇలా చేస్తే ఆ సమస్య ఉండదు

Water: నిలబడి నీళ్ళు తాగుతున్నారా? అలా అసలు చేయొద్దు, ఈ సమస్యలు వేధిస్తాయ్

Water: నిలబడి నీళ్ళు తాగుతున్నారా? అలా అసలు చేయొద్దు, ఈ సమస్యలు వేధిస్తాయ్

టాప్ స్టోరీస్

Demand For TDP Tickets : టీడీపీ టిక్కెట్ల కోసం ఫుల్ డిమాండ్ - యువనేతలు, సీనియర్ల మధ్య పోటీ !

Demand For TDP Tickets :  టీడీపీ టిక్కెట్ల కోసం ఫుల్ డిమాండ్ - యువనేతలు, సీనియర్ల మధ్య పోటీ !

Butta Bomma Movie Review - 'బుట్ట బొమ్మ' రివ్యూ : మలయాళ హిట్ 'కప్పేలా' తెలుగు రీమేక్ ఎలా ఉందంటే?

Butta Bomma Movie Review - 'బుట్ట బొమ్మ' రివ్యూ : మలయాళ హిట్ 'కప్పేలా' తెలుగు రీమేక్ ఎలా ఉందంటే?

Twitter Ad Revenue Share: ట్విట్టర్ ద్వారా సంపాదన కూడా - కానీ అది మాత్రం కంపల్సరీ!

Twitter Ad Revenue Share: ట్విట్టర్ ద్వారా సంపాదన కూడా - కానీ అది మాత్రం కంపల్సరీ!

SBI Q3 Result: రికార్డ్‌ సృష్టించిన స్టేట్‌ బ్యాంక్‌, గతం ఎన్నడూ ఇన్ని లాభాలు కళ్లజూడలేదు

SBI Q3 Result: రికార్డ్‌ సృష్టించిన స్టేట్‌ బ్యాంక్‌, గతం ఎన్నడూ ఇన్ని లాభాలు కళ్లజూడలేదు