News
News
X

ఈ ఆయుర్వేద చిట్కాలు పాటిస్తే ఛాతీలోని కఫం, దగ్గు త్వరగా తగ్గిపోతాయి

చల్లని ఆహారం తినడం వల్ల, చల్లని వాతావరణం వల్ల ఛాతీలో కఫం పట్టేస్తుంది.

FOLLOW US: 
Share:

చలికాలంలో దగ్గు, కఫంతో బాధపడే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి రెండు, మూడు రోజుల్లోనే సమస్య తగ్గితే, మరి కొందరు వారాల తరబడి ఆ సమస్యతో బాధపడుతూ ఉంటారు. దగ్గు మందులు, టాబ్లెట్లు వాడినా మళ్లీ తరచూ ఆ సమస్య బారిన పడుతుంటారు. ఛాతీలో పట్టిన కఫం పోయి, దానివల్ల వచ్చే దగ్గు తగ్గడానికి ఆయుర్వేదం మంచి చిట్కాను చెబుతోంది. దీన్ని పాటించడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్టులు ఉండవు. పైగా ఇందులో అన్ని సహజమైనవే వాడతాం కాబట్టి ఆరోగ్యానికి ఇతర రకాలుగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇంట్లోనే ఈ ఆయుర్వేద మందును తయారు చేసుకోవచ్చు. 

ఏం చేయాలంటే 
ఆయుర్వేదం చెప్పిన ఈ మందును తయారు చేయడానికి ఇంట్లో ఉండే పదార్థాలే సరిపోతాయి. స్టవ్ మీద రెండు గ్లాసుల నీళ్లను పోసి గిన్నెను పెట్టాలి. ఆ నీళ్లు వేడెక్కుతున్నప్పుడే రెండు వెల్లుల్లి రెబ్బలను దంచి వేయాలి. అలాగే పది మిరియాలు, పది లవంగాలు, చిన్న అల్లం ముక్కను కూడా బాగా దంచి అందులో కలిపి మరిగించాలి. చివర్లో ఆరు తులసి ఆకులు, గుప్పెడు పుదీనా ఆకులు, చిటికెడు పసుపు కూడా వేసి మరిగించాలి. ఇవన్నీ బాగా మరిగాక కషాయంలా తయారవుతాయి. అప్పుడు గోరువెచ్చగా మారాక వడకట్టుకోవాలి. ఆ కషాయాన్ని కాఫీ తాగుతున్నట్టు సిప్ చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఛాతిలోని కఫం త్వరగా వదిలేస్తుంది. 

ఈ కషాయాన్ని ఫ్రిజ్లో దాచుకొని మళ్ళీ వేడి చేసుకొని రెండు, మూడు రోజుల పాటూ తాగడం లాంటివి చేయకూడదు. అలా చేయడంవల్ల అది ప్రభావవంతంగా పనిచేయదు. కఫంతో బాధపడుతున్నప్పుడు మూడు రోజులు పాటు ఈ కషాయాన్ని రోజూ తాగాలి. ఈ కషాయంలో వాడిన పదార్థాలన్నీ ఉత్తమమైనవే. వాటిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి కఫం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటివి త్వరగా తగ్గిపోతాయి. ఈ కషాయం రోగనిరోధక శక్తిని పెంచి ఇలాంటి వ్యాధులు ఏవి రాకుండా కాపాడుతుంది. దీని రుచి కూడా అంత ఇబ్బందిగా ఉండదు. కాబట్టి పిల్లలకు కూడా తాగించవచ్చు. దీనివల్ల కలిగే దుష్ప్రభావాలు ఏవీ ఉండవు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేకుండా ధైర్యంగా ఈ కషాయాన్ని రోజుకి ఒకసారి లేదా రెండుసార్లు తాగవచ్చు. తులసి, వెల్లుల్లి, లవంగాలు, అల్లం, మిరియాలలో ఎన్నో ఔషధగుణాలు ఉంటాయి. ఇవన్నీ కూడా శరీర సమస్యలను దూరం చేసేందుకు సహకరిస్తాయి. 

Also read: ఆల్కహాల్ అలెర్జీ ఉన్నవారిలో గుండెపోటు వచ్చే అవకాశం నాలుగు రెట్లు ఎక్కువ

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Published at : 08 Feb 2023 06:32 AM (IST) Tags: Ayurvedic tips Tips for Cough Chest Phlegm Phlegm and cough

సంబంధిత కథనాలు

Dal: పప్పు వండడానికి ముందు నీళ్లలో నానబెట్టమని చెబుతుంది ఆయుర్వేదం, ఎందుకు?

Dal: పప్పు వండడానికి ముందు నీళ్లలో నానబెట్టమని చెబుతుంది ఆయుర్వేదం, ఎందుకు?

పొడి దగ్గు వేధిస్తున్నప్పుడు, ఆయుర్వేదం చెప్పిన ఈ చిట్కాలను పాటించండి

పొడి దగ్గు వేధిస్తున్నప్పుడు, ఆయుర్వేదం చెప్పిన ఈ చిట్కాలను పాటించండి

Eyes: కళ్లు పొడిబారిపోతున్నాయా? ఈ ఆయుర్వేద చిట్కాలతో సాంత్వన పొందండి

Eyes: కళ్లు పొడిబారిపోతున్నాయా? ఈ ఆయుర్వేద చిట్కాలతో సాంత్వన పొందండి

Diabetic Retinopathy: మధుమేహం వల్ల వచ్చే అంధత్వాన్ని అడ్డుకోవచ్చు, ఇవిగో ఆయుర్వేద చిట్కాలు

Diabetic Retinopathy: మధుమేహం వల్ల వచ్చే అంధత్వాన్ని అడ్డుకోవచ్చు, ఇవిగో ఆయుర్వేద చిట్కాలు

Cough: దగ్గుతో బాధపడుతుంటే కేవలం 10 నిమిషాల్లో ఇలా సిరప్‌ను ఇంట్లోనే తయారు చేసుకోండి

Cough: దగ్గుతో బాధపడుతుంటే కేవలం 10 నిమిషాల్లో ఇలా సిరప్‌ను ఇంట్లోనే తయారు చేసుకోండి

టాప్ స్టోరీస్

ఎమ్మెల్సీ కవిత జగిత్యాల పర్యటనలో అపశృతి- టూర్ రద్దు చేసుకొని తిరిగి పయనం

ఎమ్మెల్సీ కవిత జగిత్యాల పర్యటనలో అపశృతి- టూర్ రద్దు చేసుకొని తిరిగి పయనం

మంత్రివర్గ విస్తరణలో జగన్ టార్గెట్స్‌ ఇవేనా- మరి సీనియర్లు ఏమనుకుంటున్నారు?

మంత్రివర్గ విస్తరణలో జగన్ టార్గెట్స్‌ ఇవేనా- మరి సీనియర్లు ఏమనుకుంటున్నారు?

నిజామాబాద్‌లో ఫ్లెక్సీ వార్- నిన్న పసుపు బోర్డుపై బీఆర్‌ఎస్‌ సైటర్‌- నిరుద్యోగ భృతి ఎక్కడా అంటూ బీజేపీ కౌంటర్

నిజామాబాద్‌లో ఫ్లెక్సీ వార్- నిన్న పసుపు బోర్డుపై బీఆర్‌ఎస్‌ సైటర్‌-  నిరుద్యోగ భృతి ఎక్కడా అంటూ బీజేపీ కౌంటర్

శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో టెన్షన్ టెన్షన్ - పల్లె రఘునాథ్ రెడ్డి వర్సెస్‌ శ్రీధర్ రెడ్డి

శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో టెన్షన్ టెన్షన్ - పల్లె రఘునాథ్ రెడ్డి వర్సెస్‌ శ్రీధర్ రెడ్డి