By: Haritha | Updated at : 12 Feb 2023 08:54 AM (IST)
(Image credit: Pixabay)
ప్రపంచంలో అధిక శాతం మంది హైపర్ టెన్షన్ లేదా హైబీపీతో బాధపడుతున్నట్టు అంచనా. చాలామందిలో హై బీపీ తీవ్ర స్థాయికి చేరుకునే వరకు పట్టించుకోరు. ఆ తర్వాత వైద్యుడు వద్దకు పరుగులు తీస్తారు. తలనొప్పి, జ్వరం, ఒళ్ళు నొప్పులు, దగ్గు వంటివి బీపీ పెరిగితే కనిపించే లక్షణాలు. ఒకప్పుడు వయసు పెరిగాక మాత్రమే హైబీపీ వచ్చేది. ఇప్పుడు 18 ఏళ్ల వయసు నుంచి కూడా హైపర్ టెన్షన్ లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ప్రతి ముగ్గురిలో ఒకరికి హైబీపీ ఉంటున్నట్టు వైద్యుల అంచనా.
ఇది ఎందుకు వస్తుందో కచ్చితంగా చెప్పలేము. వంశపారంపర్యంగా కూడా హైపర్ టెన్షన్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆధునిక కాలంలో ఆరోగ్యకరమైన ఆహారం తినడం తగ్గించేసింది యువత. ప్రాసెస్డ్ ఫుడ్, పిజ్జాలు, బర్గర్లు, నిల్వచేసిన మాంసం, కూల్ డ్రింకులు, ఫ్రిజ్ లో ఎక్కువ కాలం నిల్వ చేసిన పదార్థాలు తినడం వల్ల కూడా హైబీపీ వస్తున్నట్లు అంచనా. ఉప్పు అధికంగా వాడడం వల్ల హై బీపీ త్వరగా వచ్చేస్తుంది. టెన్షన్ కూడా హైబీపీ వచ్చే అవకాశాన్ని పెంచుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ లో ఎక్కువగా తిరిగేవారు ఈ టెన్షన్ బారిన పడుతున్నారు.
ఆయుర్వేదం ప్రకారం అధిక రక్తపోటు వాత, పిత్త, కఫ అనే మూడు దోషాలలో అసమతుల్యత వల్ల వస్తుంది. శరీరంలో టాక్సిన్స్ చేరడం, చెడు జీవనశైలి, వ్యాయామం లేకుండా నిశ్చలంగా ఉండడం, జీవక్రియ సరిగా జరగకపోవడం వంటివి కూడా అధిక రక్తపోటుకు కారణాలు. అయితే ఆయుర్వేదంలో అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచే ఒక అద్భుత ఔషధం ఉంది.
ఇదొక్కటి చాలు
హైబీపీ బారిన పడినవారు దాన్ని అదుపులో ఉంచాలనుకుంటే ఆయుర్వేదం చిట్కాను సూచిస్తోంది. ప్రతిరోజు ఉదయం పాలలో రెండు మూడు గ్రాముల అర్జున బెరడు పొడిని కలుపుకొని తాగాలి. ఇది రక్తపోటును తగ్గించడమే కాదు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే శక్తివంతమైన ఔషధం.
దీన్ని ఎలా చేయాలంటే
ఈ పానీయాన్ని ఇంట్లో సులభంగా చేసుకోవచ్చు. ముందుగానే అర్జున చెట్టు బెరడు పొడిని కొని ఇంట్లో పెట్టుకోవాలి. ఒక కప్పు పాలను మరిగించి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ పొడిని వేయాలి. ఇలా రోజుకు రెండుసార్లు ఈ పాలను తాగడం వల్ల మార్పు మీకే కనిపిస్తుంది. రక్త పోటు అదుపులో ఉంటుంది. అలాగే తాజా ఆకుకూరలు, కూరగాయలు తింటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. దీని వల్ల రక్తపోటు పెరగదు. అర్జున చెట్టు ఎక్కడైనా కనిపిస్తే దాని బెరడు ఒలిచి ఎండబెట్టుకుని పొడి చేసి దాచుకోండి.
Also read: సీతాఫలం, రామాఫలం తెలుసు -మరి మీకు హనుమాన్ ఫలం తెలుసా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
పొడి దగ్గు వేధిస్తున్నప్పుడు, ఆయుర్వేదం చెప్పిన ఈ చిట్కాలను పాటించండి
Eyes: కళ్లు పొడిబారిపోతున్నాయా? ఈ ఆయుర్వేద చిట్కాలతో సాంత్వన పొందండి
Diabetic Retinopathy: మధుమేహం వల్ల వచ్చే అంధత్వాన్ని అడ్డుకోవచ్చు, ఇవిగో ఆయుర్వేద చిట్కాలు
Cough: దగ్గుతో బాధపడుతుంటే కేవలం 10 నిమిషాల్లో ఇలా సిరప్‌ను ఇంట్లోనే తయారు చేసుకోండి
Constipation: మలబద్దకంతో ముప్పుతిప్పలు పడుతున్నారా? ఈ ఆయుర్వేద చిట్కాలు పాటించండి
Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు
Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు
Nani Eating Vada Pav: ‘దసరా‘ దేశ యాత్ర - ముంబైలో వడాపావ్ తిన్న నాని!
Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి