Tamilnadu Omicron : తమిళనాడుపై ఒమిక్రాన్ పంజా.. మరో పదకొండు పాజిటివ్ కేసులు నమోదు !
తమిళనాడులో మరో 11 ఒమిక్రాన్ వేరియంట్ కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 45కి చేరుకుంది.
![Tamilnadu Omicron : తమిళనాడుపై ఒమిక్రాన్ పంజా.. మరో పదకొండు పాజిటివ్ కేసులు నమోదు ! 11 New Omicron Cases reports in Tamilnadu Covid 19 Variant total case tally 45 in TN Tamilnadu Omicron : తమిళనాడుపై ఒమిక్రాన్ పంజా.. మరో పదకొండు పాజిటివ్ కేసులు నమోదు !](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/27/6a8638ae863d46fa97294909ca72b1c4_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
తమిళనాడులో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో మరో 11 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తంగా తమిళనాడులో ఒమిక్రాన్ కేసులు 45 వరకు ఉన్నాయి. తమిళనాడులో ఐదు రోజుల క్రితం ఒక్క రోజే 33 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ సోకిన వారిలో అత్యధికులు విదేశాల నుంచి వస్తున్నారు. కొంతమంది ఇతర రాష్ట్రాల ఎయిర్ పోర్టుల్లో దిగి తమిళనాడుకు వస్తున్నారు. ఒమిక్రాన్ బారిన పడుతున్న వారిలో అందరూ రెడు డోసుల వ్యాక్సిన్లు తీసుకున్న వారే. కొత్తగా నమోదైన కేసుల్లో పెద్దగా లక్షణాలతో బాధపడుతున్నవారు లేరని.. ఒకరిద్దరిలో మాత్రం స్వల్పంగా గొంతునొప్పి, వికారం వంటి లక్షణాలు కనిపించాయని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. అనుమానితుల శాంపిల్స్‌ను ఎప్పటికప్పుడు జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపుతున్నారు.
Also Read: AP BJP : బెయిల్‌పై ఉన్న నేతలు జైలుకెళ్లడం ఖాయం... ప్రజాగ్రహ సభలో ప్రకాష్ జవదేకర్ జోస్యం !
తమిళనాడు సర్కార్ సరిహద్దు ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల నుంచి వచ్చే వారికీ వైద్య బృందం వైద్య పరీక్షలు నిర్వహించేలా సరిహద్దుల్లో వైద్య బృందాలను స్టాలిన్ సర్కార్ నియమించింది. జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు. ఇతర రాష్ట్రాల్లోనూ ఒమిక్రాన్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. కేరళతో పాటు ఇతర తమిళనాడు పొరుగు రాష్ట్రాల్లోనూ పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటంది.
Also Read: CJI NV Ramana: తెలుగు ప్రజల ఆశీర్వాద బలం వల్లే ఈ స్థాయికి... ఏపీ పర్యటన చాలా సంతోషానిచ్చింది... సీజేఐ బహిరంగ లేఖ
ప్రపంచదేశాలను కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వణికిస్తోంది. కొత్త వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. రోజు రోజుకూ ఒమిక్రాన్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. అమెరికాలో ఒమిక్రాన్ వేరియంట్ పంజా విసురుతోంది. రోజురోజుకీ ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఆయా దేశాల నుంచి వచ్చే వారి నుంచి ఇతర దేశాలకూ విస్తరిస్తోంది. అయితే ఇప్పటి వరకూ ఆ వేరియంట్ బారిన పడి చనిపోయిన వారి శాతం ఎక్కువగా ఉందని ఎలాంటి రిపోర్టులు రాలేదు. ఎక్కువ మంది ఆస్పత్రి పాలు కావడం లేదు. జాగ్రత్తలు తీసుకుంటే ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం లేకుండానే క్యూర్అయిపోతోంది. అయితే వ్యాప్తి ఎక్కువ కావడంతో .. వైరస్ సోకిన వారి నుంచి ఇతరులకు సోకకుండా ఆపడానికే యంత్రాంగం ప్రాధాన్యం ఇస్తోంది.
Also Read: Hindupuram Balakrishna : హిందూపురంలో డంపింగ్ యార్డ్ వివాదం.. బాలకృష్ణ ఇంటి ముట్టడితో ఉద్రిక్తత!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)