Fact Check : సమీక్షలో పవన్ మైక్ విసిరికొట్టారంటూ వైరల్ వీడియో - అసలు నిజం మాత్రం వేరే
Pawan Kalyan : పవన్ కల్యాణ్ మైక్ విసిరికొట్టారని ఓ ఎడిటెడ్ వీడియో వైరల్ అయింది. కానీ ఆ వీడియో తప్పుదోవ పట్టించేందుకు వైరల్ చేస్తున్నారని ఫ్యాక్ట్ చెక్ లో తేలింది.
Fact Check Pawan Kalyan :
క్లెయిమ్ ఏమిటి ?
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యావరణ శాఖను నిర్వహిస్తున్నారు. ఈ శాఖకు సంబంధించిన సమీక్ష సమావేశం శుక్రవారం రోజు అమరావతిలో జరిగింది. అందులో పవన్ కల్యాణ్ ఏదో మాట్లాడటానికి మైక్ తీసుకన్నారు. అయితే మాట్లాడబోయే అంతలో మైక్ తీసి టేబుల్ మీద పెట్టేసి..లేచి వెళ్తున్నట్లుగా దృశ్యాలు ఉన్నాయి.
పవన్ కల్యాణ్ తాను సమావేశంలో ఏం మాట్లాడాలో మర్చిపోయారని అందుకే మైక్ విసిరికొట్టి వెళ్లిపోయారని కొంత మంది సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. మరికొంత మంది అసహనంతో వెళ్లిపోయారని ప్రచారం చేస్తున్నారు. వాటిని ఇక్కడ చూడవచ్చు.
ఈ పోస్టులన్నీ రాజకీయ పార్టీ మద్దతుదారులవి. వీటికి ఆయా పార్టీల మద్దతుదారుల నుంచి ప్రోత్సహం లభించింది. పెద్ద ఎత్తున వ్యూస్ , షేర్స్ వచ్చాయి. అందుకే అనేక మందికి ఇది రీచ్ అయింది.
ఒరిజినల్ వీడియో, వైరల్ వీడియో (Source : X )
మేము తెలుసుకున్నదేంటి?
ఈ వీడియో తప్పుదోవ పట్టించేదిగా ఉన్నట్లుగా కనిపిచండంతో మేము ఈ వీడియోను పరిశీలన చేశాము. పవన్ కల్యాణ్ సమావేశంలో మాట్లాడింది.. మైక్ ను విసురుగా టేబుల్ పై పెట్టింది కూడా నిజమే కానీ ఆయన అది అసహనంతోనే.. అసంతృప్తితోనే చేయలేదు. అలాగే సమావేశం నుంచి బయటకు వెళ్లలేదు. మైక్ అక్కడ పెట్టి డయాస్ మీద ఉన్న మైక్ లో మాట్లాడేందుకు వెళ్లారు. వీడియోను ఎడిట్ చేయకుండా పూర్తిగా పోస్టు చేసి ఉంటే ఈ విషయం స్పష్టమయ్యేది.
పవన్ కల్యాణ్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మద్దతుదారులు పూర్తి వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.
కంక్లూజన్
పవన్ కల్యాణ్ సెలబ్రిటీ డిప్యూటీ సీఎం . ఆయన మాటల్ని వక్రీకరించేందుకు .. ఆయన కర్చీలో కూర్చుంటున్నప్పుడు. లేచేటప్పుడు మాట్లాడేటప్పుడు చిన్న చిన్న వీడియోలుగా విడదీసి తప్పులు వెదికి వైరల్ చేస్తున్నారు. ఈ విషయంలోనూ అదే జరిగింది. అక్కడ పవన్ కల్యాణ్ మైక్ ను విసిరి కొట్టలేదు. ఆయన మాట్లాడాల్సింది మర్చిపోలేదు. కేవలం మైక్ ను అక్కడ పెట్టి.. డయాస్ మీద ఉన్న మైక్ లో మాట్లాడేందుకు వెళ్లారు. అంటే.. ఆ వీడియోలు పూర్తిగా మిస్ లీడింగ్ చేసేలా ఉన్నాయి.
This story was originally published by ABP Desam as part of the Shakti Collective.