Zeenat Aman: ప్రతి సినిమాలో స్నానం సీన్లు, ‘సత్యం శివం సుందరం’ అశ్లీలత అనిపించలేదు : జీనత్ అమన్
Zeenat Aman: బాలీవుడ్ సీనియర్ నటి జీనత్ అమన్ తన సినిమాల్లోని బాత్ సీన్ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ సన్నివేశాలు ఉండటం వల్లే నిర్మాతలకు కలెక్షన్ల వర్షం కురిసేదని చెప్పారు.
Zeenat Aman: ప్రముఖ సెలబ్రిటీ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’ 8వ సీజన్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. రీసెంట్ గా బాలీవుడ్ క్యూట్ బ్యూటీస్ జాన్వీ కపూర్, కుషి కపూర్ పాల్గొని సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు. ఇక ఈ సీజన్ 12వ ఎపిసోడ్ లో బాలీవుడ్ సీనియర్ నటీమణులు నీతూ కపూర్, జీనత్ అమన్ కనిపించబోతున్నారు. వీరిద్దరు కలిసి పలు చిత్రాల్లో నటించారు. రీసెంట్ గా ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది. ఇందులో ఇద్దరు నటీమణులు కీలక విషయాలను వెల్లడించారు. తమ సినిమాలు, పర్సనల్ అంశాలు, ఎవరికీ తెలియని విషయాల గురించి మాట్లాడారు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
బాత్ సీన్లు ఉంటే నిర్మాతలకు కాసుల వర్షం కురిసేది!
ఇటీవల జీనత్ తన సినిమాల గురించి, సినిమాల్లో తను చేసిన బాత్ సీన్ల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అప్పట్లో తాను సినిమాల్లో చాలా రొమాంటిక్ గా కనిపించేదాన్ని అని చెప్పారు. తన సినిమాలో బాత్ సీన్ ఉందటే చాలు నిర్మాతలకు డబ్బుల వర్షం కురిసేదని చెప్పుకొచ్చారు. అప్పట్లో తన సినిమా అంటే కచ్చితంగా నీళ్లలో స్నానం చేసే సన్నివేశాలు ఉంటాయని ప్రేక్షకులు బలంగా నమ్మేవారని వెల్లడించారు. ఒకటి రెండు కాదు, తను నటించిన చాలా చిత్రాలో నీళ్లలో జలకాలాడే సన్నివేశాలు ఉన్నాయని వివరించారు. ‘పుకార్’ చిత్రంలో 'సముదర్ మే నహకే ఔర్ భీ నమ్‌కీన్ హో గయీ హో', ‘అజ్ఞాతవాసి’ చిత్రంలో 'భీగీ భీగీ రాతోన్ మే', ‘రోటీ కప్డా ఔర్ మకాన్’లో 'హై హై యే మజ్బూరి', 'భోర్ భాయే పంఘత్ పే' పాటలతో పాటు ‘సత్యం శివం సుందరం'లో జలపాతం కింద స్నానం చేసే సన్నివేశం ఇప్పటికే ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది.
అశ్లీలత ఆరోపణలపై స్పందించిన జీనత్
అయితే,‘సత్యం శివం సుందరం' సినిమాపై అప్పట్లో చాలా వివాదాలు తలెత్తాయి. ఈ మూవీ ద్వారా జీనత్ అశ్లీలతను ప్రచారం చేసిందనే ఆరోపణలను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ ఈ సినిమా బాలీవుడ్ బెస్ట్ చిత్రాల లిస్టులో చేరింది. తాజాగా ఈ సినిమా విషయంలో తనపై వచ్చిన విమర్శలకు వివరణ ఇచ్చారు. “బాలీవుడ్ గురించి తెలిసిన వారికి ‘సత్యం శివం సుందరం’లో నా పాత్ర రూపా గురించి చాలా వివాదాలు ఉన్నాయని తెలుసు. కానీ, అందరూ అనుకున్నట్లు అందులో నాకు అశ్లీలత ఏమీ కనిపించలేదు. నటిగా నా పని దర్శకుడు చెప్పినట్లు చేయడమే. రూప అందాల ప్రదర్శన అనేది కేవలం నటనలో భాగమే. ప్రతి సన్నివేశం ముందుగా రిహార్సల్ చేయబడుతుంది. డజన్ల కొద్దీ సిబ్బంది ముందు చేయాల్సి ఉంటుంది. అందుకే, అశ్లీల ఆరోపణలను పెద్దగా పట్టించుకోవడం లేదు” అని వివరించారు.
ప్రస్తుతం జీనత్ 'బాన్ టిక్కీ' అనే సినిమాలో నటిస్తోంది. మనీష్ మల్హోత్రా రూపొందిస్తున్న ఈ చిత్రంలో షబానా అజ్మీ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, అభయ్ డియోల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Also: బుల్లితెరపై నాగార్జున సంక్రాంతి సందడి - బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌తో అక్కినేని ఆట అదుర్స్