Satya Dev: సత్యదేవ్ హీరోగా పాన్ ఇండియా మూవీ, టైటిల్ భలే క్రేజీగా ఉందిగా!
టాలెంటెడ్ హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతోంది. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు క్రేజీ టైటిల్ ఫిక్స్ చేశారు.
సరికొత్త కథాంశాలతో ప్రేక్షకులను మెప్పించడంలో ముందుంటాడు హీరో సత్యదేవ్. ఆయన నటించిన సినిమాలు వరుస విజయాలు సాధిస్తున్నాయి. హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఈ యంగ్ హీరో, మరో ప్రతిష్టాత్మక మూవీలో నటించబోతున్నారు. తన కెరీర్‌లో 26వ సినిమాగా పాన్ ఇండియన్ మూవీలో నటిస్తున్నారు. ఈశ్వర్ కార్తిక్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
డిఫరెంట్ గా సత్యదేవ్ పాన్ ఇండియా మూవీ టైటిల్
ఈ సినిమాకు మేకర్స్ క్రేజీ టైటిల్ ఫిక్స్ చేశారు. ‘జీబ్రా‘ పేరుతో టైటిల్ పరిచయం చేశారు. ఆసక్తికరంగా ఉన్న ఈ టైటిల్ ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ మూవీ తెరకెక్కుతున్నది. ఇక ఈ సినిమాలో ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటించనుంది. ‘కేజీఎఫ్’ సంగీత దర్శకుడు రవి బసృర్ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు. ఓల్డ్ టౌన్ పిక్చర్స్, పద్మజ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై రెడ్డి, బాల సుందరం, దినేష్ సుందరం సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ పాన్ ఇండియన్ మూవీలో సత్యరాజ్, జెన్నిఫర్ పిచినాటో, సత్య ఆకుల, సునీల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్నది.
View this post on Instagram
‘గుర్తుందా సీతాకాలం’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన సత్యదేవ్
యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ చివరిసారిగా ‘గుర్తుందా సీతాకాలం’ చిత్రంతో ప్రేక్షకులను అలరించారు. ‘గాడ్‌ఫాదర్’ సినిమాలో నెగెటివ్ రోల్ పోషించిన ఆయన, ఆ తర్వాత ‘గుర్తుందా శీతాకాలం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆయన కెరీర్ లో ఇదే తొలి ప్రేమకథా సినిమా. కన్నడలో విజయవంతమైన ‘లవ్ మాక్‌టైల్’ సినిమాకు రీమేక్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. తమన్నా ఇందులో హీరోయిన్ గా నటించింది. పాటలు ఆహ్లాదభరితంగా అనిపించాయి. మొత్తంగా ఈ సినిమా ఫర్వాలేదు అనిపించింది. అంతకుముందు ‘గాడ్ ఫాదర్‘ మూవీలో సత్యదేవ్ ఓ కీలకపాత్రలో నటించారు. ‘జై దేవ్‘గా ఇందులో కనిపించారు. పూర్తి స్థాయిలో నెగెటివ్ రోల్ లో నటించారు. ఒరిజినల్ వర్షన్ లో సత్యదేవ్ రోల్ ని వివేక్ ఒబెరాయ్ చేశారు. రీమేక్ లో తన అద్భుత నటనకు విమర్శకులు ప్రశంసలు దక్కించుకున్నారు. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘లూసిఫర్‘ చిత్రానికి రీమేక్ గా ‘గాడ్ ఫాదర్‘ తెరకెక్కింది. చిరంజీవి ప్రధానపాత్రలో నటించారు.
View this post on Instagram
Read Also: ‘సైంధవ్‘ నుంచి అదిరిపోయే అప్డేట్, వెంకీ మూవీలో బాలీవుడ్ యాక్టర్ కీరోల్