అన్వేషించండి

Nawazuddin Siddiqui Debut In TFI: ‘సైంధవ్‘ నుంచి అదిరిపోయే అప్డేట్, వెంకీ మూవీలో బాలీవుడ్ యాక్టర్ కీరోల్

వెంకటేష్ కెరీర్ లో 75వ చిత్రంగా ‘సైంధవ్‘ తెరకెక్కుతోంది. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ కీ రోల్ పోషిస్తున్నారు. శైలేష్ కొలను ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు.

విక్టరీ వెంకటేష్ కెరీర్ లో 75వ చిత్రం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు ‘సైంధవ్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. పాన్ ఇండియా మూవీ నిర్మిస్తున్నారు.  ఈ మూవీని  నిహారిక ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నారు. ‘దృశ్యం 2’, ‘నారప్ప’, ‘ఎఫ్ 3’ చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న జోష్ వెంకీ ఉన్నారు. అదే దూకుడుతో 75వ సినిమాను భారీ బడ్జెట్ తో యాక్షన్ మూవీగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో వెంకీ లుక్ ను రిలీజ్ చేశారు. ఆయన గన్ తో కనిపించే తీరు చూస్తుంటే యాక్షన్ మూవీగా రూపొందుతున్నట్లు తెలుస్తోంది.

‘సైంధవ్‘లో బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దికీ  

తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో అప్ డేట్ వచ్చింది.  ఈ చిత్రంని పాన్ ఇండియా సినిమాగా ప్రకటించమే కాకుండా నటీనటుల విషయంలో మేకర్స్ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇతర భాషల్లోని ప్రముఖ నటులను ఇందులోకి తీసుకుంటున్నారు.  అందులో భాగంగా బాలీవుడ్ నుంచి కూడా పలువురు నటుల్ని ఈ సినిమాలో చేసేలా చర్చలు కొనసాగుతున్నాయి. తాజా నటుడు నవాజుద్దీన్ సిద్దికీ ఈ మూవీలో కీలక పాత్ర పోషించబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఆయను పరిచయం చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలోకి బాలీవుడ్ నటుడిని వెల్ కమ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే, ఈ సినిమాలో ఆయన పోషించే పాత్ర ఏంటనే విషయాన్ని మాత్రం బయటకు చెప్పలేదు. హిందీలో బాగా పాపులర్ నటుడైన నవాజుద్దీన్, తొలిసారి తెలుగు తెరపై కనిపించనున్నారు.

పవర్ ఫుల్ డైలాగ్స్ తో అదరగొట్టిన వెంకీ

‘సైంధవ్‘ పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడతో పాటు హిందీ భాషల్లోనూ విడుదల చేయనున్నారు. ఇందుకోసం నిర్మాణ సంస్థ భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసుకుంటుంది.  ఇక ఈ మూవీ అనౌన్స్ చేసిన వెంటనే గ్లింప్స్ రిలీజ్ చేశారు. 2 నిమిషాల 16 సెకన్ల నిడివి గల ఈ గ్లింప్స్ లో.. వెంకటేష్ గడ్డంతో రఫ్ లుక్ లో ఉన్నారు. హీరో ఇంట్రడక్షన్ సీన్  చూపిస్తూ ప్రేక్షకులకు పరిచయం చేశారు. రేవులో  కంటైనర్ల మధ్య చేతిలో ఏకే 47 పట్టుకుని దేనికోసమో వెతుకుతున్నట్లు వెంకీ కనిపించారు. అటు వెంకీ  చెప్పే డైలాగులు సైతం పవర్ ఫుల్ గా ఉన్నాయి. “నేనిక్కడే వుంటాన్రా, ఎక్కడికి వెళ్లను. రమ్మను” అంటూ విలన్లను ఉద్దేశించి చెప్పే డైలాగ్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇవాళ్టి(జనవరి 26)  నుంచి మొదలుకానుంది. నటీనటుల వివరాలు కూడా త్వరలో వెల్లడించనున్నారు.

Read Also: సల్మాన్ ఖాన్ ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ టీజర్: బతుకమ్మతో వెంకటేష్, విలన్‌గా జగపతిబాబు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget