By: ABP Desam | Updated at : 14 Apr 2022 01:19 PM (IST)
ఎన్టీఆర్ తల్లి గురించి 'కేజీఎఫ్' స్టార్ ఏమన్నారంటే?
కన్నడ స్టార్ హీరో యష్ నటించిన 'కేజీఎఫ్2' సినిమా గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈరోజు విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సినిమా విడుదల నేపథ్యంలో గత కొద్దిరోజులుగా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా గడుపుతోంది చిత్రబృందం. ఈ క్రమంలో రీసెంట్ గా 'కేజీఎఫ్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హీరో యష్ కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. దీన్ని యాంకర్ సుమ హోస్ట్ చేశారు.
ఈ సందర్భంగా సుమ వారిని 'ఆర్ఆర్ఆర్' సినిమా గురించి చెప్పమని అడగగా.. చాలా అద్భుతంగా ఉందని, రాజమౌళి-ఎన్టీఆర్-రామ్ చరణ్ లపై ప్రశంసలు కురిపించారు ప్రశాంత్ నీల్. ఇక యష్ మాట్లాడుతూ.. 'ఆర్ఆర్ఆర్' ఒక సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అని పెద్ద స్క్రీన్ పై చూసి థ్రిల్ అయ్యానని అన్నారు. అలానే ఎన్టీఆర్, రామ్ చరణ్ లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వారిద్దరూ గొప్ప నటులని.. చరణ్, తారక్ లతో వ్యక్తిగతంగా పరిచయం ఉందని అన్నారు. హైదరాబాద్ లో ఎక్కడ షూటింగ్ చేసినా.. చరణ్ ఇంటి నుంచి భోజనం పంపిస్తారని.. తమ మధ్య అంతకుమించి స్పెషల్ బాండింగ్ ఉందని యష్ అన్నారు. ఆ తరువాత తారక్ గురించి చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ కుటుంబం తనను ఫ్యామిలీ మెంబర్ లా ట్రీట్ చేస్తారని చెప్పారు.
తననొకసారి డిన్నర్ కి ఆహ్వానించారని... తారక్ ఫ్యామిలీ తనను బాగా రిసీవ్ చేసుకుందని.. ముఖ్యంగా ఎన్టీఆర్ తల్లి షాలిని గారు తనను బాగా చూసుకున్నారని చెప్పుకొచ్చారు. ఆమె కూడా కర్ణాటకకు చెందిన వారు కావడంతో ఇద్దరి మధ్య ప్రాంతీయ అనుబంధం ఏర్పడిందని.. అందుకే షాలిని గారు తనను బాగా చూసుకుంటారని తెలిపారు. ఎన్టీఆర్ ఫ్యామిలీ ఇచ్చిన ఆతిథ్యాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు.
Also Read: 'కేజీయఫ్ 2' సినిమా రివ్యూ: నో డౌట్ - బొమ్మ బ్లాక్‌బస్టర్, యశ్ అదుర్స్ అంతే!
Also Read: తప్పు చేశా, రెండు సార్లు జైల్లో పెట్టారు - అజయ్ దేవగన్ వ్యాఖ్యలు
Godse Movie Release Date: సత్యదేవ్ 'గాడ్సే' రిలీజ్ డేట్ మారింది!
Major Movie: 'మేజర్' నుంచి రొమాంటిక్ లవ్ సాంగ్ - విన్నారా?
Aadhi Pinisetty: ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని హల్దీ ఫంక్షన్ - సందడి చేసిన హీరోలు
Anil Ravipudi: ఎన్టీఆర్ తో సినిమా - అనిల్ రావిపూడి ఏమన్నారంటే?
She-Hulk Trailer: హల్క్ చెల్లి ‘షి-హల్క్’ వచ్చేస్తోంది, తెలుగు ట్రైలర్ చూశారా?
Chandrababu In Kadapa: జగన్ పులివెందులలో బస్టాండ్ కట్టలేదు, కానీ 3 రాజధానులు కడతారా: చంద్రబాబు
Damodara Rao: ఎవరీ దామోదరరావు, టీఆర్ఎస్ తరఫున ఎంపీ పదవి ఎందుకు ఇచ్చారు?
IBA Womens World Boxing: జరీన్ 'పంచ్' పటాకా! ప్రపంచ బాక్సింగ్ ఫైనల్ చేరిన తెలంగాణ అమ్మాయి
KKR vs LSG Preview: గెలిచి ప్లేఆఫ్స్ వెళ్తారా? ఓడి టెన్షన్ పడతారా!