అన్వేషించండి

పిల్లలకు అమ్మ, నాన్న అన్నీ తానై - అందుకే చలపతిరావు రెండో పెళ్లి చేసుకోలేదా?

చలపతిరావు తన కుటుంబానికి ఎంతో విలువనిచ్చేవారు. భార్య చనిపోయిన తర్వాత తమ పిల్లలకు అమ్మా, నాన్నా తానే అయ్యారు.

జీవితం సంతోషంగా సాగాలన్నా.. కష్టసుఖాలను పంచుకోవాలన్నా ఒక తోడు అవసరమని పెద్దలు అంటారు. అయితే, చలపతిరావు జీవితంలో ‘తోడు’ దొరికినా.. విధి వారిని దూరం చేసింది. భార్య ఇందుమతి చనిపోయిన తర్వాత ఆయన రెండో పెళ్లి చేసుకోకుండా.. తన పిల్లలకు అమ్మ, నాన్నా అన్నీ తానై పెంచారు. ఒక వైపు సినిమాలు, మరోవైపు ఇల్లు.. పిల్లలు. ఇలా ఎంత ఒత్తిడి ఉన్నా.. ఆయన ముఖంపై చిరునవ్వు చెరగనిచ్చేవారు కాదు. ఏ రోజు ఆయన తన ధైర్యాన్ని కోల్పోలేదు. ఎన్ని సమస్యలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేవారు. పిల్లలకు అమ్మలోటు తెలియకుండా పెంచారు. 

పెళ్లయిన కొన్నాళ్లకే..

పెళ్లయిన కొన్నాళ్లకే చలపతిరావు భార్య ఇందుమతి అగ్నిప్రమాదంలో చనిపోయారు. చెన్నైలోని ఆయన నివాసంలో అనుకోకుండా ఆమె చీరకు నిప్పంటుకుంది. దీంతో ఆమె మంటల్లో కాలిపోయింది. ఆమెను బతికించేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. కానీ, ఫలితం లేకపోయింది. అప్పుడు పిల్లలు చాలా చిన్నవాళ్లు. పిల్లల బాగోగులు చూసేందుకు మరోపెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ, అప్పట్లో ఎవరూ ముందుకు రాలేదు. ఒక వేళ పెళ్లి చేసుకున్నా వచ్చే భార్య తన పిల్లలను బాగా చూసుకోకపోతే సమస్యలు వస్తాయనే భయం కూడా ఆయన్ని వెంటాడింది. దీంతో ఆయన తన అమ్మగారి సాయంతో పిల్లలను పెంచారు. ఆ తర్వాత చాలామంది రెండో పెళ్లి చేసుకోండని సలహా ఇస్తే సున్నితంగా తిరస్కరించేవారు. 

2018లో ప్రమాదం

చలపతిరావు కుమారుడు రవి బాబు నటుడు, దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. రవిబాబుతోపాటు చలపతిరావుకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం వారు అమెరికాలో ఉంటున్నారు. వాళ్లు ఇండియా ఎప్పుడు వచ్చినా కృష్ణాజిల్లాలోని బల్లిపర్రులోని సొంత ఇంటికి తీసుకెళ్లేవారు. అక్కడ ఆయనకు రెండెకరాల పొలం ఉంది. చలపతిరావు సినిమాల్లో ఎన్ని చెడ్డ పాత్రలు చేసినా.. బయట మాత్రం చాలా మంచిగా ఉండేవారు. మందు, సిగరెట్ అలవాట్లు కూడా లేవు. అందరితో బాబాయ్ అని పిలిపించుకుంటూ ఎంతో సరదాగా ఉంటారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. 2018లో ‘సిల్లీ ఫెలోస్’ మూవీ షూటింగ్‌లో చలపతిరావుకు ప్రమాదం జరిగింది. కొన్నాళ్లు ఆయన వీల్ ఛైర్‌కే పరిమితమయ్యారు. ఆ తర్వాత మరో మూడు సినిమాల్లో నటించారు. 2021లో ‘ఓ మనిషీ నీవెవ్వరు’ అనే మూవీ తర్వాత మళ్లీ నటించలేదు. 

కుమార్తెలు వచ్చిన తర్వాతే అంత్యక్రియలు

చలపతిరావు కుమార్తెలు అమెరికాలో ఉన్నారు. వారు వచ్చిన తర్వాత బుధవారం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. చలపతిరావు పార్థీవ శరీరం ప్రస్తుతం రవిబాబు నివాసంలోనే ఉంది. మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన పార్థీవ శరీరాన్ని అభిమానుల సందర్శన కోసం ఉంచనున్నారు. ఆ తర్వాత మహా ప్రస్థానంలోని మార్చురీ ఫ్రీజర్‌లో ఉంచనున్నారు.  

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ravi Babu (@ravibabuofficial)

Also Read: ఎన్టీఆర్ మనిషిగా ముద్రపడిన చలపతి రావు రియల్ లైఫ్ తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Don't Trouble The Trouble First Review: ఫహాద్ ఫాజిల్ సినిమాకు మహేష్ బాబు రివ్యూ... 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్' ఎలా ఉందంటే?
ఫహాద్ ఫాజిల్ సినిమాకు మహేష్ బాబు రివ్యూ... 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్' ఎలా ఉందంటే?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today September 30th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: క్రిష్‌కి యాక్సిడెంట్ చేయించిన అంబిక! రక్తపు మడుగులో కొన ఊపిరితో క్రిష్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: క్రిష్‌కి యాక్సిడెంట్ చేయించిన అంబిక! రక్తపు మడుగులో కొన ఊపిరితో క్రిష్!
Toxic OTT : టాక్సిక్ ఓటీటీ రిలీజ్ ఆలస్యం - నవంబర్ ఫస్ట్ వీక్‌లో వస్తుందా?... ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
టాక్సిక్ ఓటీటీ రిలీజ్ ఆలస్యం - నవంబర్ ఫస్ట్ వీక్‌లో వస్తుందా?... ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Impure Movie : మా ఇంటి బంగారం ఇన్‌స్పిరేషన్‌తోనే ఇంప్యూర్ - డిఫరెంట్ స్టోరీతో కొత్త మూవీ... ప్రొడ్యూసర్‌, రైటర్‌గా వారాహి మల్లిపాముల
మా ఇంటి బంగారం ఇన్‌స్పిరేషన్‌తోనే ఇంప్యూర్ - డిఫరెంట్ స్టోరీతో కొత్త మూవీ... ప్రొడ్యూసర్‌, రైటర్‌గా వారాహి మల్లిపాముల

వీడియోలు

Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే
Ravindra Jadeja for 2027 World Cup | జడేజా స్థానంపై స్పష్టతనిచ్చిన కోచ్ బహుతులే
Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: వచ్చే మూడేళ్లలో 35 వేల కోట్లతో మరో 36 ప్రాజెక్టులు.. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీలో సీఎం చంద్రబాబు
వచ్చే మూడేళ్లలో 35 వేల కోట్లతో మరో 36 ప్రాజెక్టులు.. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీలో సీఎం చంద్రబాబు
Union Cabinet Decisions: రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. కనీస మద్దతు ధర పెంపు, ఏ పంటకు ఎంత
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. కనీస మద్దతు ధర పెంపు, ఏ పంటకు ఎంత పూర్తి వివరాలు
Vijayasai Reddy About YSRCP: ఇండీ కూటమిలో వైసీపీ విలీనంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఇండీ కూటమిలో వైసీపీ విలీనంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Rajinikanth : ఆటోలో షూటింగ్ సెట్‌కు రజనీ కాంత్ - వాట్ ఏ సింప్లిసిటీ తలైవా... ఫ్యాన్స్ ఫిదా
ఆటోలో షూటింగ్ సెట్‌కు రజనీ కాంత్ - వాట్ ఏ సింప్లిసిటీ తలైవా... ఫ్యాన్స్ ఫిదా
ఇస్లాంలో మతం మార్చడానికి కల్మాను ఉపయోగిస్తారు, మరి హిందూమతం సంగతేంటి?
ఇస్లాంలో మతం మార్చడానికి కల్మాను ఉపయోగిస్తారు, మరి హిందూమతం సంగతేంటి?
Vijayasai Reddy: ఏపీని కమ్మ, క్రిస్టియన్లు పాలిస్తున్నారు.. మేం గెలిస్తే ఆ కులాలకే సీఎం పదవి: విజయసాయిరెడ్ది
ఏపీని కమ్మ, క్రిస్టియన్లు పాలిస్తున్నారు.. మేం గెలిస్తే ఆ కులాలకే సీఎం పదవి: విజయసాయిరెడ్ది
Boyapati Srinu: బోయపాటి శ్రీను పెద్దబ్బాయ్, అమ్మాయి బర్త్ డే... ఫ్యామిలీ ఫోటోలు చూశారా?
బోయపాటి శ్రీను పెద్దబ్బాయ్, అమ్మాయి బర్త్ డే... ఫ్యామిలీ ఫోటోలు చూశారా?
October Rule Changes: అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. బ్యాంక్ FD, LPG లో మార్పులు, ఎన్‌పీఎస్ కొత్త స్కీమ్
అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. బ్యాంక్ FD, LPG లో మార్పులు, ఎన్‌పీఎస్ కొత్త స్కీమ్
Embed widget