అన్వేషించండి
Advertisement
Brahmanandam: ఆలీ అడిగిన ప్రశ్నకు కళ్లజోడు విసిరికొట్టిన బ్రహ్మీ... ఆ తర్వాత నా చేయి పట్టుకుని కన్నుమూశాడంటూ!
అందర్నీ నవ్వించే బ్రహ్మానందానికి 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఎందుకు కోపం వచ్చింది? ఆయన చేతుల్లో మరణించింది ఎవరు? తెలియాంటే డిసెంబర్ 6న టెలికాస్ట్ కానున్న పార్ట్ 2 చూడాలి. లేటెస్ట్ ప్రోమో ఎలా ఉందంటే?
'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి హాస్య బ్రహ్మ బ్రహ్మానందం అతిథిగా వచ్చిన సంగతి తెలిసిందే. ఆలీ, బ్రహ్మీ మధ్య సరదా సంభాషణలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే, అది ఒక్క ఎపిసోడ్‌కి పరిమితం కాలేదు. మరో ఎపిసోడ్ ఉంది. లేటెస్టుగా పార్ట్ 2 ప్రోమో రిలీజ్ చేశారు. అందులో అందర్నీ ఎప్పుడూ నవ్వించే బ్రహ్మానందం కళ్లజోడు తీసి నేలకేసి విసిరికొట్టాడు. 'ఈ మధ్య కాలం సినిమాల్లో ఎందుకు నీ జోరు తగ్గింది?' అని ఆలీ అడగ్గా... కళ్లజోడు నేల మీద విసిరేసి కుర్చీ లోంచి లేచి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఎపిసోడ్‌లో చూడాలి.
'అన్నా! ఇప్పుడున్న కమెడియన్లలో నీకు ఎవరంటే ఇష్టం?' అని ఆలీ ప్రశ్నించగా... బ్రహ్మానందం ఎమోషనల్ అయ్యారు. "అతన్ని కొండాపూర్ కిమ్స్ ఆస్పత్రిలో పెట్టారు. ఇంకో గంటలో మరణిస్తాడని అనగా... బెడ్ మీద ఉన్నప్పుడు కుమార్తెను పెన్ను, పేపరు అడిగి 'బ్రహ్మానందం అన్నయ్యను చూడాలని ఉంది' అని రాశాడు. నేను వెళ్లాను. నన్ను అలా చూశాడు. చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. 'అన్నయ్యా' అన్నాడు. కన్ను మూశాడు" అని బ్రహ్మానందం చెప్పారు. ఆ కమెడియన్ ఎవరనే ఆసక్తి అందరిలో మొదలైంది.
ప్రతి పండక్కి ఆలీకి పిండి వంటలు పంపిస్తానని బ్రహ్మానందం తెలిపారు. అలాగే, తనను ఆలీ 'అరే... ఒరే...' అంటాడని, మర్యాద ఇవ్వడని సరదాగా బ్రహ్మానందం చెప్పారు. ఆయనతో 'ఆలీతో సరదాగా' పార్ట్ 2 ప్రోమో కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిందని చెప్పాలి. ప్రస్తుతం బ్రహ్మానందం నటించిన సినిమాల్లో కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న 'రంగ మార్తాండ', 'పంచతంత్రం' సినిమాల కోసం ఇండస్ట్రీ ప్రముఖులు, ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 'రంగ మార్తాండ'లో ఆయన డిఫరెంట్ రోల్ చేస్తున్నారు.
Alitho Saradaga Latest Promo (Part-2):
Also Read: బిగ్ బాస్.. ‘టికెట్ టు ఫినాలే’.. కింద మంచు పెట్టి మరీ టార్చర్.. ‘నాకు ఒళ్లు కొవ్వు’ అంటున్న ప్రియాంక!
Also Read: దివి నుంచి భువికి దిగొచ్చిన దేవకన్యలా...
Also Read: అక్కడ ప్రభాస్ పాద పూజ... ఇక్కడ పూజతో కౌగిలింత!
Also Read: ముందే చెప్పానుగా... గెలవడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాం, కపిల్ దేవ్‌గా అదరగొట్టిన రణ్‌వీర్, 83 ట్రైలర్ విడుదల
Also Read: బాలకృష్ణ ముందు డైలాగులు చెప్పడానికి భయపడ్డా! కానీ...
Also Read: అవకాశాలు రాక... నృత్య ప్రదర్శనలకు డబ్బు ల్లేక... సినిమాల్లోకి! ఇదీ శివ శంకర్ మాస్టర్ జర్నీ!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి

మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఛాట్జీపీటీ
ఆంధ్రప్రదేశ్
ఇండియా
ఎడ్యుకేషన్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion