Actress Snigdha: ఇందిరా పార్క్‌లో ఆడుకోవడానికి వెళుతుంటే ఒకడు పక్కకి లాక్కుని...
బాల్యంలో తమకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి కొంత మంది తారలు గతంలో వెల్లడించిన సందర్భాలు ఉన్నాయి. అటువంటి చేదు అనుభవమే నటి స్నిగ్ధకు కూడా ఎదురైంది.
'అలా మొదలైంది' సినిమాతో నటిగా పరిచయమైన స్నిగ్ధ తెలుసు కదా! ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించారు. 'ఓ బేబీ'లో నాగశౌర్య అసిస్టెంట్ రోల్ చేశారు. 'యు మి ఆవకాయ్ ఐస్ క్రీమ్' వెబ్ సిరీస్‌లో ఓ రోల్ చేశారు. ఆవిడ చిన్నతనంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఓ టీవీ కార్యక్రమంలో వెల్లడించారు.
"ఎవరైనా దగ్గరకు వస్తుంటే రానివ్వొద్దని స్కూల్‌కు వెళ్లేటప్పుడు, చిన్నతనంలో అమ్మాయిలకు చెబుతారు కదా! నాకూ అలాగే చెప్పారు. ఇందిరా పార్క్... ఆడుకోవడానికి వెళుతుంటే ఒకడు పక్కకి లాక్కుని వెళ్లిపోయాడు" అంటూ గతాన్ని చెబుతూ స్నిగ్ధ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమెను చూసి కార్యక్రమంలో ఉన్న మిగతా నటీమణులు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. నవంబర్ 28న, ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు జీ తెలుగు ఛానల్‌లో టెలికాస్ట్ కానున్న 'సూపర్ క్వీన్' కార్యక్రమంలో స్నిగ్ధ ఏం చెప్పారన్నది పూర్తిగా తెలుస్తుంది. ఈ షోకు తన తండ్రిని కూడా ఆమె తీసుకొచ్చారు. భానుశ్రీ, 'కార్తీక దీపం' సీరియల్ ఫేమ్ శోభితా శెట్టి, శివ జ్యోతి, నవ్య శ్రీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
'సూపర్ క్వీన్' కార్యక్రమానికి హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ అతిథిగా వచ్చారు. ఆమెకు, యాంకర్ ప్రదీప్ మాచిరాజుకు మధ్య జరిగిన సంభాషణ ప్రోమోలో చూపించారు. ప్రదీప్‌కు 'పులిహోరిస్ట్' బిరుదు ఇచ్చారు అనుమప. ఆమెకు ప్రదీప్ మలయాళంలో ప్రపోజ్ చేశారు. తర్వాత ఆమె కూడా ప్రేమిస్తున్నానంటూ చెప్పారు. తనకు బిర్యానీ ఇష్టమని అనుపమ అంటే... 'పుట్టినప్పటి నుంచి నాకు బిర్యానీ వండటం వచ్చు నాకు' అని ప్రదీప్ అన్నారు. 'దీన్ని తెలుగులో పులిహోర కలపడం అంటారు' అని భానుశ్రీ సెటైర్ వేశారు. 'నాకు పులిహోర అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ప్రదీప్ బెస్ట్ పర్సన్ కదా! ద పులిహోరిస్ట్' అని అనుపమ అన్నారు. ప్రోమో ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' వెబ్ సిరీస్ నిర్మాత నిహారికా కొణిదెల, హీరోయిన్ సిమ్రాన్ శర్మ... 'అనుభవించు రాజా' హీరో హీరోయిన్లు రాజ్ తరుణ్, కశిష్ ఖాన్, దర్శకుడు శ్రీనివాస్ గవిరెడ్డి తదితరులు ఈ కార్యక్రమానికి వచ్చారు.
Also Read: అవన్నీ వదంతులే... కైకాల సత్యనారాయణ తాజా ఆరోగ్య పరిస్థితిపై కుమార్తె స్పందన ఇది
Also Read: ఆ నవమన్మథుడే ఈ చిన్న బంగార్రాజు.. టీజర్‌తో వచ్చేసిన బర్త్‌డే బాయ్ నాగ చైతన్య
Also Read: 'కె.జి.యఫ్' రేంజ్‌లో NTR31... ఆ సినిమా గురించి ఎన్టీఆర్ ఏమన్నారంటే?
Also Read: నాటు నాటు... ఆ స్టెప్పులు అంత ఈజీ ఏం కాదు! ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎన్ని టేక్స్ తీసుకున్నారంటే?
Also Read: 'భీమ్లా నాయక్' గురించి త్రివిక్రమ్ ఇచ్చిన లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
Also Read: బాలకృష్ణతో కామెడీ సినిమా చేయనంటున్నారు! ఆయన మాస్ ఇమేజ్‌కు తగ్గట్టు...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి