Sobhita Dhulipala: నేను ఏ తప్పూ చేయలేదు, వాళ్లకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు - చైతూతో డేటింగ్‌పై శోభిత ధూళిపాళ్ల స్పందన
నాగ చైతన్యతో డేటింగ్ వార్తలపై నటి శోభిత ధూళిపాళ్ల మరోసారి స్పందించింది. తెలివి తక్కువగా ఆలోచించే వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. తాను ఏ తప్పూ చేయలేదని వెల్లడించింది.
గత కొంతకాలం నుంచి టాలీవుడ్ హీరో నాగచైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల డేటింగ్ లో ఉన్నారంటూ సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ వార్తలు వినిపిస్తున్నాయి. సమంతతో విడాకుల తర్వాత శోభిత, నాగ చైతన్యకు దగ్గరైందంటూ, వారిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారంటూ కథనాలు కూడా వచ్చాయి. ఈ ప్రచారంపై శోభిత ధూళిపాళ్ల మరోసారి స్పందించారు. ఎవరో ఏదో అంటున్నారని దాన్ని పట్టించుకుని ఫీలైపోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. ఆ రూమర్స్ తో తనకెలాంటి సంబంధం లేనప్పుడు, తాను ఏ తప్పూ చేయనప్పుడు క్లారిటీ ఇవ్వాల్సిన పనికూడా లేదని ఆమె తేల్చి చెప్పేశారు.
31వ వసంతంలోకి అడుగు పెట్టిన శోభిత
నటి శోభితా ధూళిపాళ్ల మే 31న 31 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆమెకు పలువురు సినీ తారలు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె మరెన్నో సంతోషకరమైన పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఇటీవల, ఆమె నాగ చైతన్యతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. ఆ ఫోటోల్లో వీరిద్దరు కలిసి ఫారిన్ టూర్ కు వెళ్లినట్లు కనిపిస్తోంది. ఈ ఫోటోలు వైరల్ అయినప్పటి నుంచి ఇద్దరి మధ్య ప్రేమాయణం గట్టిగానే కొనసాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు
ఆమె బర్త్ డే సందర్భంగా కొందరు ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఇద్దరి మధ్య ప్రేమాయణం గురించి చెప్పాలని కోరారు. ఈ కామెంట్స్ పై శోభిత ఘాటుగా స్పందించారు. తెలివి లేకుండా మాట్లాడే వ్యక్తులకు, వారి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని వెల్లడించారు. తాను ఏ తప్పు చేయనప్పుడు దాని గురించి స్పందించాల్సిన అవసరం లేదని చెప్పారు. ఒకళ్లో, ఇద్దరో ఏదో తెలియకుండా మాట్లాడినంత మాత్రాన, దాన్ని పట్టించుకుని ఫీలైపోవాల్సినదేం లేదన్నారు. తనకేం సంబంధం లేనప్పుడు, ఇలాంటి రూమర్స్ పై క్లారిటీ ఇవ్వాల్సి పని కూడా లేదని శోభిత వెల్లడించారు. ఏ తప్పూ చేయనప్పుడు కామ్ గా,ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతానని ఆమె స్పష్టం చేశారు. దీంతో వారిద్దరి మధ్య డేటింగ్ లాంటి ఎలాంటి సంబంధం లేదని తాజా వ్యాఖ్యలతో స్పష్టమైంది.
ఆ వార్తలకు చెక్ పడినట్లేనా?
వరుస సినిమాలతో బిజీ అయిన టాలీవుడ్ నాగచైతన్య, ఇప్పుడిప్పుడే సినీ ఇండస్ట్రీలో తన టాలెంట్ ను నిరూపించుకుంటున్న శోభిత ధూళిపాళ్ల కొద్ది కాలంగా డేటింగ్ ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. ఓ సారి లండన్ వెకేషన్‌లో, మరోసారి రెస్టారెంట్‌లో వీరిద్దరూ జంటగా కనిపించడంతో ఆ రూమర్స్ కు మరింత బలం చేకూరినట్టయింది. సమంతతో విడిపోయిన తర్వాత చైకి శోభిత దగ్గరైందని, అందుకే వీరిద్దరూ జంటగా షికార్లు చేస్తున్నారని పుకార్లు షికారు చేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా శోభిత ఇచ్చిన క్లారిటీతో ఈ రూమర్స్ కి చెక్ పడినట్టయింది. వైజాగ్ కు చెందిన శోభిత హిందీ, తెలుగుతో పాటు, మలయాళం, తమిళ చిత్రాల్లోనూ నటించారు. ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్ కూడా దక్కించుకుంది. ‘మేడ్ ఇన్ హెవెన్’ షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
Read Also: ధోనీ భార్య సాక్షి, కొహ్లీ భార్య అనుష్క క్లాస్‌మేట్స్, ఇదిగో ప్రూఫ్!