Anushka Sharma-Sakshi Dhoni: ధోనీ భార్య సాక్షి, కొహ్లీ భార్య అనుష్క క్లాస్‌మేట్స్, ఇదిగో ప్రూఫ్!
అనుష్క శర్మ, సాక్షి ధోనీ చిన్ననాటి స్నేహితులని తెలుసా? టీమిండియా కెప్టెన్లను పెళ్లి చేసుకున్న ఈ ఇద్దరు క్లాస్ మేట్స్. తాజాగా వారి చిన్నప్పటి ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ, మహేంద్ర సింగ్ ధోనీ భార్య సాక్షి చిన్ననాటి స్నేహితులు. అవును, మీరు చదివింది నిజమే. బాలీవుడ్ నటి అనుష్క, సాక్షి అస్సాంలోని ఒకే పాఠశాలలో చదివారు. ఇద్దరూ క్లాస్‌మేట్స్ కూడా. అనుష్క తండ్రి అస్సాంలో ఉద్యోగం చేస్తున్నప్పుడు, తను మార్గరీటాలోని సెయింట్ మేరీస్ స్కూల్‌కి వెళ్లింది. సాక్షితో కలిసి ఒకే తరగతిలో చదివారు.
అస్సోంలో కలిశారట..
అనుష్క శర్మ, సాక్షి ధోనీ తరచుగా పలు క్రికెట్ టోర్నమెంట్‌లు, మ్యాచ్‌లలో కనిపించి అలరించారు. తమ భర్తలు క్రికెటర్లు కావడంతో తరుచుగా స్టేడియంలో సందడి చేస్తుంటారు. అనుష్క తండ్రి అజయ్ కుమార్ శర్మ కల్నల్ (రిటైర్డ్.). ఇండియన్ ఆర్మీలో ఆయన పని చేశారు. ఈ నేపథ్యంలోనే తరచుగా ఆయనకు బదిలీలు అవుతూ ఉండేవి. అనుష్క సైతం తల్లిదండ్రులతో కలిసి పలు ప్రాంతాలకు వెళ్లేది. ఒకానొక సమయంలో అనుష్క తండ్రికి అస్సోంలో పోస్టింగ్ ఇచ్చారు. అప్పుడు అనుష్క స్థానికంగా ఉన్న మార్గరీటాలోని సెయింట్ మేరీస్ స్కూల్‌కి వెళ్ళింది. ధోనీ భార్య సాక్షి కూడా ఆ పాఠశాలలోనే చదువుకుంది. ఇద్దరూ ఒకే తరగతిలో చదువుకున్నారు.
2013లో మళ్లీ కలిసిన సాక్షి, అనుష్క
తాజాగా సాక్షి, అనుష్క ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. పలు సందర్భాల్లో దిగిన సాంస్కృతిక కార్యక్రమాల ఫోటోలు, గ్రూప్ ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోల్లో ఒకదానిలో అనుష్క, సాక్షి క్లాస్ మేట్స్ తో కలిసి గ్రూప్ ఫోటోకు పోజులిచ్చారు. మిగతా ఫోటోలు ఇద్దరూ తమ స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటున్నారు. 2013లో ఒక లాంచ్ ఈవెంట్‌లో భాగంగా, అనుష్క పాఠశాల నుంచి బయటకు వెళ్లిన తర్వాత సాక్షిని కలిసింది. ఈ సందర్భంగా ఇద్దరం క్లాస్ మేట్స్ అని చెప్పింది. "సాక్షి, నేను అస్సాంలోని చాలా చిన్న పట్టణంలో నివసించాం. ఇద్దరం ఒకే స్కూల్లో చదివాం, అంతేకాదు, ఇద్దరం ఒకే క్లాస్ కూడా” అని చెప్పింది. ఆ తర్వాత అప్పట్లో స్కూల్లో దిగిన ఫోటోలు చూశాను. ఇందులో సాక్షి చాలా ముద్దుగా ఉందని వెల్లడించింది.
స్కూల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యాక అనుష్క సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది. నటిగా అద్భుతంగా రాణించింది. ఆ తర్వాత కోహ్లీతో ప్రేమలో పడింది. 2017 డిసెంబర్‌లో అనుష్క, విరాట్ కోహ్లీ పెళ్లి చేసుకున్నారు. అటు సాక్షి పాఠశాల విద్య తర్వాత హోటల్ మేనేజ్ మెంట్ చేసింది. సాక్షి జూలై 2010లో ధోనీని వివాహం చేసుకుంది.
ప్రస్తుతం అనుష్క ‘చక్దా ఎక్స్ ప్రెస్’ అనే సినిమాలో నటిస్తోంది. ఇది భారతీయ మహిళా క్రికెట్ ఫాస్ట్ బౌలర్ ఝులన్ గోస్వామి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతోంది. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది.
Read Also: టర్కీలో 'ఖుషి' షూటింగ్ - విజయ్ దేవరకొండ, సమంత ఫోటోలు నెట్టింట్లో వైరల్!
Read Also: ‘ప్రాజెక్ట్ K’ మూవీలో విలన్‌గా కమల్ హాసన్? భారీ రెమ్యునరేషన్ ఆఫర్?