Raj Kundra Case : అది పోర్న్ కాదు... వెబ్ సిరీస్... కోర్టులో రాజ్‌కుంద్రా వాదన
శిల్పాశెట్టి భర్త అరెస్టు తీవ్ర సంచలనమైంది. పోర్న్ కంటెంట్ వివాదంలో చిక్కుకున్న రాజ్ కుంద్రా... తాను తీసింది పక్కా వెబ్ సిరీస్ అంటున్నారు.
శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా అరెస్టు సినీ ఇండస్ట్రీనే కాదు... ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లను కూడా షేక్ చేస్తోంది. పోర్న్ వ్యవహారంలో అరెస్టైన రాజ్‌కుంద్రా తాను తీసింది పక్కా వెబ్‌సిరీస్ అంటూ వాదిస్తున్నారు. చాలా కాలం తరువాత పోర్న్ వ్యవహారంలో సినిమా వాళ్ల పేర్లు వినిపిస్తున్నాయి. గతంలో ఇండస్ట్రీకి చెందిన కొందరు ఈ తరహా సినిమాల్లో నటించేవారనే ప్రచారాలు జరిగాయి. నిజానికి సినిమా వాళ్లు అడల్ట్ కంటెంట్ జోలికి వెళ్లరు. నటీనటులు ఆ తరహా వ్యవహారాల్లో తల దూరిస్తే వారి కెరీర్ పూర్తిగా పతనమవుతుందనే విషయం వాళ్లకు తెలుసు. అందుకే పోర్న్ వ్యవహారం అంటే ఆ వైపే చూడరు. దీంతో పలానా నటి బ్లూ ఫిల్మ్ లో నటించిందని ఎవరైనా చెప్పినా నమ్మే పరిస్థితి లేదిప్పుడు. దీంతో సినిమా వాళ్లను పోర్న్‌కు అతీతంగా చూడడం జరుగుతోంది.
ఇలాంటి సమయంలో ప్రముఖ సినీ నటి శిల్పాశెట్టి భర్త ఇప్పుడు పోర్న్ వ్యవహారంలో అరెస్ట్ కావడం సంచలనంగా మారింది. అటు వ్యక్తిగత, ఇటు వ్యాపార వ్యవహారాలలో కూడా రాజ్ కుంద్రా పేరు వివాదాస్పదంగా మారింది. ఈ మధ్య తన మాజీ భర్తపై ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. తన చెల్లెలి భర్తతో ఆమె ఎఫైర్ పెట్టుకుందని.. అందుకే ఆమెకి విడాకులు ఇచ్చినట్లు కుంద్రా చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు అతడే ఏకంగా పోర్న్ వ్యవహారంలో అరెస్ట్ కావడం హాట్ టాపిక్‌గా మారింది.
పోర్న్ సైట్లలో కొందరు ఇండియన్ ఆర్టిస్ట్‌ల బ్లూ ఫిలిమ్స్ ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఇవన్నీ పూర్తిస్థాయి పోర్న్ మాదిరి కాకుండా వెబ్ సిరీస్‌ల పేరుతో ప్రచారానికి ఉంచుతున్నారట. హాలీవుడ్ వాళ్లు తీసే వెబ్ సిరీస్‌లలో కొన్ని న్యూడ్ సీన్లు ఉంటాయి. వాటి లాగే హిందీ వెబ్ సరీస్‌లలో కూడా ఇలాంటి సీన్లు తీసినట్టుగా చూపుతుంటారు. హాలీవుడ్ వెబ్ సిరీస్‌లలో అవసరం కోసమో.. ఎరోటిక్‌గా ఉండడం కోసమో కొన్ని సీన్లను తీస్తే.. ఈ హిందీ వెబ్ సిరీస్ లు మాత్రం పోర్న్ కంటెంట్ మెయిన్ గా సీన్లు తీస్తున్నారు.
వెబ్ సిరీస్‌లకు కథ, కథనాలు ఏమీ ఉండకపోయినా.. ఇలాంటి సీన్లను వీలైనంతగా దట్టిస్తున్నారు. అర్ధనగ్నం కాకుండా.. పూర్తిగా పోర్న్‌ను చిత్రీకరిస్తూ వెబ్ మీదకు వదులుతున్నారు. ఈ వ్యవహారంపై పోలీసుల విచారణ అటు తిరిగి ఇటు తిరిగి రాజ్ కుంద్రా వద్దకు వెళ్లినట్లుగా ఉంది. ముందుగా ఒకసారి ప్రశ్నించిన తరువాతే రాజ్ కుంద్రాను అరెస్ట్ చేశారు పోలీసులు. ఎవరైనా చిన్నవాళ్లు ఈ దందాలో దొరికి ఉంటే అదంతా సంచలనం అయ్యేది కాదు. కానీ శిల్పాశెట్టికి ఉన్న గుర్తింపు కారణంగా ఆమె భర్త పోర్న్ దందాలో దొరికాడనే విషయం హాట్ టాపిక్ గా మారింది.
ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్న రాజ్‌కుంద్రా కేసు విచారణలో భాగంగా ఆయన తరఫు న్యాయవాది కీలక వ్యాఖ్యలు చేశారు. అరెస్టుకి కారణమైన వీడియో షూట్ కేవలం వెబ్ సిరీస్ చిత్రీకరణ అని.. పోర్న్ కానే కాదని ఆయన తెలిపారు. ఇద్దరు వ్యక్తులు కెమెరా ముందు శృంగారం చేస్తున్నట్లు కనిపిస్తేనే దాన్ని పోర్న్ కింద చూడాలి గానీ అలా కాకుండా ఏ ఇతర అశ్లీల సన్నివేశాలను పోర్న్ కింద పరిగణించాల్సిన అవసరం లేదని కోర్టుకి తెలిపారు.
Also Read : Raj Kundra Case : ''రాజ్ కుంద్రా బిజినెస్ లో తప్పేముంది''