Kanguva Release Date: అలా చేసి ఇబ్బంది పడలేం, ‘కంగువా’ రిలీజ్ పై నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
Kanguva Release Date: సూర్య హీరోగా శివ దర్వకత్వంలో వస్తున్న చిత్రం ‘కంగువా’. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ గురించి నిర్మాత ధనంజయన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Producer Dhananjayan About Kanguva Release Date: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కంగువా’. పీరియాడికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాకు శివ దర్శకత్వం వహిస్తున్నారు. సూర్య కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్ భారీ రెస్పాన్స్ అందుకోవడంతో పాటు సినిమాపై భారీగా అంచనాలను పెంచింది. ముఖ్యంగా ఈ సినిమాలో సూర్య మేకోవర్ అండ్ గెటప్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది.
‘కంగువా’ రిలీజ్ పై నిర్మాత ధనంజయన్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఈ నేపథ్యంలో ‘కంగువా’ రిలీజ్ డేట్ గురించి నిర్మాత ధనంజయన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇది తమ కలల ప్రాజెక్ట్ అని చెప్పుకొచ్చారు. సినిమా రిలీజ్ విషయం పైనా కీలక వ్యాఖ్యలు చేశారు. “ప్రస్తుతం సినిమా షూటింగ్ కొనసాగుతోంది. మూవీ కంప్లీట్ కాకముందే రిలీజ్ డేట్ ప్రకటించలేం. ముందే విడుదల తేదీని వెల్లడిస్తే, ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. అలా కావడం మాకు ఇష్టం లేదు. ఇది ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్. 3D, VFXకు చాలా సమయం పట్టే అవకాశం ఉంటుంది. అందుకే డేట్ వెల్లడించడం లేదు. ఇప్పటికే సూర్య షూట్ కంప్లీట్ అయ్యింది. బాబీ డియోల్ మీద చిత్రీకరణ కొనసాగుతోంది. సినిమాకు సంబంధించి కొంత ప్యాచ్ వర్క్ మిగిలి ఉంది. ఈ సినిమా 10 భాషల్లో థియేటర్లలో విడుదల అవుతుంది. ఓటీటీ విషయానికి వస్తే విదేశీ భాషల్లోనూ రిలీజ్ చేస్తాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ మీద ఫోకస్ పెట్టాం” అని వివరించారు. వాస్తవానికి ఈ ఏడాది వేసవి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు వార్తలు వచ్చాయి.
ఆరు అవతారాలు, మూడు భాగాలు
ఇక ఈ సినిమాలో సూర్య ఏకంగా ఆరు విభిన్న తరహా అవతారాల్లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అందులో ఓ పాత్రలో నెగిటివ్ షేడ్స్ కూడా ఉంటాయని సమాచారం. బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు, యోగి బాబు, కోవై సరళ సహా పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, UV క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మరో ఆసక్తికర విషయం ఏంటంటే 'కంగువా' మూవీ ఏకంగా మూడు భాగాలుగా రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, పార్ట్-1 అనుకున్న రేంజిలో సక్సెస్ సాధిస్తే మిగతా భాగాలను తెరకెక్కించే ప్లాన్ లో మూవీ యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి 'కంగువా' పార్ట్-1 ఎప్పుడు విడుదల అవుతుంది? ఎలా ఉండబోతోంది? అనే విషయాలపై ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
#KanguvaSecondLook 🔥🦅 #Kanguva https://t.co/pS3wBhVGHX
— Kanguva (@KanguvaTheMovie) January 16, 2024
Read Also: మాట నిలబెట్టుకున్న ‘హనుమాన్’ టీమ్, అయోధ్య రామయ్యకు భారీ విరాళం