Urvashi Rautela: పాపం ఊర్వశీ రౌతేలా, విశాఖలోనూ రిషబ్ పంత్ జపమే - తడబడిన చిరు
నటి ఊర్వశీ రౌతేలాకు ఊహించని షాకిచ్చారు రిషబ్ పంత్ అభిమానులు. ఆమె ప్రశంగిస్తున్నంత సేపు రిషబ్ పేరును జపించారు.
ఊర్వశీ రౌతేలా పేరు వినగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది రిషబ్ పంత్. ఎందుకంటే.. వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు ఒకప్పుడు వార్తలు వచ్చాయి. అయితే, దాని గురించి ఇద్దరూ ఎప్పుడూ బయటపడలేదు. కానీ, ఇరువురి మధ్య టామ్ అండ్ జెర్రీ వార్ నడుస్తోంది. వారి మధ్య ఉన్నది ప్రేమో, ద్వేషమో తెలియక ఇప్పటికీ అభిమానులు బుర్ర గోక్కుంటున్నారు. ఇటీవలే రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఊర్వశీ ట్వీట్టర్‌లో పరోక్షంగా అతడు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ పోస్ట్ పెట్టింది. ‘‘మీరు, మీ కుటుంబ సభ్యులతో క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నా’’ అని పేర్కొంది. ఆ తర్వాత రిషబ్ పంత్ చికిత్స పొందుతున్న హాస్పిటల్ ఫొటో పెట్టింది. దీంతో ఆమెను రిషబ్ అభిమానులు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ సెగ విశాఖపట్నానికి కూడా వ్యాపించింది. ‘వాల్తేరు వీరయ్య’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో రిషబ్ అభిమానులు ఇబ్బంది పడ్డారు.
‘వాల్తేరు వీరయ్య’ మూవీలో ఊర్వశీ రౌతేలా.. ‘‘వేర్ ఈజ్ ది పార్టీ’’ సాంగ్‌లో చిరంజీవితో కలిసి చిందేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ‘వాల్తేరు వీరయ్య’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో కూడా పాల్గొంది. అయితే, స్టేజ్ మీదకు రాగానే ప్రేక్షకుల్లో కొందరు ‘‘రిషబ్ పంత్.. రిషబ్ పంత్’’ అంటూ అరిచారు. ఆమె స్పీచ్ మొదలుపెట్టిన తర్వాత మరింత జోరుగా ‘‘రిషబ్ పంత్.. రిషబ్ పంత్’’ అంటూ నినాదించారు. దీంతో ఊర్వశీ రౌతేలా తన స్పీచ్‌ను మధ్యలో ఆపి.. అసహనంగా చిన్న స్మైల్ ఇచ్చి మళ్లీ కొనసాగించింది. ఆమె మాట్లాడుతున్నంత సేపు అభిమానులు రిషబ్ పేరు జపిస్తూనే ఉన్నారు.
ఊర్వశీ.. ప్రేక్షకులను తెలుగులో పలకరించింది. ఆ తర్వాత మూవీ గురించి చెబుతూ.. ‘‘ఈ మూవీలో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. అయితే, కేవలం పాటలో కాకుండా.. పూర్తి నిడివి గల పాత్రలో నటించాలని ఉంది. తప్పకుండా మరో అవకాశాన్ని ఇస్తారని భావిస్తున్నా. దేవిశ్రీ ఇంతకు ముందు కంపోజ్ చేసిన ‘‘డాడీ మమ్మీ’’ సాంగ్‌లో డ్యాన్స్ చేశాను. ఆ తర్వాత ‘‘బాస్ పార్టీ’’లో మరోసారి అవకాశం దొరికింది. రవితేజ నా ఫేవరెట్ నటుల్లో ఒకరు. మెగాస్టార్ చిరంజీవిగారితో పనిచేయడం చాలా గౌరవంగా భావిస్తున్నా’’ అని తెలిపింది. అయితే, చిరంజీవి తన స్పీచ్‌లో ఊర్వశీ రౌతేలా పేరు పిలిచేందుకు తడపడ్డారు. ఆమెను ఊర్వశీ రాథోడ్ అని పిలిచారు. ఆ తర్వాత ఊర్వశీ రౌతేలా అని పిలిచి.. ఆమెపై ప్రశంసలు కురిపించారు.
Also Read: త్వరలో నేనూ విశాఖవాసి కాబోతున్నా, శృతిని బెదిరించారేమో - బాలకృష్ణపై చిరంజీవి స్వీట్ సెటైర్