అన్వేషించండి

Viswam OTT : నిన్న అమెజాన్, నేడు ఆహా.. రెండు ఓటీటీల్లో ‘విశ్వం‘ స్ట్రీమింగ్

గోపీచంద్, శ్రీనువైట్ల కాంబోలో వచ్చిన రీసెంట్ మూవీ ‘విశ్వం’. దసరా కానుకగా విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి అడుగు పెట్టింది. రెండు స్ట్రీమింగ్ ప్లాట్ ఫారమ్స్ లో ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది.

Viswam OTT Platforms: మాచో స్టార్ గోపీచంద్, స్టార్ డైరెక్టర్ శ్రీనువైట్ల కాంబినేషన్‌లో వచ్చిన ‘విశ్వం’ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. దాదాపు 6 ఏళ్ల తర్వాత శ్రీను వైట్ల తెరకెక్కించిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గా వసూళ్లు సాధించింది. అయితే ఈ సినిమా థియేటర్లలో రిలీజైన ఇరవై రోజులకే ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా ప్రస్తుతం రెండు ఓటీటీల్లో ప్రేక్షకులకు అందుబాటులో ఉంది.

నిన్న అమెజాన్, నేడు ఆహాలో ‘విశ్వం’ స్ట్రీమింగ్

గోపీచంద్ సినిమా రెండు రోజుల క్రితం దీపావళి కానుకగా అమెజాన్ ప్రైమ్ వీడియో  స్ట్రీమింగ్ కు వచ్చింది. ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండా సైలెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీకి ఓటీటీలో ఆడియెన్స్ నుంచి మాంచి రెస్పాన్స్ వచ్చింది. కేవలం రెండు రోజుల్లోనే మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. ఇప్పుడు ఈ సినిమా తెలుగు ఓటీటీ దిగ్గజం ఆహా లోనూ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా వెల్లడించింది. గతంలో సుధీర్ బాబు హీరోగా నటించి ‘హరోం హర’ సినిమా సైతం రెండు ఓటీటీ ఫ్లాట్ ఫారమ్స్ లో స్ట్రీమింగ్ అయ్యింది. ఇప్పుడు ‘విశ్వం’ కూడా రెండు ఓటీటీల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాను రూ. 12 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఆహా ఎంతకు తీసుకుంది అనే విషయంపై క్లారిటీ లేదు.  

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ahavideoin (@ahavideoin)

కమర్షియల్‌ సక్సెస్ సాధించలేకపోయిన ‘విశ్వం’

గోపీచంద్-శ్రీనువైట్ల కాంబోలో వచ్చిన ఈ సినిమాని ఫుల్ ఆన్ కామెడీ ఎంటర్‌ టైనర్‌ గా తెరకెక్కించారు. కామెడీ రొటీన్ గా ఉండటంతో థియేటర్లలో ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ‘లౌక్యం’ సినిమా తర్వాత గోపీ చంద్ పలు సినిమాలు చేసినా, అనుకున్న స్థాయిలో విజయాలను అందుకోలేకపోయాయి. శ్రీను వైట్ల కూడా ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించినా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచింది. దీపావళి వరకు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 17 కోట్ల గ్రాస్ సాధించింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర యావరేజ్‌గా నిలిచింది. కమర్షియల్‌ గా ‘విశ్వం’ సక్సెస్ కాలేకపోయింది.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియెస్ ‘విశ్వం’ సినిమాను సంయుక్తంగా నిర్మించాయి. వేను దొనేపూడి, టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల, కొండల్ జిన్నాలు సంయుక్తంగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. ఈ మూవీలో గోపీచంద్, కావ్య థాపర్‌ హీరో హీరోయిన్లుగా నటించగా, చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. థియేటర్లలో చూడని ప్రేక్షకులు అమెజాన్, లేదంటే ఆహాలో చూసి ఎంజాయ్ చేయండి.

 

Read Also: తెలుగు సినిమాల బాటలో ‘కంగువా’, తెల్లవారుజాము నుంచే షోలు షురూ!

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: బ్లాక్‌ కీ దక్కించుకొని పవర్ పోగొట్టుకుందెవరు? ఎలిమినేషన్ జరిగిందా! రేపటి నుంచి రెండో అవతారం!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: బ్లాక్‌ కీ దక్కించుకొని పవర్ పోగొట్టుకుందెవరు? ఎలిమినేషన్ జరిగిందా! రేపటి నుంచి రెండో అవతారం!
Pavala Shyamala Daughter: పావలా శ్యామల కుమార్తెకు మురళీమోహన్, నరేష్ సాయం... దాతలకు 'మా' పిలుపు
పావలా శ్యామల కుమార్తెకు మురళీమోహన్, నరేష్ సాయం... దాతలకు 'మా' పిలుపు
Secret Soldier: చైనా పీస్ టైటిల్ 'సీక్రెట్ సోల్జర్'గా ఎందుకు మారింది? సెన్సార్‌ డిలే ఎందుకు? - హీరోలు చెప్పిన విశేషాలు
చైనా పీస్ టైటిల్ 'సీక్రెట్ సోల్జర్'గా ఎందుకు మారింది? సెన్సార్‌ డిలే ఎందుకు? - హీరోలు చెప్పిన విశేషాలు
Vijay Trisha: త్రిష ఎంట్రీతో విజయ్ కంగారు... ముఖం పక్కకు తిప్పేశాడుగా!
త్రిష ఎంట్రీతో విజయ్ కంగారు... ముఖం పక్కకు తిప్పేశాడుగా!

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: పదవి నుంచి తొలగించినందుకు బాధగా లేదు, మళ్లీ మంత్రిని అవుతాను: కొండా సురేఖ ధీమా
పదవి నుంచి తొలగించినందుకు బాధగా లేదు, మళ్లీ మంత్రిని అవుతాను: కొండా సురేఖ ధీమా
AP TET Results: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. స్కోర్ కార్డ్ ఇలా డౌన్ లోడ్ చేసుకోండి
ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. స్కోర్ కార్డ్ ఇలా డౌన్ లోడ్ చేసుకోండి
Buses To Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్, బాలాపూర్‌ గణేష్ దర్శనానికి RTC ప్రత్యేక బస్సులు
ఖైరతాబాద్ గణేష్, బాలాపూర్‌ గణేష్ దర్శనానికి RTC ప్రత్యేక బస్సులు
IND VS AFG 1st T20 Result Update: అభిషేక్ వీర‌విహారం.. 22 బంతుల్లోనే ఫిఫ్టీ.. ఆఫ్గాన్ పై టీమిండియా బంప‌ర్ విక్ట‌రీ.. స‌త్తా చాటిన ఇషాన్, అర్ష‌దీప్
అభిషేక్ ఊచకోత.. 22 బంతుల్లోనే ఫిఫ్టీ.. ఆఫ్గాన్ పై టీమిండియా బంప‌ర్ విక్ట‌రీ.. స‌త్తా చాటిన ఇషాన్, అర్ష‌దీప్
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: బ్లాక్‌ కీ దక్కించుకొని పవర్ పోగొట్టుకుందెవరు? ఎలిమినేషన్ జరిగిందా! రేపటి నుంచి రెండో అవతారం!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: బ్లాక్‌ కీ దక్కించుకొని పవర్ పోగొట్టుకుందెవరు? ఎలిమినేషన్ జరిగిందా! రేపటి నుంచి రెండో అవతారం!
Arvind Kejriwal: గోవాలో కూటమి ఏర్పాటు చేసిన AAP.. అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన, ఆ పార్టీ అంత స్పెషలా ?
గోవాలో కూటమి ఏర్పాటు చేసిన AAP.. అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన, ఆ పార్టీ అంత స్పెషలా ?
18th BRICS Summit: ఖనిజాలు, టెక్నాలజీని ఆయుధాలుగా మార్చవద్దు.. బ్రిక్స్ సదస్సు ముగింపులో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
ఖనిజాలు, టెక్నాలజీని ఆయుధాలుగా మార్చవద్దు.. బ్రిక్స్ సదస్సు ముగింపులో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
2026 మారుతి బలెనోలో ఏం మారింది? ఇంజిన్ పవర్‌, మైలేజ్‌, ఫీచర్లు పెరిగాయా, తగ్గాయా?
పాత బలెనోకు కొత్త బలెనోకు తేడా ఇదే.. కొనే ముందు ఈ విషయాలు తెలుసుకోండి!
Embed widget