News
News
X

Vishwak Sen-Ravi Teja's Film: రవితేజ దర్శకత్వంలో విశ్వక్ సేన్ మూవీ, గ్రాండ్ గా #VS10 ప్రారంభం

మాస్ హీరో విశ్వక్ సేన్ తాజా మూవీకి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చింది. రవితేజ దర్శకత్వంలో #VS10 తెరకెక్కబోతోంది. రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ప్రారంభోత్సం ఘనంగా జరిగింది.

FOLLOW US: 
Share:

నటుడు విశ్వక్ సేన్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. 2017లో ‘వెళ్లిపోమాకే’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత ‘ఈ నగరానికి ఏమైంది’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ తర్వాత ఆయన స్వీయ దర్శకత్వంలో ‘ఫలక్ నుమా దాస్’ వచ్చింది. అనంతరం వచ్చిన ‘హిట్: ది ఫస్ట్ కేస్’ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన మార్క్ నటన, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు విశ్వక్.

ఘనంగా #VS10 ప్రారంభోత్సవం

ఆయన తాజాగా మరో సినిమా చేయబోతున్నారు. విశ్వక్ కెరీర్ లో 10వ సినిమాగా #VS10 తెరకెక్కబోతోంది. ఈ సినిమాకు రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. #VS10 ఓపెనింగ్  హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో గ్రాండ్‌గా జరిగింది. పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ఘనంగా ప్రారంభం అయ్యింది. ఈ సినిమా  ముహూర్తానికి నిర్మాత రామ్‌ తాళ్లూరి భార్య రజనీ క్లాప్‌ కొట్టారు. రచయిత, నిర్మాత మచ్చ రవి కెమెరా స్విచాన్‌ చేశారు. దర్శకుడు రవితేజ ముళ్లపూడి తొలి షాట్‌కి దర్శకత్వం వహించారు. దానికి ముందు, రామ్ తాళ్లూరి ప్రొసీడింగ్స్ ప్రారంభించడానికి దర్శకుడికి స్క్రిప్ట్‌ ను అందజేశారు. ఈ సందర్భంగా సినిమా పోస్టర్ ను విడుదల చేశారు.

View this post on Instagram
 
A post shared by Vishwaksen (@vishwaksens)

హీరోయిన్ గా మీనాక్షి చౌదరి ఫిక్స్!

వినోదభరితంగా సాగే ఈ చిత్రంలో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరిని తీసుకున్నారు.  యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందే ఈ సినిమాలో విశ్వక్ సేన్ తో పాటు పలువురు ప్రముఖ నటీనటులు ఉంటారు. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ ట్యూన్ అందించనున్నారు. మనోజ్ కటసాని కెమెరా క్రాంక్ చేస్తున్నారు. అన్వర్ అలీ ఎడిటర్, క్రాంతి ప్రియం ప్రొడక్షన్ డిజైనర్. సత్యం రాజేష్, విద్యాసాగర్ జె ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు. త్వరలోనే రెగ్యులర్ షూట్‌ను ప్రారంభించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

‘ధమ్కీ’ ప్రమోషన్స్ లో విశ్వక్ సేన్ బిజీ బిజీ

అటు  విశ్వక్ సేన్ తర రాబోయే యాక్షన్ డ్రామా ‘ధమ్కీ’ విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ఈ సినిమా  మార్చి 22, 2023న థియేటర్లలోకి రాబోన్నది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో ఆయన బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో నివేదా పేతురాజ్  హీరోయిన్ గా నటిస్తోంది. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ విభిన్నమైన జోనర్‌ల సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు.   

View this post on Instagram
 
A post shared by Vishwaksen (@vishwaksens)

Read Also: మహేష్ బాబు, రాజమౌళి సినిమాపై కీరవాణి కీలక వ్యాఖ్యలు - ఫ్యాన్స్‌కు పండుగే!

Published at : 19 Mar 2023 03:28 PM (IST) Tags: Vishwak sen Meenakshi Chaudhary Ravi Teja Film #VS10 Ram Talluri

సంబంధిత కథనాలు

NBK108 OTT Details : రికార్డు రేటుకు బాలకృష్ణ సినిమా ఓటీటీ రైట్స్

NBK108 OTT Details : రికార్డు రేటుకు బాలకృష్ణ సినిమా ఓటీటీ రైట్స్

Dasara Movie Controversy : వివాదంలో ‘దసరా’ మూవీ, ఆ సీన్లు తొలగించాలంటూ అంగన్ వాడీల ఆందోళన

Dasara Movie Controversy : వివాదంలో ‘దసరా’ మూవీ, ఆ సీన్లు తొలగించాలంటూ అంగన్ వాడీల ఆందోళన

Sai Dharam Tej On Accident : మాట విలువ తెలిసింది... ప్రమాదం ఓ పీడకల కాదు, అదొక స్వీట్ మెమరీ - సాయి ధరమ్ తేజ్

Sai Dharam Tej On Accident : మాట విలువ తెలిసింది... ప్రమాదం ఓ పీడకల కాదు, అదొక స్వీట్ మెమరీ - సాయి ధరమ్ తేజ్

Upasana On Ram Charan : నా మార్గదర్శి రామ్ చరణ్ - భర్త గురించి ఉపాసన ఎంత బాగా చెప్పిందో

Upasana On Ram Charan : నా మార్గదర్శి రామ్ చరణ్ - భర్త గురించి ఉపాసన ఎంత బాగా చెప్పిందో

Samantha Ruth Prabhu : చీకట్లో బతికా, నాగ చైతన్యతో విడాకులపై మరోసారి సమంత కామెంట్

Samantha Ruth Prabhu : చీకట్లో బతికా, నాగ చైతన్యతో విడాకులపై మరోసారి సమంత కామెంట్

టాప్ స్టోరీస్

Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్‌మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్

Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్‌మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్

Kadiam Srihari: ఎన్నికల్లో నన్ను వాడుకుంటారు, ఈ మీటింగ్‌లకు మాత్రం పిలవరు - ఎమ్మెల్సీ కడియం వ్యాఖ్యలు

Kadiam Srihari: ఎన్నికల్లో నన్ను వాడుకుంటారు, ఈ మీటింగ్‌లకు మాత్రం పిలవరు - ఎమ్మెల్సీ కడియం వ్యాఖ్యలు

MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం

MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం

IPL Match Hyderabad: హైదరాబాద్‌లో IPL సందడి - టీఎస్ఆర్టీసీ, హైదరాబాద్ మెట్రో కీలక ప్రకటనలు

IPL Match Hyderabad: హైదరాబాద్‌లో IPL సందడి - టీఎస్ఆర్టీసీ, హైదరాబాద్ మెట్రో కీలక ప్రకటనలు