(Source: ECI/ABP News/ABP Majha)
Vishnu Priya Manas New Song : నల్లంచు చీరెదాన, నకిలీసు పెట్టేదానా - విష్ణుప్రియ, మానస్ మళ్లీ దుమ్మురేపారుగా
‘జరీ జరీ పంచెకట్టి’ అంటూ అదరిపోయే స్టెప్పులతో ఆకట్టుకున్న విష్ణుప్రియ, మానస్ మరోపాటతో అలరించబోతున్నారు. ‘గంగులు’ అనే పేరుతో రూపొందిన ఈ పాటకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదల అయ్యింది.
యాంకర్ గా, నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ విష్ణుప్రియ. బుల్లితెరపై పలు షోలు చేయడంతో పాటు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలు, రీల్స్ షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది. ఇక టీవీ సీరియల్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు మానస్. బిగ్ బాస్ షోలో పాల్గొని బాగా పాపులారిటీ సంపాదించాడు.
దుమ్మురేపిన ‘జరీ జరీ పంచెకట్టి’ సాంగ్
ఆ తర్వాత విష్ణుప్రియ, మానస్ కలిసి ‘జరీ జరీ పంచెకట్టి’ అనే ప్రైవేట్ సాంగ్ కు డ్యాన్స్ చేసి అదరగొట్టారు. ఊరమాస్ స్టెప్పులు వేస్తూ అందరినీ అలరించారు. మాస్ బీట్, వెరైటీ స్టెప్పులతో కూడిన ఈ పాట యూట్యూబ్ ను ఓ ఊపు ఊపింది. సుద్దాల అశోక్ తేజ ఈ పాటను రాయగా, మదీని సంగీతం అందించారు. శ్రవణ భార్గవి, సాకేత్, స్పూర్తి కలిసి పాడిన ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.
View this post on Instagram
మాస్ స్టెప్పులతో ఆకట్టుకుంటున్న ‘గంగులు’ ప్రోమో
‘జరీ జరీ పంచెకట్టి’ అనే పాట చార్ట్ బస్టర్ గా నిలవడంతో మానస్, విష్ణు ప్రియ కలిసి ‘గంగులు’ అనే మరో సాంగ్ తో అలరించబోతున్నారు. ‘నల్లంచు చీరెదాన, నకిలీసు పెట్టేదాన’ అంటూ సాగే ఈ పాటలో అదిరిపోయే స్టెప్పులతో ఆకట్టుకున్నారు. మానసం, విష్ణు ప్రియ మధ్య కెమెస్ట్రీ మరోసారి వర్కౌట్ అయ్యింది. ఈ పాట సైతం గతంలో తెరకెక్కిన ‘జరీ జరీ పంచెకట్టి’ అనే పాట మాదిరిగానే రిచ్ గా తెరకెక్కించారు. ఇద్దరి స్టెప్పులు చూసి ప్రేక్షకులు వారెవ్వా అంటున్నారు. ఈ పాట, సినిమా పాటకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. బీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ పాటకు, జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ప్రోమో విడుదలైన కాసేపటికే రేంజిలో వ్యూస్ వచ్చాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పూర్తి పాట ఎప్పుడు విడుదల అవుతుందా? అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ పాట ‘జరీ జరీ పంచెకట్టి’ పాటను మించి హిట్ కావడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు.
View this post on Instagram
అటు ‘జరీ జరీ పంచెకట్టి’ అనే పాటను నిర్మించిన నివ్రితి వైబ్స్, ‘గంగులు’ పాటను కూడా రూపొందించింది. గతంలో మాదరిగానే ఖర్చుకు వెనుకాడకుంగా గ్రాండ్ లుక్ వచ్చేలా తెరకెక్కించింది. అదిరిపోయే లిరిక్స్, అంతకు మించి స్టెప్పులతో ఈ పాట కూడా చార్ట్ బస్టర్ కాబోతుందని చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదు. ఇలాంటి మంచి పాటలు ఎన్నో తీస్తూ నివృతి వైబ్స్ కు ఇండస్ట్రీ లో మంచి పేరు తెచ్చుకోవాలని నెటిజన్లు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.
Read Also: ఏమిరా వారీ, 9 నెలలు లంచ్ చేయలేదా? ఆకట్టుకుంటున్న రవితేజ, నాని స్పెషల్ ఇంటర్వ్యూ ప్రోమో