అన్వేషించండి

Ravi Teja- Nani Interview: ఏమిరా వారీ, 9 నెలలు లంచ్ చేయలేదా? ఆకట్టుకుంటున్న రవితేజ, నాని స్పెషల్ ఇంటర్వ్యూ ప్రోమో

ఇండస్ట్రీలో హీరోలుగా నిలదొక్కుకునేందుకు బాగా కష్టపడ్డారు రవితేజ, నాని. ప్రస్తుతం స్టార్ డమ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా వీరిద్దరు కలిసి ఓ ఇంటర్వ్యూలో ప్రత్యక్షం అయ్యారు.

తెలుగు సినిమా పరిశ్రమలో రాణించేందుకు ఎన్నో స్ట్రగుల్స్ ఎదుర్కొన్న నటులు మాస్ మహరాజ్ రవితేజ, నేచురల్ స్టార్ నాని. ఇండస్ట్రీలో నటించే అవకాశం కోసం ఏండ్లకు ఏండ్లుగా ఎదురు చూసి ప్రస్తుతం స్టార్ డమ్ అనుభవిస్తున్నారు. దాదాపు ఇద్దర సినీ జర్నీ ఒకేలా ఉంటుంది. వీరిద్దరు కలిసి ఏ సినిమా చేయనప్పటికీ, నాని నిర్మించిన ‘అ!’ సినిమాకు రవితేజ వాయిస్ ఓవర్ ఇచ్చారు. 

ఆకట్టుకుంటున్న రవితేజ, నాని ఫన్నీ ఇంటర్వ్యూ

ప్రస్తుతం నాని హీరోగా ‘దసరా’ అనే పాన్ ఇండియన్ మూవీ తెరకెక్కింది. అటు రవితేజ హీరోగా ‘రావణాసుర’ సినిమా విడుదలకు రెడీ అయ్యింది. ‘దసరా’ మూవీ ఈ నెల 30న, ‘రావణాసుర’ సినిమా ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఇద్దరు కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ‘ధరణి x రావణాసుర’ అంటూ ఈ ఇంటర్వ్యూను కొనసాగించారు. ‘స‌మ్‌థింగ్ ఫన్నీగా చేశాం’ అంటూ ఇప్పటికే నాని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తాజాగా ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది.  

అభిమానులు ఫుల్ ఖుషీ 

ఈ ఇంటర్వ్యూలో రవితేజ, నాని తమ సినిమాల గురించి ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ’దసరా’ సినిమాలో తాను చెప్పిన ’’మొలదారం కింద గుడాలు రాలుతాయ్’’ అనే డైలాగ్ కు తొలుత అర్థం తెలియనిద నాని చెప్పారు. ఆ తర్వాత దర్శకుడిని అడిగితే అసలు విషయం చెప్పారన్నారు. అటు తాజాగా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాల “ఏమిరా వారీ” అనే డైలాగ్ బాగా నచ్చినట్లు చెప్పారు రవితేజ. హీరో కాలేమని ఫిక్సై అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యానని చెప్పిన నాని, దానికి ముందు ఓ పేజీ ఉందన్నారు. దాన్ని ఇప్పటి వరకు ఓపెన్ చేయలేదన్నారు. ఫిట్ నెస్ కోసం చాలా కష్టపడినట్లు చెప్పిన నాని, తొమ్మిది నెలల పాటు లంచ్ చేయలేదన్నారు. వీరిద్దరి ఇంటర్వ్యూ ప్రోమో చూసి రవితేజ, నాని అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nani (@nameisnani)

మార్చి 30న ‘దసరా’, ఏప్రిల్ 7న ‘రావణాసుర’ విడుదల

నాని రీసెంట్ గా ‘దసరా’ సినిమాలో నటించారు. ఈ సినిమాను శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీను మార్చి 30న దేశవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. మరోవైపు, రవితేజ తాజాగా ‘రావణాసుర’ సినిమాలో నటించారు. ఈ సినిమాకు సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా, ప్రియాంకా అరుళ్‌ మోహన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 7న విడుదల కానుంది. ఇద్దరి సినిమాలు కొన్నిరోజుల వ్యవధిలోనే రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఇద్దరూ కలసి ఈ ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు.  

ప్రస్తుతానికి రవితేజ, నాని సినిమాలు ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంటున్నారు. సాధారణంగా ఒక హీరో సినిమాకు ఇంకో హీరో ప్రమోషన్స్ ఇవ్వరు. రవితేజ, నాని విషయంలో కొత్త ఫార్ములా ముందుకు వచ్చింది. ఇద్దరూ కలసి తమ సినిమాలకు ప్రమోషన్ చేసుకుంటున్నారు. అందులో భాగంగానే ఈ ఇంటర్వ్యూ విడుదలకు రెడీ అయ్యింది. పూర్తి ఇంటర్వ్యూ త్వరలో విడుదల కానుంది.

Read Also: నవ్వడం తప్ప ఏం చేయలేను, ప్లాస్టిక్ సర్జరీ వార్తలపై స్పందించిన బాలీవుడ్ నటుడు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Best Selling Cars: టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Best Selling Cars: టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
Best Selling Smartphones: 2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Embed widget