అన్వేషించండి

Anandhi: ఓటీటీలోకి సైలెంట్‌గా వచ్చిన రోహిత్, ఆనంది సినిమా - తప్పకుండా చూడాలని చెప్పిన విష్ణు మంచు

ఆనంది గత ఏడాది ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలో నటించారు. ఇప్పుడు ఆ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సినిమాను ఎందులో చూడొచ్చంటే?

హీరోయిన్ ఆనంది గుర్తు ఉన్నారా? రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు పాన్ ఇండియా 'రాజా సాబ్' తెరకెక్కిస్తున్న మారుతి దర్శకుడిగా పరిచయమైన 'ఈ రోజుల్లో' చిన్న రోల్ చేశారు. ఆ తర్వాత 'బస్ స్టాప్' సినిమాతో కథానాయికగా పరిచయం అయ్యారు. తెలుగు చిన్న సినిమాలు చేశాక... తమిళంలో నటించిన సూపర్ హిట్ 'కాయల్' ఆమె దశను మార్చింది. వరుసపెట్టి తమిళ సినిమాలు చేశారు. 'జాంబీ రెడ్డి', 'శ్రీదేవి సోడా సెంటర్' సినిమాలతో మళ్లీ ఆనంది తెలుగు సినిమాలకు వచ్చారు. 

ఇప్పుడు ఆమె ప్రస్తావన ఎందుకంటే... ఆనంది గత ఏడాది ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమా చేశారు. ఇప్పుడు ఆ సినిమా సైలెంట్‌గా ప్రముఖ ఓటీటీ వేదికలో విడుదల అయ్యింది.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'విధి'
యువ కథానాయకుడు రోహిత్ నందాకు జంటగా ఆనంది నటించిన సినిమా 'విధి'. నో ఐడియా ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రంజిత్. ఎస్ ప్రొడ్యూస్ చేశారు. ఈ చిత్రానికి శ్రీకాంత్ దర్శకత్వం వహించారు. శ్రీనాథ్ రంగనాథన్ కథ రాశారు. అంతే కాదు... ఛాయాగ్రాహకుడిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. గత ఏడాది నవంబర్ 3న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి వచ్చింది. 

అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో 'విధి' సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. హీరో, 'మా' అధ్యక్షుడు విష్ణు మంచు ట్వీట్ చేయడంతో ఓటీటీలో విడుదలైన విషయం చాలా మందికి తెలిసింది. ''బ్రదర్ రోహిత్ నందాకు ఆల్ ది బెస్ట్. అతని సినిమా 'విధి' అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది ఆల్ రౌండర్ ఎంటర్టైనర్. తప్పకుండా చూడండి'' అని విష్ణు మంచు పేర్కొన్నారు.

Also Read: గురూజీ ముఖంలో నవ్వులు - 'గుంటూరు కారం' విడుదలయ్యాక తొలిసారి...

ఆ పెన్నుతో రాస్తే మరణం... విధి కథ ఏమిటంటే?'విధి' సినిమా కథ విషయానికి వస్తే... ఈ సినిమాలో ఒక పెన్ కీలక పాత్ర పోషించింది. ఆ పెన్నుతో ఎవరు రాసినా చనిపోతుంటారు. అసలు అలా ఎందుకు జరుగుతుంది? ఆ పెన్ నేపథ్యం ఏంటి? హీరో చేతికి పెన్ వచ్చిన తర్వాత దాంతో అతను ఏం చేశాడు? అనేది సినిమా. ఆద్యంతం ఆసక్తిగా సాగుతుందని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. ఆయన నేపథ్య సంగీతం సినిమాకు బలంగా నిలిచింది.

Also Readనైంటీస్ వెబ్ సిరీస్ దర్శకుడికి రెండు సినిమా ఆఫర్లు - ఫస్ట్ మూవీ ఏ హీరోతో అంటే?

''డిఫరెంట్ కంటెంట్‌, కొత్త కథలతో వచ్చే సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూ ఉంటారు. అలా వచ్చిన చిత్రమే మా 'విధి'. గత ఏడాది థియేటర్లలో ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్  ఇచ్చిందని పలువురు ప్రేక్షకులు ప్రశంసించారు. ఇప్పుడీ సినిమా అమెజాన్‌ ఓటీటీలో జనవరి 25 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఓటీటీ వీక్షకులను సైతం ఆకట్టుకుంటుందని నమ్మకం ఉంది'' అని దర్శక నిర్మాతలు తెలిపారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Lagacherla Case: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మపుష్ప 2 ట్రైలర్‌లో హైలైట్ షాట్ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Lagacherla Case: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Vishwak Sen : మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
Kantara Chapter 1 Release Date: గాంధీ జయంతికి 'కాంతార' ప్రీక్వెల్... లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన రిషబ్ శెట్టి
గాంధీ జయంతికి 'కాంతార' ప్రీక్వెల్... లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన రిషబ్ శెట్టి
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Embed widget