అన్వేషించండి

Mark Antony Trailer: సైన్స్ ఫిక్షన్ గ్యాంగ్‌స్టర్ సినిమాతో వచ్చిన విశాల్ - ‘మార్క్ ఆంటోనీ’ ట్రైలర్ చూశారా?

విశాల్, ఎస్‌జే సూర్య నటిస్తున్న ‘మార్క్ ఆంటోని’ ట్రైలర్ విడుదల అయింది.

ప్రముఖ తమిళ హీరో విశాల్, ఎస్‌జే సూర్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘మార్క్ ఆంటోని’.  గతంలో ‘త్రిష లేదా నయనతార’, ‘బఘీర’ సినిమాలకు దర్శకత్వం వహించిన ఆదిక్ రవిచంద్రన్ ఈ సినిమాకు డైరెక్టర్. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో సాగే సైన్స్ ఫిక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది. ‘మార్క్ ఆంటోని’ని సెప్టెంబర్ 15వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా ట్రైలర్ ఇప్పుడు యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. ప్రముఖ నటుడు కార్తీ ఈ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే... ఇందులో కథను పెద్దగా రివీల్ చేయలేదని చెప్పవచ్చు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా రానుందని ట్రైలర్ చూసి అర్థం చేసుకోవచ్చు. ప్రముఖ తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్, తెలుగు నటుడు సునీల్ పాత్రలను కూడా ట్రైలర్‌లో చూపించారు. ఒక ఫోన్ ద్వారా టైమ్ ట్రావెల్ చేయడం అనే పాయింట్‌పై సినిమా తెరకెక్కింది. ట్రైలర్‌లో సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్‌తో విశాల్ నుంచి ప్రేక్షకులు కోరుకునే యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. హీరో విశాల్ డ్యూయల్ రోల్ చేయనున్నారు. ఎస్‌జే సూర్య పాత్ర, ఆయన నటన సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. 

గత కొంత కాలంగా కోలీవుడ్ హీరో విశాల్ ఓ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. 2018 లో వచ్చిన 'అభిమన్యుడు' తర్వాత ఇప్పటివరకు అతనికి మరో హిట్టు పడలేదు. ప్రస్తుతం విశాల్ ఏకంగా మూడు సినిమాల షూటింగ్ చేస్తున్నాడు. అందులో 'మార్క్ ఆంటోనీ' సినిమా కూడా ఒకటి. ఈ సినిమాలో విశాల్ రెండు డిఫరెంట్ రోల్స్ లో కనిపించనున్నారు. టైమ్ ట్రావెల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపొందిందని టీజర్, ట్రైలర్ చూసి చెప్పవచ్చు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ మంచి రెస్పాన్స్ ని అందుకొని క్యూరియాసిటీని పెంచాయి. ‘ఐ లవ్యూ డీ’ అంటూ సాగే పాట కూడా ఆకట్టుకుంటోంది. ‘మార్క్ ఆంటోని’ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు విశాల్.

సెప్టెంబర్ 15వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో తమిళం తో పాటు హిందీ, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రంలో తెలుగు హీరోయిన్ రీతు వర్మ కథానాయికగా నటిస్తోంది. ఎస్ జె సూర్య, సునీల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ‘మార్క్ ఆంటోని’ సినిమాని మినీ స్టూడియోస్ ఎల్ఎల్‌పీ బ్యానర్ పై ఎస్ వినోద్ కుమార్ నిర్మిస్తున్నారు. విశాల్ చివరగా 'లాఠీ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో విశాల్ ఓ కానిస్టేబుల్ పాత్రను పోషించారు. కానీ ‘లాఠీ’ ఆశించిన విజయం సాధించలేదు.

టాప్ హెడ్ లైన్స్

Gopichand As Villian: సూర్య మూవీలో విలన్‌గా గోపీచంద్..! తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న టాలీవుడ్ మ్యాచో స్టార్
సూర్య మూవీలో విలన్‌గా గోపీచంద్..! తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న టాలీవుడ్ మ్యాచో స్టార్
Panchayat Series Season 5 OTT: ఓటీటీలోకి పంచాయత్ సీజన్ 5 - ఫులేరాలో మళ్లీ మొదలుకానున్న రాజకీయ రచ్చ... స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలోకి పంచాయత్ సీజన్ 5 - ఫులేరాలో మళ్లీ మొదలుకానున్న రాజకీయ రచ్చ... స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Bigg Boss Season 10 Today Nov 18th Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: ముకేశ్, త్రిగుణ్‌ల్లో రంగు పడిందెవరికి? అల్టిమేట్ పవర్ కోసం ఫైట్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: ముకేశ్, త్రిగుణ్‌ల్లో రంగు పడిందెవరికి? అల్టిమేట్ పవర్ కోసం ఫైట్!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 18th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిల్లలకు చివరి డోస్ పట్టేసిన మహా.. ప్రాణాపాయం! ఒంటరిగా అడవిలో విహారి.. రౌడీల అటాక్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిల్లలకు చివరి డోస్ పట్టేసిన మహా.. ప్రాణాపాయం! ఒంటరిగా అడవిలో విహారి.. రౌడీల అటాక్!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cyclone Akvan Update: దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
KTR News: కృష్ణా జలాల్లో తెలంగాణకు కాంగ్రెస్ తీరని ద్రోహం.. బీఆర్ఎస్ మరో పోరాటం తప్పదన్న కేటీఆర్
కృష్ణా జలాల్లో తెలంగాణకు కాంగ్రెస్ తీరని ద్రోహం.. బీఆర్ఎస్ మరో పోరాటం తప్పదన్న కేటీఆర్
YS Jagan Assests Case: వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ మరో ఛార్జిషీట్.. రూ.150 కోట్ల మనీలాండరింగ్ అభియోగాలు!
వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ మరో ఛార్జిషీట్.. రూ.150 కోట్ల మనీలాండరింగ్ అభియోగాలు!
Fire Accident: దేవుడికి పెట్టిన దీపం కాల్చి బూడిద చేసింది -పేట్ బషీరాబాద్‌లో 2 ఫ్లాట్లలో సామాగ్రి దగ్దం
దేవుడికి పెట్టిన దీపం కాల్చి బూడిద చేసింది -పేట్ బషీరాబాద్‌లో 2 ఫ్లాట్లలో సామాగ్రి దగ్దం
Indiramma Kutumba Jeevitha Bima: కోటికిపైగా కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ .. రేపటి నుంచి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' స్కీమ్ ప్రారంభం!
కోటికిపైగా కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ .. రేపటి నుంచి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' స్కీమ్ ప్రారంభం!
Siddipet Politics: సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
Hardik Pandya News: PBKS గూటికి చేరిన హార్దిక్ పై కోచ్ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఒత్తిడిలో ఆడే ఆటగాడి లోటు తీరిందని సంబరం
PBKS గూటికి చేరిన హార్దిక్ పై కోచ్ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఒత్తిడిలో ఆడే ఆటగాడి లోటు తీరిందని సంబరం
N Ramchander Rao: 15 వేల కుటుంబాల ఇళ్ల జోలికి రావద్దు.. మియాపూర్ భూముల వేలాన్ని అడ్డుకుంటామన్న రాంచందర్ రావు
15 వేల కుటుంబాల ఇళ్ల జోలికి రావద్దు.. మియాపూర్ భూముల వేలాన్ని అడ్డుకుంటామన్న రాంచందర్ రావు
Embed widget