By: ABP Desam | Updated at : 29 Jan 2022 08:19 PM (IST)
విశాల్ కొత్త సినిమా రిలీజ్.. ఎప్పుడంటే..?
విశాల్ హీరోగా నటిస్తూ.. నిర్మిస్తోన్న చిత్రం 'సామాన్యుడు'. తు.ప.శరవణన్ దర్శకత్వంలో వహిస్తోన్న ఈ సినిమాలో డింపుల్ హయాతి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను కోలీవుడ్ తో పాటు తెలుగులో కూడా విడుదల చేయనున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు.
ముందుగా ఈ సినిమాను రిపబ్లిక్ డే కానుకగా విడుదల చేయాలనుకున్నారు. కానీ తమిళనాడులో ఆదివారం నాడు ఉన్న లాక్ డౌన్ అలానే ఇతర కారణాల వలన ఈ సినిమాను వాయిదా వేశారు. తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. ఫిబ్రవరి 4న తెలుగు, తమిళ భాషల్లో సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. మాలిక్ స్టీమ్స్ కోపరేషన్ సంస్థ ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తోంది. ఈ సినిమాలో విశాల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు.
యోగి బాబు, బాబురాజ్ జాకబ్, పీఏ తులసి, రవీనా రవి తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రల్లో నటించారు. విశాల్ నటిస్తున్న 31వ సినిమా ఇది. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో కొంత భాగం షూటింగ్ హైదరాబాద్ లోనే నిర్వహించారు.
Here’s the fierce and rageful trailer @VishalKOfficial’s #VeeramaeVaagaiSoodum & #Saamanyudu 🔥
— Vishal Film Factory (@VffVishal) January 19, 2022
🔗Tamil: https://t.co/jnUy8aXglc
🔗 Telugu: https://t.co/IwJiWc5gk1#VeeramaeVaagaiSoodumTrailer #SaamanyuduTrailer #VVSTrailer#Vishal @Thupasaravanan1 @thisisysr @DimpleHayathi pic.twitter.com/z6qgfrxVmL
NTR: ‘ఈ గుండెని ఒక్కసారి తాకిపో తాతా’ - జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్
Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!
The Warriorr: రామ్ 'ది వారియర్' షూటింగ్ పూర్తి - రిలీజ్ కు ఏర్పాట్లు
Black Movie Review - 'బ్లాక్' రివ్యూ: ఆది సాయికుమార్ హిట్ అందుకున్నాడా? అతడి ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందా?
RRR in Netflix: రామ్, భీమ్ ఫుట్బాల్ - ఏందయ్య ఇది మేమెక్కడా సూడలే!
AP TS 10th Exam Results: ఆ తేదీల్లో ఏపీలో టెన్త్ రిజల్ట్స్ విడుదలయ్యే ఛాన్స్ - తెలంగాణలో స్పాట్ వ్యాల్యుయేషన్ ప్రారంభం
Vijayashanthi: విజయశాంతి - వీకే శశికళ రహస్య భేటీ! మూడేళ్ల క్రితం సాధ్యంకానిది ఇప్పుడవుతుందా?
Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?
Mahanadu Chandrababu : నేను వస్తా.. దోచినదంతా కక్కిస్తా - మహానాడులో చంద్రబాబు హెచ్చరిక !