అన్వేషించండి

Balayya Grandson: బాలయ్య వారసుడొస్తున్నాడు - కొడుకు కాదు, మనవడు - డైలాగ్ ఇరగదీశాడుగా!

బాలయ్య ఫ్యామిలీ నుంచి మరో సినీ వారసుడు తయారవుతున్నాడు. ఇప్పటికే ఆయన కొడుకు సినిమాల్లోకి రాబోతున్నాడనే టాక్ నడుస్తుండగా, తాజాగా ఆయన మనువడు సినిమా డైలాగులతో అదరగొడుతున్నాడు.

సినిమా పరిశ్రమలో నందమూరి కుటుంబానికి ఉన్న ప్రత్యేకత గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. నందమూరి తారక రామారావు మొదలుకొని జూనియర్ ఎన్టీఆర్ వరకు ఎంతో మంది ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. సక్సెస్ ఫుల్ హీరోలుగా రాణిస్తున్నారు. త్వరలో నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ తేజ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నాడు. ఈ విషయాన్ని బాలయ్యే స్వయంగా వెల్లడించారు. తాజాగా ఆయన ఫ్యామిలీ నుంచి మరో సినీ వారసుడు రెడీ అవుతున్నాడు. అతనెవ్వరో కాదు.. బాలయ్య మనవడే. 

మాస్ డైలాగ్ తో అదరగొట్టిన బాలయ్య మనువడు

తాజాగా బాలయ్య, మలినేని గోపీచంద్ కాంబోలో ‘వీరసింహారెడ్డి’ సినిమా తెరకెక్కుతోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ప్రతిష్టాత్మకంగా రూపోందుతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒంగోలులో జరిగింది. ఈ వేడుకలో బాలయ్య మనువడు ఆర్యవీర్ కు సంబంధించిన ఓ వీడియోను ప్రదర్శించారు. ఇందులో ఆర్య పవర్ ఫుల్ డైలాగ్ చెప్పి అదరగొట్టాడు. ‘‘భయం నా బయోడేటాలో లేదురా’’ అనే డైలాగ్ చెప్పి శభాష్ అనిపించాడు. ఈ వీడియో ‘వీర సింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్లే కావడంతోనే బాలయ్య అభిమానులు ఈలలు వేస్తూ కేరింతలు కొట్టారు. నందమూరి ఫ్యామిలీ నుంచి మరో సినీ వారసుడు రాబోతున్నాడంటూ నినాదాలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.   

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ABP Desam (@abpdesam)

అభిమానులను ఊర్రూతలూగిస్తున్న‘వీరసింహారెడ్డి‘ ట్రైలర్  

అటూ బాలయ్య ‘వీరసింహారెడ్డి‘ సినిమాకు సంబంధించి తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మాస్, ఊరమాస్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా ట్రైలర్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తోంది. బాలయ్య డైలాగులు ఎలా ఉండాలని అభిమానులు కోరుకుంటారో, అదే స్థాయిలో ఈ ట్రైలర్ కట్ చేయించారు డైరెక్టర్ గోపీచంద్ మలినేని. ఈ చిత్రంలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుండగా, వరలక్ష్మి శరత్ కుమార్, కన్నడ హీరో దునియా విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా విడుదల కాబోతోంది. మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’తో పాటు పలు సినిమాలతో ఈ చిత్రం పోటీకి సై అంటోంది.

Read Also: ‘పఠాన్’కు పాట్లు - బాయ్‌కాట్‌పై బాలీవుడ్ కలవరం, కేంద్రాన్ని ఆశ్రయించిన సినీ పెద్దలు 

టాప్ హెడ్ లైన్స్

Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
Jagadhatri Serial Today August 14th:కమలాకర్‌కు సారీ చెప్పి దగ్గరైన యువరాజు....జేడీపై గెలవడానికి మీనన్ ఎలాంటి ఎత్తు వేశాడు...?
జగద్ధాత్రి సీరియల్:కమలాకర్‌కు సారీ చెప్పి దగ్గరైన యువరాజు....జేడీపై గెలవడానికి మీనన్ ఎలాంటి ఎత్తు వేశాడు...?
Jo Jo Movie: దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
Husharu Pittalu Review - 'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?
'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget