By: ABP Desam | Updated at : 08 Apr 2022 04:33 PM (IST)
అకిరా నందన్ పవర్‌ఫుల్ పంచ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరా నందన్ ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. తన కొడుకు 18వ సంవత్సరంలోకి ఎంటర్ అవుతుండడంతో రేణుదేశాయ్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ.. ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో అకిరా నందన్ బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. తన పవర్‌ఫుల్ పంచ్ లతో ఆశ్చర్యపరిచాడు. దీంతో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన చాలా మంది అకిరా హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడని భావించారు. మీడియాలో కూడా వార్తలొచ్చాయి.
దీంతో రేణుదేశాయ్ తన కొడుకు డెబ్యూ ఫిలింపై క్లారిటీ ఇచ్చింది. అకిరాకు హీరో అవ్వాలని లేదని.. ఇప్పటివరకు ఏ సినిమా సైన్ చేయలేదని.. దయచేసి అలాంటి రూమర్స్ నమ్మొద్దంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో పెట్టింది. కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం అకిరా నందన్ తన తండ్రి లెగసీను కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు కాకపోయినా.. ఎప్పటికైనా అకిరా సినిమాల్లోకి వస్తాడని ఆశిస్తున్నారు.
రేణుదేశాయ్ ఇప్పటికే చాలా సార్లు తన కొడుక్కి హీరో అవ్వాలని లేదంటూ చెప్పుకొచ్చింది. అకిరాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టమని.. ఆ దిశగా అడుగులు వేస్తాడేమో అని కూడా చెప్పింది. కానీ అకిరా సినిమాల్లోకి వస్తాడనే వార్తలు మాత్రం ఆగలేదు. ప్రస్తుతం అకిరా కిక్ బాక్సింగ్, కర్రసాము లాంటి విద్యలు నేర్చుకుంటున్నాడు. మరి సినిమాల విషయంలో ఈ స్టార్ కిడ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి!
Also Read: రణబీర్ కపూర్ పెళ్లిలో మాజీ గర్ల్ ఫ్రెండ్స్ హడావిడి?
Also Read: బాలీవుడ్ లో షారుఖ్, ఇక్కడేమో బన్నీ - మురుగదాస్ ప్లాన్ మాములుగా లేదు
Bobby Deol: కలలా అనిపిస్తోందంటూ కన్నీళ్లు పెట్టుకున్న ‘యానిమల్’ విలన్ బాబీడియోల్
Bigg Boss 7 Telugu: SPY vs SPA - నువ్వేమైనా ఒలింపిక్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చావా? శోభా నామినేషన్‌కు శివాజీ కౌంటర్
Trisha: ‘యానిమల్’ చిత్రానికి త్రిష షాకింగ్ రివ్యూ - నెటిజన్స్ ట్రోల్ చేయడంతో..
Nindu Noorella Saavasam December 4th Episode: ఘోర ప్రశ్నకి దొరికిన సమాధానం.. తప్పంతా నాదే అంటూ ఫీలవుతున్న అరుంధతి!
Santosham Film Awards: 'సంతోషం' అవార్డుల్లో కన్నడ స్టార్స్‌కు అవమానం - కొండేటిపై గరం గరం
DK Shiva Kumar: పార్క్ హయాత్‌లో డీకే శివకుమార్ కీలక భేటీలు, సీఎల్పీకి ముందే ఉత్కంఠ!
Cyclone Michaung: తుపాను సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష- ప్రజలకు ఇబ్బంది రావద్దని చంద్రబాబు సూచన
JC Prabhakar Reddy: తాడిపత్రిలో హై టెన్షన్! జేసీని అడ్డుకున్న పోలీసులు
CLP Meeting News: గచ్చిబౌలిలో సీఎల్పీ మీటింగ్, సీఎం ఎంపికపై ఉత్కంఠ, ప్రమాణ స్వీకారం నేడే ఉంటుందా?
/body>