By: ABP Desam | Updated at : 05 Jul 2022 06:00 PM (IST)
రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ లో విజయ్ సేతుపతి
కోలీవుడ్ లో విజయ్ సేతుపతికి ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. అక్కడి అభిమానులంతా ఆయన్ను మక్కల్ సెల్వన్ అని ప్రేమగా పిలుచుకుంటారు. తన కెరీర్ లో పలు విభిన్న పాత్రల్లో నటించి వెర్సటైల్ యాక్టర్ గా పేరు సంపాదించుకున్నారు విజయ్ సేతుపతి. హీరోగానే కాకుండా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా కూడా తన సత్తా చాటుతున్నారు. 'ఉప్పెన', 'విక్రమ్', 'మాస్టర్' వంటి సినిమాల్లో విలన్ గా కనిపించి తన ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెంచుకున్నారు విజయ్ సేతుపతి.
అందుకే ఇప్పుడు దర్శకులు ఆయన్ను విలన్ రోల్ లో చూపించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా షారుఖ్ ఖాన్ తో అట్లీ రూపొందిస్తోన్న 'జవాన్' సినిమాలో విజయ్ సేతుపతిని ఎన్నుకున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. విజయ్ ని దాదాపుగా ఫైనల్ చేశారని.. షారుఖ్ కూడా ఓకే చెప్పిన తరువాత అఫీషియల్ గా ప్రకటించనున్నారట. ఇప్పటివరకు బాలీవుడ్ ఎన్నడూ చూడని అతి క్రూరమైన విలన్ గా విజయ్ సేతుపతి కనిపిస్తాడట.
ఈ సినిమాతో పాటు 'పుష్ప2'లో కూడా విజయ్ సేతుపతి విలన్ గా కనిపించనున్నారని సమాచారం. ఇతడి కోసం సుకుమార్ ఓ ప్రత్యేకమైన ట్రాక్ రాసుకున్నారని టాక్. నిజానికి 'పుష్ప' పార్ట్ 1లోనే విజయ్ సేతుపతిని విలన్ గా అనుకున్నారట. కానీ కాల్షీట్స్ సమస్య రావడంతో విజయ్ నో చెప్పారట. ఈసారి మాత్రం విజయ్ సేతుపతిని ఎలాగైనా ఆన్ బోర్డ్ చేయాలనుకుంటున్నారు సుకుమార్. అదే గనుక నిజమైతే బన్నీ, షారుఖ్ సినిమాలతో పాన్ ఇండియా లెవెల్లో విజయ్ సేతుపతి పాపులర్ అవ్వడం ఖాయం!
Viral Video : ఇప్పుడూ ఊ అంటున్నారే - సమంత పాట వచ్చి ఎనిమిది నెలలైనా క్రేజ్ తగ్గలేదుగా
Janaki Kalaganaledu August 10th Update: కొత్త క్యారెక్టర్ ఎంట్రీ, దొంగల్ని చితక్కొట్టిన జానకి - జ్ఞానంబ సర్ప్రైజ్ - నోరెళ్ళబెట్టిన మల్లిక
Prashanth Neel : నిర్మాతగా మారుతున్న 'కెజియఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్?
Rashmika On Dating : విజయ్ దేవరకొండతో డేటింగ్పై స్పందించిన రష్మిక
Swathimuthyam Release Date : దసరా సీజన్ టార్గెట్ చేసిన బెల్లంకొండ
Patriotic Poets of India: అక్షరాలనే ఆయుధాలుగా మార్చి ఆంగ్లేయులపై పోరాడిన రచయితలు వీళ్లే
IB Terror Warning: హైదరాబాద్లో ఉగ్రదాడులకు ఛాన్స్! IB వార్నింగ్, ఈ ప్రాంతాల్లో పోలీసులు హైఅలర్ట్
Road Accident: ఒక్కసారిగా టైరు పేలి కారు బోల్తా, నలుగురు మృతి - నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
Godavari Floods: భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి - రెండో ప్రమాద హెచ్చరిక జారీ