అన్వేషించండి

Ranjithame Telugu Song : 'రంజితమే' వచ్చేసింది - తెలుగులోనూ విజయ్, రష్మిక ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తారా?

విజయ్, రష్మిక జంటగా నటిస్తున్న 'వారసుడు' సినిమాలో 'రంజితమే' సాంగును ఈ రోజు విడుదల చేశారు.

'రంజితమే'... ఆరేళ్ళ చిన్న పిల్లాడి నుంచి అరవై ఏళ్ళ వృద్ధుల వరకూ తమిళ స్టార్ విజయ్ అభిమానులను ఉర్రూతలు ఊగించిన సాంగ్! ఇప్పుడు ఇదొక హుక్ లైన్! యూట్యూబ్‌లో ఈ సాంగ్ రచ్చ రచ్చ చేసింది. విజయ్ అభిమానులు మాత్రమే కాదు... రష్మిక అభిమానులు సైతం రచ్చ రచ్చ చేసేలా చేసింది. ఇప్పుడీ సాంగ్ తెలుగు వెర్షన్ ఈ రోజు విడుదల అయ్యింది. తెలుగులోనూ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తారో? లేదో? చూడాలి.
   
తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay) కథానాయకుడిగా, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) కథానాయికగా నటిస్తున్న సినిమా 'వారసుడు' (Varasudu Movie). తమిళ సినిమా 'వారిసు' (Varisu) కు తెలుగు అనువాదం ఇది. సంక్రాంతి సందర్భంగా జనవరిలో సినిమా విడుదల కానుంది. ఆల్రెడీ సినిమాలో ఫస్ట్ సాంగ్ విడుదల చేశారు. అదే 'రంజితమే'. ఇప్పుడు ఆ సాంగ్ తెలుగు వెర్షన్ విడుదల చేశారు. 

అక్కడ హీరో విజయ్...
ఇక్కడ అనురాగ్ కులకర్ణి!
తమిళంలో 'రంజితమే...' పాటను విజయ్ పాడారు. తెలుగులో ఈ పాటను యువ గాయకుడు అనురాగ్ కులకర్ణి ఆలపించారు. ఫిమేల్ లిరిక్స్ మాత్రం తమిళంలో పాడిన ఎంఎం మానసి తెలుగులో కూడా పాడారు. తెలుగు పాటకు రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. సంగీత సంచలనం ఎస్.ఎస్. తమన్ ఈ పాటకు బాణీ అందించిన సంగతి తెలిసిందే.

రికార్డుల మోత మోగించిన తమిళ పాట!
తెలుగు, తమిళం అని తేడా లేకుండా 'రంజితమే...' తమిళ పాటను ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు అందరూ విన్నారు. దాంతో రికార్డుల మోత మోగింది. మూడు వారాల క్రితం పాట విడుదల కాగా... ఇప్పటి వరకు 75 మిలియన్ వ్యూస్ వచ్చాయి. రెండు మిలియన్స్ లైక్స్ వచ్చాయి. తెలుగు సాంగ్ ఎటువంటి రికార్డులు క్రియేట్ చేస్తోందో చూడాలి.

Also Read : కొరటాలను కార్నర్ చేసిన మణిశర్మ - 'ఆచార్య' ఫ్లాప్‌కు ఆయనే కారణమా?
   

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sri Venkateswara Creations (@srivenkateswaracreations)


తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న చిత్రమిది. 'వారసుడు' సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై 'దిల్' రాజు, శిరీష్... పీవీపీ పతాకంపై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి. పొట్లూరి నిర్మిస్తున్నారు. సంక్రాంతికి సినిమాను విడుదల చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. 

Varisu Movie Pre Release Business : తెలుగు థియేట్రికల్ రైట్స్ కాకుండా 'వారసుడు' మిగతా రైట్స్ అన్నీ కలిపి సుమారు 280 కోట్లకు ఇచ్చేశారట. సినిమా నిర్మాణానికి సుమారు 250 కోట్లు అవుతోందని వినబడుతోంది. ఆ లెక్కన విజయ్ సినిమాతో 'దిల్' రాజుకు 30 కోట్లు లాభమే. అది కాకుండా తెలుగు థియేట్రికల్ రైట్స్ ఉన్నాయి. ఎటు చూసినా దిల్ రాజు మంచి ప్రాఫిట్స్ అందుకుంటున్నారని ట్రేడ్ వర్గాల టాక్.
 
Varasudu Movie Cast And Crew : ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, శామ్, యోగి బాబు, సంగీత, సంయుక్త తదితరులు 'వారసుడు'లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లితో పాటు హరి, అహిషోర్‌ సాల్మన్‌ కథ, స్క్రీన్ ప్లేను అందించారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సినెమాటోగ్రఫీ: కార్తీక్ పళని కూర్పు: కె.ఎల్. ప్రవీణ్, సహ నిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షిత.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
World's Worst Tsunami: ఆ మహా ప్రళయానికి 20 ఏళ్లు -  మానవాళి మరచిపోలేని పీడకల, రాకాసి అలలు మిగిల్చిన కన్నీళ్లు!
ఆ మహా ప్రళయానికి 20 ఏళ్లు - మానవాళి మరచిపోలేని పీడకల, రాకాసి అలలు మిగిల్చిన కన్నీళ్లు!
Boxing Day Test Live Updates: వివాదంలో చిక్కుకున్న కోహ్లీ.. నిషేధమా..? లేక జరిమానా..? ఐసీసీ రూల్ బుక్ ఏం చెబుతోందంటే..?
వివాదంలో చిక్కుకున్న కోహ్లీ.. నిషేధమా..? లేక జరిమానా..? ఐసీసీ రూల్ బుక్ ఏం చెబుతోందంటే..?
Crime News: కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సునామీ బీభత్సానికి 20 ఏళ్లు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న మత్స్యకారులుఅయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తతగుంతలమయమైన రోడ్లు, డ్రోన్‌లతో వింత నిరసనలుMS Dhoni Christmas Santa | జివా అడిగితే ధోనీ చేయకుండా ఉంటాడా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
World's Worst Tsunami: ఆ మహా ప్రళయానికి 20 ఏళ్లు -  మానవాళి మరచిపోలేని పీడకల, రాకాసి అలలు మిగిల్చిన కన్నీళ్లు!
ఆ మహా ప్రళయానికి 20 ఏళ్లు - మానవాళి మరచిపోలేని పీడకల, రాకాసి అలలు మిగిల్చిన కన్నీళ్లు!
Boxing Day Test Live Updates: వివాదంలో చిక్కుకున్న కోహ్లీ.. నిషేధమా..? లేక జరిమానా..? ఐసీసీ రూల్ బుక్ ఏం చెబుతోందంటే..?
వివాదంలో చిక్కుకున్న కోహ్లీ.. నిషేధమా..? లేక జరిమానా..? ఐసీసీ రూల్ బుక్ ఏం చెబుతోందంటే..?
Crime News: కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
Shruthi Haasan : పెళ్లి కంటే రిలేషన్​షిప్​లో ఉండడమే ఇష్టం... పెళ్లిపై మరోసారి శృతి హాసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
పెళ్లి కంటే రిలేషన్​షిప్​లో ఉండడమే ఇష్టం... పెళ్లిపై మరోసారి శృతి హాసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Ind Vs Aus Test Series: హోరాహోరీగా బాక్సింగ్ డే టెస్టు - చివరి సెషన్లో సత్తా చాటిన భారత బౌలర్లు
హోరాహోరీగా బాక్సింగ్ డే టెస్టు - చివరి సెషన్లో సత్తా చాటిన భారత బౌలర్లు
SBI Special FD: ఎఫ్‌డీపై ఎక్కువ రాబడి కావాలంటే ఎస్‌బీఐ వైపు చూడండి - స్పెషల్‌ స్కీమ్‌ స్టార్టెడ్‌
ఎఫ్‌డీపై ఎక్కువ రాబడి కావాలంటే ఎస్‌బీఐ వైపు చూడండి - స్పెషల్‌ స్కీమ్‌ స్టార్టెడ్‌
Viral News: 'దీపావళి రోజున రాముని వేషధారణలో వస్తారా?' - శాంటాక్లాజ్ డ్రెస్‌లో ఫుడ్ డెలివరీ, కట్ చేస్తే!
'దీపావళి రోజున రాముని వేషధారణలో వస్తారా?' - శాంటాక్లాజ్ డ్రెస్‌లో ఫుడ్ డెలివరీ, కట్ చేస్తే!
Embed widget