News
News
X

Samantha Kushi Movie: ‘ఖుషి’ సినిమా సెట్స్‌కు సమంత, ఎట్టకేలకు పట్టాలెక్కిన ప్రేమకథ

నటి సమంత ‘ఖుషి’ మూవీ షూటింగ్ లో జాయిన్ అయింది. ఉమెన్స్ డే సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ సెట్స్ కు వెల్కం చెప్పింది మూవీ టీమ్.

FOLLOW US: 
Share:

టాలీవుడ్ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘ఖుషి. ఈ సినిమాలో స్టార్ నటుడు విజయ్ దేవరకొండ, నటి సమంత హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. అయితే సమంత అనారోగ్యానికి గురి కావడంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. అప్పటి నుంచి ఈ సినిమా షూటింగ్ తర్వాత షెడ్యూల్ ప్రారంభించలేదు. దీంతో ఈ మూవీపై ట్రోల్స్ మొదలయ్యాయి. ఈ సినిమా నుంచి సమంత తప్పుకుందని, డేట్స్ అడ్జెస్ట్ చేయలేదు అంటూ వార్తలు వచ్చాయి. కానీ తర్వాత స్వయంగా మూవీ టీమ్ సమంత ఈ మూవీ నుంచి తప్పుకోలేదని, త్వరలో ఆమె షూటింగ్ లో పాల్గొంటుందని ప్రకటించారు. దీంతో ఆ వార్తలకు చెక్ పడింది. కానీ అప్పటి నుంచి ఈ మూవీ షూటింగ్ గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు. తాజాగా నటి సమంత ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ అయిందని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఉమెన్స్ డే సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ సెట్స్ కు వెల్కం చెప్పారు. దీంతో ఈ మూవీ పై వస్తోన్న వార్తలకు చెక్ పడింది. 

నటి సమంత ఇటీవల మయోసైటిస్ అనే కండరాలకు సంబంధించిన వ్యాధి బారిన పడింది. దీంతో ఆమె చికిత్స కోసం కొన్నాళ్లు సినిమా షూటింగ్ లకు దూరం గా ఉంటూ రెస్ట్ తీసుకుంటుంది. అయితే చాలా రోజులు సమంత షూటింగ్ లకు దూరంగా ఉండటంతో ‘ఖుషి’ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఆమె పూర్తిగా కోలుకోవడంతో మళ్ళీ తిరిగి షూటింగ్ లలో పాల్గొంటుంది. ఇటీవలే సమంత ‘సిటాడెల్’ అనే హిందీ వెబ్ సిరీస్ షూటింగ్ లో పాల్గొంది. రాజ్ అండ్ డీకే ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ లో సమంత సీరియస్ రోల్ లో కనిపించనున్నట్లు సమాచారం. ఇటీవలే షూటింగ్ సమయంలో సమంత రెండు చేతులకు గాయాలయ్యాయి. అందుకు సంబంధించిన ఫోటోలను సమంత సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి. 

ఈ ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ షూటింగ్ కు బ్రేక్ దొరకడంతో సమంత శివ నిర్వాణ తీస్తున్న ‘ఖుషి’ సినిమాను కంప్లీట్ చేయనుంది. అందుకే మార్చి 8 నుంచి ‘ఖుషి’ షూటింగ్ లో పాల్గొంటుంది సమంత. దీంతో మూవీ టీమ్ సమంతకు వెల్కం చెబుతూ ఈ ప్రకటనను విడుదల చేశారు. దీంతో ఆగిపోయింది అనుకుంటున్న ‘ఖుషి’ సినిమా ఎట్టకేలకు సెట్స్ పైకి వెళ్లింది. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి జూన్ మాసం లో ఈ మూవీను విడుదల చేయాలని చూస్తున్నారట మేకర్స్. ఇక ‘లైగర్’ సినిమాతో ఫ్లాప్ ను చవిచూశాడు హీరో విజయ్ దేవరకొండ. మరోవైపు ‘టక్ జగదీష్’ లాంటి సినిమాతో కాస్త వెనకబడ్డాడు శివ నిర్వాణ. బాలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉంటున్న సమంత వీరు ముగ్గురి కాంబినేషన్ లో వస్తున్న ఈ ‘ఖుషి’ సినిమా ప్రేక్షకులను ఎంతవరకూ ఖుషీ చేస్తుందో చూడాలి. 

Also Read : 'కెజియఫ్' మీద కామెంట్స్‌పై వెనక్కి తగ్గని వెంకటేష్ మహా - మంట మీద పెట్రోల్ పోశారా?

Published at : 09 Mar 2023 10:37 AM (IST) Tags: Vijay Deverakonda Shiva Nirvana Kushi Samantha

సంబంధిత కథనాలు

Actress Samantha:వాళ్లంతట వాళ్లే ఇవ్వాలి గానీ, అడుక్కోకూడదు: సమంత

Actress Samantha:వాళ్లంతట వాళ్లే ఇవ్వాలి గానీ, అడుక్కోకూడదు: సమంత

Jaya Janaki Nayaka Hindi Dubbed: బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాకు హిందీలో రికార్డు స్థాయిలో వ్యూస్, అందుకే ‘ఛత్రపతి’ రిమేక్ చేస్తున్నారా?

Jaya Janaki Nayaka Hindi Dubbed: బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాకు హిందీలో రికార్డు స్థాయిలో వ్యూస్, అందుకే ‘ఛత్రపతి’ రిమేక్ చేస్తున్నారా?

Shah Rukh Khan Rolls Royce: ఖరీదైన లగ్జరీ కారు కొన్న షారుఖ్ ఖాన్ - ఆ డబ్బుతో నాలుగైదు విల్లాలు కొనేయోచ్చేమో!

Shah Rukh Khan  Rolls Royce: ఖరీదైన లగ్జరీ కారు కొన్న షారుఖ్ ఖాన్ - ఆ డబ్బుతో నాలుగైదు విల్లాలు కొనేయోచ్చేమో!

Ravanasura Trailer : వాడు లా చదివిన క్రిమినల్ - రవితేజ 'రావణాసుర' ట్రైలర్ వచ్చిందోచ్

Ravanasura Trailer : వాడు లా చదివిన క్రిమినల్ - రవితేజ 'రావణాసుర' ట్రైలర్ వచ్చిందోచ్

Nidhi Agarwal: నిధి అగర్వాల్ పూజలు - అవకాశాల కోసమేనా?

Nidhi Agarwal: నిధి అగర్వాల్ పూజలు - అవకాశాల కోసమేనా?

టాప్ స్టోరీస్

Revanth Reddy : కేటీఆర్ కనుసన్నల్లో సిట్ విచారణ, ఆయన పీఏ ఒక పావు మాత్రమే- రేవంత్ రెడ్డి

Revanth Reddy : కేటీఆర్ కనుసన్నల్లో సిట్ విచారణ, ఆయన పీఏ ఒక పావు మాత్రమే- రేవంత్ రెడ్డి

PAN-Aadhaar: పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు - జూన్‌ 30 వరకు ఛాన్స్‌

PAN-Aadhaar: పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు - జూన్‌ 30 వరకు ఛాన్స్‌

Mekapati vs Anilkumar: మాజీ మంత్రి అనిల్ వర్సెస్ ఎమ్మెల్యే మేకపాటి - సెటైర్లు మామూలుగా లేవు!

Mekapati vs Anilkumar: మాజీ మంత్రి అనిల్ వర్సెస్ ఎమ్మెల్యే మేకపాటి - సెటైర్లు మామూలుగా లేవు!

Group 1 Mains Postponed : ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?

Group 1 Mains Postponed :  ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?