News
News
X

Vijay Devarakonda : విజయ్ దేవరకొండ అభిమానులకు గుడ్ న్యూస్ - 'ఖుషి' ఖుషీగా...

విజయ్ దేవరకొండ అభిమానులకు గుడ్ న్యూస్ ఇది. 'ఖుషి' గురించి యూనిట్ కొత్త కబురు చెప్పింది. విజయ్ దేవరకొండతో దర్శకుడు, సంగీత దర్శకుడు దిగిన సెల్ఫీ విడుదల చేసింది.

FOLLOW US: 
Share:

విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) అభిమానులకు గుడ్ న్యూస్. వాళ్ళను 'ఖుషి' చేసే కబురు చెప్పారు. సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుందని ఫీల్ అవుతున్న వాళ్ళకు కొత్త కబురు అందించారు. అసలు వివరాల్లోకి వెళితే...
 
మ్యూజిక్ సిట్టింగ్స్ షురూ!
'ఖుషి' దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana), సంగీత దర్శకుడు హేషామ్ అబ్దుల్ వాహాబ్ (Hesham Abdul Wahab) ను హీరో విజయ్ దేవరకొండ కలిశారు. సినిమాలో సాంగ్స్ ఎలా ఉండాలనేది డిస్కస్ చేశారు. మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలు అయ్యాయని చిత్ర బృందం తెలిపారు.

View this post on Instagram
 
A post shared by Hesham Abdul Wahab (@heshamabdulwahab)

త్వరలో సెట్స్ మీదకు!
సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu) అనారోగ్యం (మయోసైటిస్) బారిన పడటంతో 'ఖుషి' చిత్రీకరణకు బ్రేక్ పడింది. మళ్ళీ ఎప్పుడు షూటింగ్ మొదలు అవుతుందా? అని విజయ్ దేవరకొండ అభిమానులు ఎదురు చూశారు. అయితే, సమంత 'సిటాడెల్' వెబ్ సిరీస్ షూటింగ్ స్టార్ట్ చేయడంతో కొందరు డిజప్పాయింట్ అయ్యారు. ఓ అభిమాని అయితే 'ఖుషి' సంగతి ఏంటి? అని సమంతను ప్రశ్నించారు. అందుకు బదులుగా ఆమె ''అతి త్వరలో 'ఖుషి' మళ్ళీ మొదలు అవుతుంది. విజయ్ దేవరకొండ అభిమానులకు క్షమాపణలు చెబుతున్నా'' అని రిప్లై ఇచ్చారు.  సమంత పూర్తి ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుంటున్నట్లు విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు. 

Also Read : 'పోకిరి', 'బాహుబలి' మేజిక్ రిపీట్ అవుతుందా? - ఇండస్ట్రీ హిట్ మీద కన్నేసిన అఖిల్ 

సమంత వస్తే షూటింగ్ స్టార్ట్ చేయడానికి హీరో విజయ్ దేవరకొండతో పాటు సినిమా యూనిట్ మొత్తం సిద్ధంగా ఉంది. కొన్ని రోజుల క్రితం ఈ సినిమాపై ఓ పుకారు వచ్చింది. దాని సారాంశం ఏంటంటే... మార్చి తొలి వారానికి కూడా 'ఖుషి' సెట్స్‌కు సమంత రాకపోతే మరో సినిమా చేయాలని దర్శకుడు శివ నిర్వాణ ఆలోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. వాటిని ఆయన ఖండించారు. ''అతి త్వరలో 'ఖుషి' రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ప్రతిదీ అందంగా ఉండబోతుంది'' అని ఆయన పేర్కొన్నారు. దాంతో పుకార్లకు చెక్ పడింది.

Also Read : రక్తపు మడుగులో వాణీ జయరామ్ - మిస్టరీగా లెజండరీ సింగర్ మృతి 

'ఖుషి'ను తొలుత గత ఏడాది డిసెంబర్ 23న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ఆ తేదీకి ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఎందుకు? అనేది ప్రేక్షకులు అందరికీ తెలుసు. అనుకున్న ప్రకారం చిత్రీకరణ జరగలేదు. హీరో విజయ్ దేవరకొండ కూడా 'లైగర్' చిత్రీకరణలో గాయాలు కావడంతో చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేస్తే ఎలా ఉంటుందని డిస్కషన్స్ జరిగాయి. ప్రస్తుత పరిస్థితి చూస్తే ఫిబ్రవరిలో విడుదల అయ్యే ప్రస్తక్తి లేదు. వేసవికి విడుదల కావచ్చని టాక్. అప్పటికి అయినా వస్తుందో? లేదో? 

శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి 'ఖుషి' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనిని తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో మలయాళ నటుడు జయరామ్, మరాఠీ నటుడు సచిన్ ఖేడేకర్, ఇంకా మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, 'వెన్నెల' కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఫైట్స్: పీటర్ హెయిన్, సంగీత దర్శకుడు : హిషామ్ అబ్దుల్ వాహాబ్, సీఈవో : చెర్రీ, ఛాయాగ్రహణం: జి. మురళి.  

Published at : 05 Feb 2023 09:50 AM (IST) Tags: Vijay Deverakonda Shiva Nirvana Hesham Abdul Wahab Samantha Kushi Music Sittings

సంబంధిత కథనాలు

Saindhav: గన్నులు, బుల్లెట్లు, బాంబులతో వస్తున్న వెంకటేష్ ‘సైంధవ్’ - రిలీజ్ డేట్ ఫిక్స్!

Saindhav: గన్నులు, బుల్లెట్లు, బాంబులతో వస్తున్న వెంకటేష్ ‘సైంధవ్’ - రిలీజ్ డేట్ ఫిక్స్!

PS2 Telugu Trailer: వావ్ అనిపించే విజువల్స్, మైమరపించే మ్యూజిక్ - ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ట్రైలర్ వచ్చేసింది!

PS2 Telugu Trailer: వావ్ అనిపించే విజువల్స్, మైమరపించే మ్యూజిక్ - ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ట్రైలర్ వచ్చేసింది!

Dasara' movie: ‘దసరా’ సినిమా వెనుక 5 ఆసక్తికర విషయాలు, తెలిస్తే మిస్ చేయకుండా చూస్తారు!

Dasara' movie: ‘దసరా’ సినిమా వెనుక 5 ఆసక్తికర విషయాలు, తెలిస్తే మిస్ చేయకుండా చూస్తారు!

Priyanka Chopra: పెళ్లికి ముందే అండాలను దాచిపెట్టాను, అమ్మే అలా చేయమంది: ప్రియాంక చోప్రా

Priyanka Chopra: పెళ్లికి ముందే అండాలను దాచిపెట్టాను, అమ్మే అలా చేయమంది: ప్రియాంక చోప్రా

Shaakuntalam in 3D: 3Dలో ‘శాకుంతలం’ - ఐమ్యాక్స్‌లో ట్రైలర్ చూసి, ప్రేక్షకులు ఫిదా

Shaakuntalam in 3D: 3Dలో ‘శాకుంతలం’ - ఐమ్యాక్స్‌లో ట్రైలర్ చూసి, ప్రేక్షకులు ఫిదా

టాప్ స్టోరీస్

ABP CVoter Karnataka Opinion Poll: కర్ణాటకలో కింగ్ కాంగ్రెస్, ఆసక్తికర విషయాలు చెప్పిన ABP CVoter ఒపీనియన్ పోల్‌

ABP CVoter Karnataka Opinion Poll: కర్ణాటకలో కింగ్ కాంగ్రెస్, ఆసక్తికర విషయాలు చెప్పిన ABP CVoter ఒపీనియన్ పోల్‌

Supreme Court Notice To CM Jagan : సాక్షి పత్రిక కొనుగోలుకు వాలంటీర్లకు ప్రజాధనం - సీఎం జగన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు !

Supreme Court Notice To CM Jagan : సాక్షి పత్రిక కొనుగోలుకు వాలంటీర్లకు ప్రజాధనం  - సీఎం జగన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు !

TSPSC AEE Exam: ఏఈఈ నియామక పరీక్షల షెడ్యూలు ఖరారు, సబ్జెక్టులవారీగా తేదీలివే!

TSPSC AEE Exam: ఏఈఈ నియామక పరీక్షల షెడ్యూలు ఖరారు, సబ్జెక్టులవారీగా తేదీలివే!

Sri Rama Navami Wishes In Telugu 2023: మీ బంధు మిత్రులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి

Sri Rama Navami Wishes In Telugu 2023: మీ బంధు మిత్రులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి