News
News
X

Vijay Devarakonda: ‘లైగర్’ డిజాస్టర్‌తో విజయ్ దేవరకొండ కీలక నిర్ణయం, ఛార్మీకి కాస్త ఓదార్పు!

‘లైగర్‘ ఫ్లాప్ తో విజయ్ దేవరకొండ కీలక నిర్ణయం తీసుకున్నాడు. నాన్ థియేట్రికల్ ​రైట్స్​ లో తన వాటా ను వదులుకున్నాడు. పారితోషికంలో రూ. 6 కోట్ల రూపాయలను వెనక్కి ఇచ్చినట్లు తెలుస్తున్నది.

FOLLOW US: 

విజయ్ దేవరకొండ తాజా సినిమా లైగర్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియన్ సినిమా ఆగష్టు 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మాస్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న పూరి, రౌడీ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ కాంబోలో ఈ సినిమా రావడంతో ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు.. వీరిద్దరు కలిసి రూపొందించిన తొలి సినిమా సైతం ఇదే కావడంతో మంచి విజయం సాధిస్తుందని అందరూ భావించారు. కానీ, అంచనాలను తలకిందులు చేస్తూ ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా నిర్మాతలు ఘోరంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో నిర్మాతల నష్టాన్ని కొంతమేర తగ్గించేందుకు విజయ్ దేవరకొండ కీలక నిర్ణయం తీసుకున్నాడని తెలిసింది. 

భారీగా కలెక్షన్లను సాధిస్తుందని ఊహించినా..

లైగర్ సినిమా కోసం జరిగిన ప్రమోషన్స్ చూసి.. ఈ సినిమా రూ.200 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు కలెక్షన్లు సాధిస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేశారు. అనుకున్నట్లుగా ఈ సినిమాకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే జరిగింది. అయితే సినిమా విడుదలయ్యాయే అసలు కథ మొదలయ్యింది. భారీగా వసూళ్లు వస్తాయని భావించిన సినిమా నిర్మాతలకు ఊహించని రీతిలో పరాభవం ఎదురైంది. సౌత్ నుంచి నార్త్ వరకు.. అన్ని భాషల్లోనూ ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. తొలి షో నుంచే సినిమాకు సంబంధించి నెగెటివ్ టాక్ వచ్చింది. అయినా రెండు రోజుల పాటు ఫర్వాలేదు అనిపించేలా కలెక్షన్లు వచ్చాయి. మూడో రోజు నుంచి ప్రేక్షకులు థియేటర్లకు రావడమే మానేశారు. కలెక్షన్లు పూర్తిగా పడిపోయాయి. దీంతో నిర్మాతలకు భారీగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ఛార్మి కౌర్, పూరి జగన్నాథ్ తో పాటు బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమా ఫ్లాప్ కావడంతో పూరి జగన్నాథ్ తన రెమ్యునరేషన్ తో పాటు కలెక్షన్లలో తన వాటాకు వచ్చిన 70 శాతం డబ్బులను వెనక్కి ఇచ్చినట్లు సమాచారం.    

రెమ్యునరేషన్ వదులుకున్న విజయ్

పూరి జగన్నాథ్ బాటలోనే విజయ్ దేవరకొండ నడిచినట్లు తెలిసింది. ఈ సినిమా కోసం విజయ్ రూ. 35 కోట్ల పారితోషికం అందుకున్నట్లు వార్తలు వచ్చాయి. నాన్  థియేట్రికల్ ​రైట్స్​ లో విజయ్ కిి వాటా ఉందట. ఇప్పుడు ఆ వాటాను పూర్తిగా వదులుకున్నాడట. అటు తన పారితోషికంలో రూ.6 కోట్ల రూపాయలను వెనక్కి ఇచ్చినట్లు సినిమా పరిశ్రమలో టాక్ నడుస్తోంది. 

లైగర్​ మూవీని ప్రముఖ బాలీవుడ్ ​సినీ నిర్మాణ సంస్థ ధర్మ  ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్ బ్యానర్స్‌పై పూరి జగన్నాథ్, ఛార్మి, కరణ్ జోహర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా మిక్స్​డ్​ మార్షల్ ​ఆర్ట్స్​నేపథ్యంలో రూపొందింది. భారీ అంచనాల మధ్య పాన్ ​ఇండియా మూవీగా  విడుదలైంది. రిలీజైన తొలి రోజు నుంచే పెద్ద ఎత్తున నెగెటివ్ టాక్ వచ్చింది. పూరి కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది. అటు విజయ్‌, పూరి కాంబోలో ‘జన గణ మన’  సినిమా తెరకెక్కబోతుంది. ఈ సినిమాను పూరి, ఛార్మి కలిసి నిర్మిస్తున్నారు.  ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు సమాచారం. 

Also Read : ఎన్టీఆర్‌ను టార్గెట్ చేసిన కేసీఆర్? - దెబ్బకు రెండున్నర కోట్ల నష్టం

Also Read : ఫ్లాప్‌ల‌తో క‌ట్టిన స్టార్‌డ‌మ్ కోట - ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ క్రేజ్ వేరే లెవల్

Published at : 04 Sep 2022 09:24 AM (IST) Tags: Vijay Devarakonda Puri Jagannadh Liger Movie remunaration

సంబంధిత కథనాలు

Ennenno Janmalabandham October 5th: 'అసలు నువ్వు ఎందుకు బతికావ్ చావొచ్చు కదా' మాళవికతో అన్న అభి- గుండె పగిలేలా ఏడ్చిన వేద

Ennenno Janmalabandham October 5th: 'అసలు నువ్వు ఎందుకు బతికావ్ చావొచ్చు కదా' మాళవికతో అన్న అభి- గుండె పగిలేలా ఏడ్చిన వేద

Bigg Boss 6 Telugu Episode 31: ఎపిసోడ్‌లో హైలైట్ ఫైమానే, అందరినీ నవ్వించింది ఈమె ఒక్కతే, గీతూ ఎప్పటిలాగే ఓవర్ యాక్షన్

Bigg Boss 6 Telugu Episode 31: ఎపిసోడ్‌లో హైలైట్ ఫైమానే, అందరినీ నవ్వించింది ఈమె ఒక్కతే, గీతూ ఎప్పటిలాగే ఓవర్ యాక్షన్

Godfather Twitter Review - 'గాడ్ ఫాదర్' ఆడియన్స్ రివ్యూ : చిరంజీవి సినిమాకు పాజిటివ్ టాక్ - మెగాస్టార్ హిట్ కొట్టారోచ్!

Godfather Twitter Review - 'గాడ్ ఫాదర్' ఆడియన్స్ రివ్యూ : చిరంజీవి సినిమాకు పాజిటివ్ టాక్ - మెగాస్టార్ హిట్ కొట్టారోచ్!

Rashmika Mandanna: ఆ ముద్దు సీన్‌పై ట్రోల్స్, వెక్కి వెక్కి ఏడ్చాను: రష్మిక మందన్నా

Rashmika Mandanna: ఆ ముద్దు సీన్‌పై ట్రోల్స్, వెక్కి వెక్కి ఏడ్చాను: రష్మిక మందన్నా

Unstoppable with NBK Teaser release: ‘అన్‌స్టాపబుల్ 2’ టీజర్: మరింత జోష్‌తో బాలయ్య ఎంట్రీ, ఈ సారి డబుల్ ధమాకా!

Unstoppable with NBK Teaser release: ‘అన్‌స్టాపబుల్ 2’ టీజర్: మరింత జోష్‌తో బాలయ్య ఎంట్రీ, ఈ సారి డబుల్ ధమాకా!

టాప్ స్టోరీస్

KCR National Party : జాతీయ పార్టీ ప్రకటనకు సర్వం సిద్ధం, హైదరాబాద్ చేరుకుంటున్న నేతలు

KCR National Party : జాతీయ పార్టీ ప్రకటనకు సర్వం సిద్ధం, హైదరాబాద్ చేరుకుంటున్న నేతలు

Sri Rajarajeshwari Ashtakam: సకల విజయాలను అందించే అష్టకం, దసరా రోజు చదువుకుంటే మంచిది

Sri Rajarajeshwari Ashtakam: సకల విజయాలను అందించే అష్టకం, దసరా రోజు చదువుకుంటే మంచిది

Weather Updates: అల్పపీడనం ఎఫెక్ట్ - ఏపీ, తెలంగాణలో 3 రోజులపాటు వర్షాలు: IMD

Weather Updates: అల్పపీడనం ఎఫెక్ట్ - ఏపీ, తెలంగాణలో 3 రోజులపాటు  వర్షాలు: IMD

Somu Veerraju On Daspalla Lands : ప్రతిపక్షంలో పోరాటం అధికారంలోకి రాగానే ప్రైవేట్ పరమా?, సీఎం జగన్ కు సోము వీర్రాజు లేఖ

Somu Veerraju On Daspalla Lands : ప్రతిపక్షంలో పోరాటం అధికారంలోకి రాగానే ప్రైవేట్ పరమా?, సీఎం జగన్ కు సోము వీర్రాజు లేఖ