DevaraSanta 2022: ఈ ట్రిప్‌కు రాకముందు ఆత్మహత్య చేసుకుందామనుకున్నా - మోస్ట్ ఎమోషనల్‌గా దేవరశాంటా 2022 వీడియో!
విజయ్ దేవరకొండ తన దేవరశాంటా 2022 ట్రిప్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
ప్రతి సంవత్సరం క్రిస్మస్ సందర్భంగా రౌడీ బాయ్ విజయ్ దేవర కొండ ‘దేవర శాంటా’ పేరుతో అభిమానులకు ఆనందాన్ని పంచుతున్నాడు విజయ్. 2017లో దీన్ని మొట్టమొదట ప్రారంభించాడు. దీని ఐదో వార్షికోత్సవం సందర్భంగా తన 100 మంది అభిమానులను విజయ్ దేవరకొండ కులు మనాలి ట్రిప్‌కు తీసుకువెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోను విజయ్ దేవరకొండ పోస్ట్ చేశాడు.
100 మందిని సెలక్ట్ చేసి వారితో విజయ్ జూమ్ కాల్ మాట్లాడంతో ఈ వీడియో ప్రారంభం అవుతుంది. ట్రిప్‌లో భాగంగా విజయ్ దేవరకొండను కూడా ఢిల్లీకి రమ్మని ఫ్యాన్స్ కోరతారు. కానీ తనకు పని ఎక్కువగా ఉందని రావడం కష్టమేనని విజయ్ దేవరకొండ వారికి చెబుతాడు.
దీంతో ఫ్యాన్స్ కులుమనాలికి వెళ్లిపోతారు. అక్కడి నుంచి వారు తమ ఎక్సైట్‌మెంట్‌ను వీడియోస్ ద్వారా విజయ్ దేవరకొండతో షేర్ చేసుకుంటారు. అది చూసిన విజయ్ కూడా వారిని కలవడానికి కులు మనాలి వెళ్లడానికి డిసైడ్ అవుతాడు.
విజయ్ దేవరకొండ ట్రిప్‌కు ఎంపిక చేసిన వారిలో కర్ణాటకకు సంబంధించిన ఫ్యాన్స్ కూడా ఉండటం విశేషం. వారు కన్నడంలో విజయ్‌కు థ్యాంక్స్ తెలిపారు. ట్రిప్ అంటే కేవలం తిప్పి చూపించడం మాత్రమే కాకుండా అక్కడ ఉండే అడ్వంచరస్ థ్రిల్లింగ్ రైడ్స్‌లో కూడా ఫ్యాన్స్‌ను భాగం చేశారు.
విజయ్ దేవరకొండ కులు మనాలి వెళ్లాక అక్కడ ఒక పార్టీ అరేంజ్ చేస్తారు. అందులో ఫ్యాన్స్ విజయ్‌తో డైరెక్ట్‌గా ఇంటరాక్ట్ అవుతారు. ఇక్కడి నుంచి వీడియో ఎమోషనల్‌గా మారుతుంది. విజయ్ తన తల్లిదండ్రులతో కులు మనాలి చేరుకుంటారు.
అక్కడ ఫ్యాన్స్ కొంతమంది ఎమోషనల్ అవుతారు. ఈ ట్రిప్‌కు రాకముందు కెరీర్ సమస్యల కారణంగా చాలా డిప్రెషన్‌లో ఉన్నానని, ఒక దశలో ఆత్మహత్య కూడా చేసుకోవాలనే ఆలోచనలు వచ్చాయని, కానీ ట్రిప్‌లో మిగతా వారిని కలిశాక జీవితం మీద కొత్త ఆశ కలిగిందని ఒక యువతి తెలిపారు. అప్పుడు అందరూ కళ్లలో నీళ్లు పెట్టుకుంటారు. గొప్ప కొడుకుని కన్నావని విజయ్ దేవరకొండ తల్లికి ఒక మహిళ ఎమోషనల్‌గా చెబుతుంది. దీంతో విజయ్ దేవరకొండ వాళ్ల అమ్మ కూడా కళ్లలో కూడా ఆనంద బాష్పాలు వస్తాయి.
A 100 of you went, made friends, memories and experiences which will stay ❤️
— Vijay Deverakonda (@TheDeverakonda) February 27, 2023
When I see your happy smiling emotional faces, I know why I do this! I love you all 🤗
Full Love,
Vijay Deverakonda. #Deverasanta2022 https://t.co/9mU3pqoejL https://t.co/IKcmbx9QCO
Hugs to #StayVista for being an amazing host to my Rowdies and #AirDriven for helping me surprise them.
— Vijay Deverakonda (@TheDeverakonda) February 27, 2023
@TheDeverakonda anna @__GirDhar @AdithyaSai01 @OntariVaadu @TejaSaiTweets @vjuu_krishnaa
— Akshay@Kasukurthi (@AkshayKasukurt3) February 27, 2023
@Hemanth72623241 @ #VijayDeverakonda #deverasanta2022
We are one family 💯 pic.twitter.com/34wjx3GsZM