News
News
X

Vijay Devarakonda: హిట్ కోసం ఆ డైరెక్టర్ వెంటపడుతున్న రౌడీ బాయ్? ‘లైగర్’ ఎంత పనిచేసింది!

‘లైగర్’ మూవీ విజయ్ కెరీర్‌లో స్పీడ్ బ్రేకర్‌గా మారింది. అయితే, ‘ఖుషీ’ మూవీ హిట్ కొడితే.. విజయ్ మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేదు.

FOLLOW US: 
 
విజయ్ దేవరకొండ.. ఈపేరు తెలియని తెలుగు ఆడియన్స్ ఉండరు. హీరో గా రాణించాలని ఎన్నో ఏళ్ళు ఇండస్ట్రీలో కష్టాలు పడ్డాడు విజయ్. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోగా మారాడు. కెరీర్ మొదట్లో చిన్నా చితకా క్యారెక్టర్లు వచ్చినా.. అవి విజయ్ కు అంతగా గుర్తింపు తేలేదు. ఆ తర్వాత ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో రిషి క్యారెక్టర్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత వచ్చిన పెళ్లి చూపులు సినిమాతో పూర్తి స్థాయి హీరోగా మారాడు విజయ్. పెళ్లి చూపులు తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి మూవీతో విజయ్ ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు. ఆ సినిమా తర్వాత ఇక వెనుతిరిగి చూడలేదు. వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరో అయిపోయాడు. దీనికి తోడు తన యాటిట్యూడ్, మాటలతో యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించాడు.

అయితే, కొన్నాళ్ల నుంచి విజయ్ పరిస్థితి బాలేదు. గత రెండేళ్లలో విజయ్ కి మంచి హిట్ పడలేదు. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు ఫ్లాప్ తర్వాత విజయ్ నుంచి వచ్చిన మరో సినిమా లైగర్. డైరెక్టర్ పూరి జగన్నాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలయింది. ఈ సినిమా కోసం ప్రొఫెషనల్ బాక్సర్ మైక్ టైసన్ ను కూడా తీసుకొచ్చారు పూరీ. మూవీ కోసం ప్రమోషన్స్ కూడా పాన్ ఇండియా లెవల్ లో చేసేశారు. ఓ ప్రమోషన్స్ కార్యక్రమం సమయంలో విజయ్ యాట్టిట్యూడ్ పై విమర్శలు వచ్చాయి కూడా. అయితే ఈ సినిమా  డిజాస్టర్ గా మిగిలింది. బాక్స్ ఆఫీస్ దగ్గర పంచ్ ఇవ్వలేక బోర్లా పడింది. దీంతో ఈసారి కూడా హిట్ రాకపోవడంతో ఇటు పూరి, అటు విజయ్ డీలా పడ్డారట. దీని ప్రభావం పూరి డ్రీమ్ ప్రాజెక్టు అయిన 'జనగణమన' పై పడింది. ఈ సినిమాను విజయ్ తో తీయాలని పూరీ  అనుకున్నారు. లైగర్ దెబ్బతో అది కాస్తా ఆటకెక్కిపోయింది. దీంతో కథల విషయంలో విజయ్ ఓ క్లారిటీకి వచ్చేశాడట.

ప్రస్తుతం విజయ్ శివ నిర్వాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఖుషి’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరికి పూర్తవుతుంది. దీని తర్వాత విజయ్ చేతిలో మరో ప్రాజెక్టు లేదట. డైరెక్టర్ ఇమేజ్ కాకుండా కథ బలంగా ఉంటేనే సినిమాలు చేయాలనే ఉద్దేశంతో రెండు మూడు కథలు విన్నా.. అవి నచ్చకపోవడంతో రిజెక్ట్ చేశాడట రౌడీ హీరో. అయితే ఈ మధ్య మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ విజయ్ కు ఓ స్టోరీ లైన్ చెప్పారట, అది కాస్తా విజయ్ కు బాగా నచ్చడంతో ఓకే చేశాడని టాక్. కథ, మాటలు, స్క్రీన్ ప్లే తానే చేసినా.. డైరెక్షన్ మాత్రం వేరే వాళ్ళు చేస్తారని చెప్పారు త్రివిక్రమ్. అందుకు విజయ్ మొదట ఓకే చెప్పినా ఇప్పుడు దర్శకత్వం కూడా త్రివిక్రమ్ నే చేయాలని పట్టుబడుతున్నారట. ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ తో సినిమా చేస్తున్నారు. మరి అది పూర్తి చేసి, విజయ్ తో సినిమా తీస్తాడా లేదా అన్నది వేచి చూడాలి. త్రివిక్రమ్ తో విజయ్ సినిమా చేస్తే విజయ్ కెరీర్ మళ్ళీ గాడిన పడుతుందని ఆశపడుతున్నారట రౌడీ బాయ్ ఫ్యాన్స్.

Also Read: సుమతో ఆడేసుకున్న అనుదీప్, శివ కార్తికేయన్ - ఆ పంచులకు నవ్వు ఆగదు!

News Reels

Published at : 21 Oct 2022 09:38 AM (IST) Tags: Trivikram Vijay Devarakonda Liger Movie

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu:ఈ సీజన్లో బెస్ట్ కెప్టెన్ ఎవరు? వరస్ట్ కెప్టెన్ ఎవరు? - ఇక ఆపెయ్ ఆదిరెడ్డి, నాగార్జున వేడుకోలు

Bigg Boss 6 Telugu:ఈ సీజన్లో బెస్ట్ కెప్టెన్ ఎవరు? వరస్ట్ కెప్టెన్ ఎవరు? - ఇక ఆపెయ్ ఆదిరెడ్డి, నాగార్జున వేడుకోలు

Mahesh Babu: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ - తిరిగి రంగంలోకి దిగిన మహేష్!

Mahesh Babu: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ - తిరిగి రంగంలోకి దిగిన మహేష్!

స్టార్లను సైతం వెనక్కి నెట్టిన రామ్‌చరణ్ - ట్రూ లెజెండ్ అవార్డు దక్కించుకున్న మెగాపవర్!

స్టార్లను సైతం వెనక్కి నెట్టిన రామ్‌చరణ్ - ట్రూ లెజెండ్ అవార్డు దక్కించుకున్న మెగాపవర్!

Pushpa 2 In Russia : రష్యాలో 'పుష్ప 2' కూడా - లేట్ లేకుండా నయా ప్లాన్!

Pushpa 2 In Russia : రష్యాలో 'పుష్ప 2' కూడా - లేట్ లేకుండా నయా ప్లాన్!

Prabhas Marathi Movie : ఇప్పుడు మారుతి సెట్స్‌కు ప్రభాస్ - క్రిస్మస్ ముందు వరకూ!

Prabhas Marathi Movie : ఇప్పుడు మారుతి సెట్స్‌కు ప్రభాస్ - క్రిస్మస్ ముందు వరకూ!

టాప్ స్టోరీస్

YS Jagan: త్వరలో పార్టీ ఎమ్మెల్యేలతో జగన్ భేటీ - హాట్ టాపిక్‌గా ఎవరికి టికెట్లు, ఎవరికి ఇక్కట్లు !

YS Jagan: త్వరలో పార్టీ ఎమ్మెల్యేలతో జగన్ భేటీ - హాట్ టాపిక్‌గా ఎవరికి టికెట్లు, ఎవరికి ఇక్కట్లు !

YS Sharmila Padayatra: వైఎస్ షర్మిలకు వరంగల్ పోలీసులు షాక్, పాదయాత్రకు బ్రేక్!

YS Sharmila Padayatra: వైఎస్ షర్మిలకు వరంగల్ పోలీసులు షాక్, పాదయాత్రకు బ్రేక్!

Weather Latest Update: ముంచుకొస్తున్న మాండస్ తుపాను, ఏపీకి వర్షసూచన!

Weather Latest Update:  ముంచుకొస్తున్న మాండస్ తుపాను, ఏపీకి వర్షసూచన!

Horoscope Today 4th December 2022: ఈ రాశివారు మనసులో మాట బయటపెట్టొద్దు అది మీకు సమస్యగా మారుతుంది, డిసెంబరు 4 రాశిఫలాలు

Horoscope Today 4th  December 2022:  ఈ రాశివారు మనసులో మాట బయటపెట్టొద్దు అది మీకు సమస్యగా మారుతుంది, డిసెంబరు 4 రాశిఫలాలు