Samantha : పెళ్లి తర్వాత షూటింగ్‌లో సమంత - వాట్ ఏ డెడికేషన్ సామ్
Samantha Ruth Prabhu : స్టార్ హీరోయిన్ సమంత పెళ్లైన 5 రోజులకే కొత్త మూవీ 'మా ఇంటి బంగారం' షూటింగ్‌లో పాల్గొన్నారు. డైరెక్టర్‌తో కలిసి ఫోటో షేర్ చేయగా వైరల్ అవుతోంది.

Samantha Joined The Maa Inti Bangaram Shooting : స్టార్ హీరోయిన్ సమంత, డైరెక్టర్ రాజ్ నిడిమోరు ఈ నెల 1న వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. పెళ్లైన 5 రోజులకే సమంత షూటింగ్‌లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఆమె 'మా ఇంటి బంగారం' మూవీలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. స్వీయ నిర్మాణంలో రూపొందుతున్న మూవీలో ఆమె శుక్రవారం షూటింగ్‌కు అటెండ్ అయ్యారు. షూటింగ్ సెట్‌లో డైరెక్టర్‌తో దిగిన ఫోటోను ఆమె ఇన్ స్టాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది.
వాట్ ఏ డెడికేషన్
పెళ్లైన 5 రోజులకే షూటింగ్‌లో పాల్గొంటుండడంతో నెటిజన్లు సమంత డెడికేషన్‌ను ప్రశంసిస్తున్నారు. 'ఇది కదా వర్క్ డెడికేషన్' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో కీర్తి సురేష్ సైతం పెళ్లైన కొద్ది రోజులకే 'బేబీ జాన్' మూవీ ప్రమోషన్స్‌కు అటెండ్ అయ్యారు. మోడ్రన్ డ్రెస్‌లో పసుపు తాడుతో అందరినీ ఆకర్షించారు.
తన సొంత నిర్మాణ సంస్థ 'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్' ప్రొడక్షన్ హౌస్ నుంచి సమంత చేస్తున్న రెండో చిత్రం ఇది. మొదటగా నిర్మించిన 'శుభం' మూవీలో ఆమె అతిథి పాత్రలో కనిపించారు. ఇటీవలే 'మా ఇంటి బంగారం' సినిమా పూజా కార్యక్రమాలతో పూర్తై షూటింగ్ శరవేగంగా సాగుతోంది.
Also Read : రాజమౌళి 'వారణాసి' ఓటిటి హక్కుల కోసం తీవ్ర పోటీ! 1000 కోట్లు దాటి వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా!
సూపర్ హిట్ కాంబో
ఈ మూవీకి గతంలో సమంత నటించిన 'ఓ బేబీ' మూవీ డైరెక్టర్ నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. వీరిద్దరి కాంబోలో ఇది రెండో మూవీ కాగా భారీ అంచనాలే నెలకొన్నాయి. సమంతతో పాటు దిగంత్, గుల్షన్ దేవయ్య, సీనియర్ నటి గౌతమి, మంజుషా కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజ్ నిడిమోరు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. గ్రిప్పింగ్ యాక్షన్ డ్రామాగా 'మా ఇంటి బంగారం' రూపొందుతోంది.






















