Liger Hunt: విజయ్ దేవరకొండ బర్త్ డే ట్రీట్ - 'లైగర్ హంట్' థీమ్ సాంగ్ విన్నారా?
ఈరోజు(మే 9) విజయ్ దేవరకొండ పుట్టినరోజు కావడంతో సినిమా నుంచి 'లైగర్ హంట్' అనే సాంగ్ థీమ్ ను రిలీజ్ చేశారు.
యంగ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా 'లైగర్'. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయనున్నారు. మొన్నామధ్య ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని వదలగా.. యూట్యూబ్ లో సెన్సేషన్ అయింది.
ఇక ఈరోజు(మే 9) విజయ్ దేవరకొండ పుట్టినరోజు కావడంతో సినిమా నుంచి 'లైగర్ హంట్' అనే సాంగ్ థీమ్ ను రిలీజ్ చేశారు. 'బతకాలంటే గెలవాల్సిందే' అంటూ సాగే ఈ థీమ్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. మ్యూజిక్ అయితే ఓ రేంజ్ లో ఉంది. విక్రమ్ మాన్ట్రోస్ ఈ సాంగ్ ను కంపోజ్ చేయగా.. భాస్కర్ భట్ల లిరిక్స్ అందించారు. తెలుగు వెర్షన్ ను హేమచంద్రతో పాడించారు. సాంగ్ విజువల్స్ కూడా ఆకట్టుకున్నాయి. విజయ్ చాలా అగ్రెసివ్ గా కనిపించాడు. ఆపోజిట్ ప్లేయర్ కి మిడిల్ ఫింగర్ చూపిస్తూ కనిపించాడు.
ఈ ఏడాది ఆగస్ట్ 25న సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్‌ను కీలక పాత్ర కోసం తీసుకున్నారు. ఈ సినిమాకు పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా నిర్మాతలు.
View this post on Instagram