News
News
X

Vijay Devarakonda: రచ్చ రచ్చ చేసిన అభిమానులు - మాల్ నుంచి నిమిషాల్లోనే వెళ్ళిపోయిన విజయ్ దేవరకొండ

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ క్రేజ్ మామూలుగా లేదు. లైగర్ ప్రమోషన్స్ కోసం ఎక్కడికి వెళ్ళినా అభిమానులు పిచ్చ పిచ్చగా వచ్చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. విజయ్, అనన్య జంటగా తెరకెక్కిన సినిమా లైగర్.

FOLLOW US: 

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ క్రేజ్ మామూలుగా లేదు. లైగర్ ప్రమోషన్స్ కోసం ఎక్కడికి వెళ్ళినా అభిమానులు పిచ్చ పిచ్చగా వచ్చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. విజయ్, అనన్య జంటగా తెరకెక్కిన సినిమా 'లైగర్'. ఈ జంట లైగర్ ప్రమోషన్స్ లో పాల్గొంటూ బిజీబిజీగా గడిపేస్తున్నారు. ఇటీవల ముంబయిలోని ఓ మాల్ కి వెళ్తే అక్కడ ఇసుక వేసినా రాలనంత మంది అభిమానులు వచ్చి విజయ్ మీద తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు.

దేశవ్యాప్తంగా ఉన్న పలు రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రమోషన్స్ ను ప్లాన్ చేశారు. ఇప్పటికే గుజరాత్, ఛండీఘడ్, ముంబయి, అహ్మదాబాద్, పాట్నాతో పాటు పలు నగరాల్లో నిర్వహించిన ప్రమోషన్స్ లో లైగర్ జంట పాల్గొంది. తాజాగా పూణేలో ఓ మాల్ లో లైగర్ ప్రమోషన్స్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. అక్కడికి కూడా భారీ సంఖ్యలో అభిమానులు వచ్చారు. తమ అభిమాన నటుడిని దగ్గర నుంచి చూసేందుకు ఎగబడ్డారు.

స్టేజ్ మీదకి విజయ్, అనన్య రాగానే అభిమానులు ముందుకు వచ్చేందుకు ప్రయత్నించారు. స్టేజ్‌కు అడ్డుగా పెట్టిన బారికేడ్లను తోసేశారు. వాళ్ళని కంట్రోల్ చేయడం సెక్యూరిటీ సిబ్బందికి కష్టమైంది. దీంతో విజయ్, అనన్య కొన్ని నిమిషాల వ్యవధిలోనే అక్కడ నుంచి వెళ్లిపోవల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మధ్యమాల్లో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది.

లైగర్ సినిమా ప్రమోషన్స్ ని వినూత్నంగా ప్లాన్ చేశారు. గతంలో ముంబయి లోని లోకల్ ట్రైన్ లో ప్రమోషన్స్ చేసి అందర్నీ సర్ ప్రైజ్ చేశారు. ముంబయిలోని ఫేమస్ రోడ్ల మీద తిరుగుతూ అభిమనులతో మాట్లాడాడు విజయ్. అదే విధంగా చండీగడ్‌లో ఓ ఛాయ్ బండి దగ్గర అభిమానులతో కలిసి టీ తాగుతూ వారితో ముచ్చటించారు విజయ్, అనన్యలు. ప్రమోషన్స్ లో ఎక్కడ చూసినా విజయ్ చెప్పులు ధరించే కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈవెంట్స్ కోసం త్వరగా రెడీ అయ్యేందుకే ఇలా చెప్పులు ధరించి వస్తున్నట్టు విజయ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.

మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా సినిమా ఆగస్టు 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ తర్వాత పూరి జగన్నాథ్, యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో వస్తున్నా పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సరిగ్గా ఐదు సంవత్సరాల క్రితం విజయ్ దేవరకొండకు స్టార్‌డం తీసుకొచ్చిన ‘అర్జున్ రెడ్డి’ విడుదలైన రోజే ‘లైగర్’ కూడా రిలీజ్ కానుండటంతో ఇది కచ్చితంగా సక్సెస్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Also Read : మాచర్ల నియోజకవర్గం రివ్యూ : నితిన్ సినిమా ఎలా ఉందంటే?

Also Read : కడవర్ రివ్యూ : డెడ్ బాడీ చెప్పిన కథ, అమలా పాల్ సినిమా ఎలా ఉందంటే?

View this post on Instagram
 
A post shared by Puri Connects (@puriconnects)

Published at : 12 Aug 2022 08:32 PM (IST) Tags: Vijay Devarakonda Liger Movie Promotions Ananya Pnadey Liger Team At Pune Mall

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: హౌస్ లో మోస్ట్ కన్నింగ్, మోస్ట్ మానిప్యులేటివ్ పర్సన్ అతడే - గీతూ కామెంట్స్, శనివారం ఎపిసోడ్ హైలైట్స్!

Bigg Boss 6 Telugu: హౌస్ లో మోస్ట్ కన్నింగ్, మోస్ట్ మానిప్యులేటివ్ పర్సన్ అతడే - గీతూ కామెంట్స్, శనివారం ఎపిసోడ్ హైలైట్స్!

Rashmika: మాజీ బాయ్‌ఫ్రెండ్స్‌తో రిలేషన్ - రష్మిక మాటలు విన్నారా?

Rashmika: మాజీ బాయ్‌ఫ్రెండ్స్‌తో రిలేషన్ - రష్మిక మాటలు విన్నారా?

Bigg Boss 6 Telugu: ఓటింగ్ లో వెనుకబడ్డ ఆరోహి - ఎలిమినేషన్ తప్పదా?

Bigg Boss 6 Telugu: ఓటింగ్ లో వెనుకబడ్డ ఆరోహి - ఎలిమినేషన్ తప్పదా?

Ghost Hindi Release Date : హిందీలో రెండు రోజుల ఆలస్యంగా నాగార్జున 'ఘోస్ట్' - ఎందుకో వివరించిన నిర్మాత

Ghost Hindi Release Date : హిందీలో రెండు రోజుల ఆలస్యంగా నాగార్జున 'ఘోస్ట్' - ఎందుకో వివరించిన నిర్మాత

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ హౌస్ లో మంట పెట్టిన బీబీ ఛాట్ బండార్ - వరస్ట్ పానీపూరి ఎవరికి వచ్చింది?

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ హౌస్ లో మంట పెట్టిన బీబీ ఛాట్ బండార్ - వరస్ట్ పానీపూరి ఎవరికి వచ్చింది?

టాప్ స్టోరీస్

Garuda Vahana Seva : గరుడవాహనంపై విహరించిన శ్రీవారు, జనసంద్రమైన తిరుమాడవీధులు

Garuda Vahana Seva : గరుడవాహనంపై విహరించిన శ్రీవారు, జనసంద్రమైన తిరుమాడవీధులు

VIjay CID : చింతకాయల విజయ్ ఇంటికి సీఐడీ - మహిళలు, చిన్నపిల్లలతో అనుచితంగా ప్రవర్తించారని టీడీపీ ఆగ్రహం !

VIjay CID :  చింతకాయల విజయ్  ఇంటికి సీఐడీ - మహిళలు, చిన్నపిల్లలతో అనుచితంగా ప్రవర్తించారని టీడీపీ ఆగ్రహం !

Munugode Bypoll : నవంబర్ లో మునుగోడు ఉపఎన్నిక, ఇంకా 40 రోజులే ఉన్నాయ్- సునీల్ బన్సల్

Munugode Bypoll : నవంబర్ లో మునుగోడు ఉపఎన్నిక, ఇంకా 40 రోజులే ఉన్నాయ్- సునీల్ బన్సల్

Dasara Holidays: దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే గుర్తింపు రద్దు: ఇంటర్‌ బోర్డు

Dasara Holidays: దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే గుర్తింపు రద్దు: ఇంటర్‌ బోర్డు