Hatya Pre Release: ఈసారి సినిమా తీసే ముందు నా గురించి ఆలోచించండి: అడవి శేష్
ఇటీవలే నటుడు విజయ్ ఆంటోని నటించిన ‘హత్య’ మూవీకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథులుగా టాలీవుడ్ హీరోలు సందీప్ కిషన్, అడివి శేష్ హాజరయ్యారు.
Hatya Pre Release: ‘బిచ్చగాడు’ సినిమాతో తెలుగులో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు తమిళ నటుడు విజయ్ ఆంటోని. ఆ మూవీ తర్వాత ఆయన నటించిన అన్ని సినిమాలు తెలుగులో కూడా డబ్ అవుతున్నాయి. రీసెంట్ గా ‘బిచ్చగాడు 2’ సినిమాతో అలరించిన ఈ హీరో ఇప్పుడు ‘హత్య’ అనే సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్డ్రాప్ లో రాబోతున్న ఈ మూవీకు బాలీజీ కుమార్ దర్శకత్వం వహించారు. ఇటీవలే ఈ మూవీకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథులుగా టాలీవుడ్ హీరోలు సందీప్ కిషన్, అడివి శేష్ హాజరయ్యారు.
విజయ్ ఆంటోని కథల ఎంపిక బాగుంటుంది: సందీప్ కిషన్
‘హత్య’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. విజయ్ ఆంటోనీ కథలు ఎంపిక చేసే విధానం చాలా బాగుంటుందని అన్నారు. విభిన్నమైన కథలను ప్రేక్షకుడికి నచ్చే విధంగా మూవీను తీర్చిదిద్దుతారని చెప్పారు. అలాగే విజయ్ మంచి మ్యూజిక్ డైరెక్టర్ కూడా అని ఆయన పాటలకు తాను మంచి అభిమానినని అన్నారు. దర్శకుడు సినిమాను చాలా చక్కగా తెరకెక్కించారని ట్రైలర్ చూస్తేనే తెలుస్తోందని. ట్రైలర్ చూస్తుంటే సినిమాకు ఒక లాంగ్వేజ్ ఉంటుందని బాలాజీ గారు చేసి చూపించారని పేర్కొన్నారు. ఈ సినిమా అందరికీ నచ్చుతుందని అన్నారు. మూవీ టీమ్ కు శుభాకాంక్షలు తెలిపారు.
ఇది ఇంటర్నేషనల్ ఫిల్మ్ లా ఉంది: అడవి శేష్
అనంతరం ఈ కార్యక్రమంలో హీరో అడవి శేష్ మాట్లాడారు. విజయ్ ‘బిచ్చగాడు 2’ సినిమా ఫంక్షన్ కు వచ్చానని, అప్పుడా మూవీ మంచి హిట్ అందుకుందని అన్నారు. అలాగే ఇప్పుడు ఈ సినిమా ఫంక్షన్ కు కూడా వచ్చానని, ఇప్పుడు కూడా ఈ మూవీ మంచి హిట్ ను అందుకుంటుందని ఆకాంక్షించారు. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే తెలుగు సినిమా, తమిళ సినిమాలా లేదని, ఇంటర్నేషనల్ ఫిల్మ్ లా ఉందని కితాబిచ్చారు. మూవీను దర్శకుడు చాలా బాగా తెరకెక్కించారని, ట్రైలర్ చూస్తేనే అది అర్థమవుతుందని అన్నారు. ఈసారి సినిమా తీస్తే తన గురించి కూడా ఆలోచించమని దర్శకుడితో చమత్కరించారు శేష్. ఇక విజయ్, సందీప్, మీనాక్షి తామంతా స్వతహాగా ఎదిగాం అని, తమ రాతను తామే రాసుకున్నామని అన్నారు. ప్రేక్షకులు ఇలాంటి సినిమాలకు మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నానన్నారు. అనంతరం మూవీ టీమ్ కు శుభాకాంక్షలు తెలిపారు.
ఇక ఈ సినిమా మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగే క్రైమ్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కింది. ఇందులో విజయ్ డిటెక్టివ్ పాత్రలో కనిపించనున్నారు. 1923 లో జరిగిన ఓ ఘటన ఆధారంగా ఈ ‘హత్య’ చిత్రాన్ని రూపొందించినట్లు మేకర్స్ తెలిపారు. అలాగే మూవీలో రితికా సింగ్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించారు. లోటస్ పిక్చర్స్, ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్స్ పై కమల్ బోరా, జి.ధనుంజయన్, ప్రదీప్ బి, పంకజ్ బోరా, విక్రమ్ కుమార్, తాన్ శ్రీ దొరైసింగం పిళ్లై, సిద్ధార్థ్ శంకర్, ఆర్‌విఎస్ అశోక్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ జులై 21న గ్లోబల్ సినిమాస్, సురేష్ ప్రొడక్షన్ ద్వారా తెలుగులో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ మూవీ విజయ్ కు ఎలాంటి హిట్ అందిస్తుందో చూడాలి.
Also Read: ‘ఆహా’లోకి విశ్వక్ సేన్ ఎంట్రీ- ఎంటర్ టైనింగ్ షోతో దుమ్మురేపనున్న ఊరమాస్ హీరో!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial