News
News
X

Vijay Devarakonda: ముంబయి లోకల్ ట్రైన్లో 'లైగర్' ప్రమోషన్స్ - అనన్య ఒడిలో విజయ్

లైగర్ సినిమా ప్రమోషన్స్ లో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, బాలీవుడ్ నటి అనన్య పాండే బిజీ బిజీగా గడిపేస్తున్నారు.

FOLLOW US: 

‘లైగర్’ సినిమా ప్రమోషన్స్ లో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, బాలీవుడ్ నటి అనన్య పాండే బిజీ బిజీగా గడిపేస్తున్నారు. పూరీ ద‌ర్శ‌క‌త్వంలో 'లైగ‌ర్' పాన్ ఇండియా సినిమాగా తెర‌కెక్కింది. ఈ సినిమా ప్రమోషన్స్ ని మేకర్స్ ఓ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొని లైగర్ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ షోలో కరణ్ అడిగిన పలు ప్రశ్నలకి విజయ్ చెప్పిన సమాధానాలు వైరల్ గా మారాయి.

ప్రస్తుతం ఈ జంట ముంబయి లోకల్ ట్రైన్లో ప్రయాణిస్తూ ప్రమోషన్స్ చేశారు. ముంబయి లోని బాంద్రా ప్రాంతంలో తిరుగుతూ సందడి చేశారు. మాస్కులు ధరించి కొద్ది సేపు రైల్వే ఫ్లాట్ ఫాం మీద కాసేపు కూర్చున్నారు. తర్వాత ట్రైన్ ఎక్కిన వీరిద్దరూ ట్రైన్ లో ఉన్న ప్రయాణికులతో ముచ్చటించారు. ప్రమోషన్స్ చేసి చేసి అలిసిపోయాడేమో కానీ విజయ్ కాసేపు అనన్య ఒడిలో పడుకుని సేద తీరాడు. దీనికి సంబంధించిన ఫోటోలను అనన్య ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ 'పట్టాలెక్కిన లైగర్ ప్రమోషన్స్.. లెట్స్ గో బాయ్స్'.. అని ట్యాగ్ పెట్టారు. 

లైగర్ సినిమా నుంచి మరో మాస్ పాట ని మేకర్స్ విడుదల చేశారు. "వాట్ లగా.." అంటూ సాగే ఈ పాట.. విజయ్ మాస్ డైలాగ్స్ తో అకట్టుకుంటోంది. దీన్ని విజయ్ పాడగా.. పూరీ లిరిక్స్ అందించారు. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కెరీర్ లోనే మొదటి పాన్ ఇండియా చిత్రం ఇది. ఆగస్ట్ 25 న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. మొదట్నుంచి ఈ సినిమా టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం విజయ్ న్యూడ్ లుక్ విడుదల చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. దానికి విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు లభించాయి. స్పోర్ట్స్ యాక్షన్ ప్రధానంగా సాగే ఈ సినిమాలో రమ్యకృష్ణ విజయ్ తల్లి పాత్రలో నటిస్తోంది. మైక్ టైసన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

View this post on Instagram
 
A post shared by Ananya 💛💫 (@ananyapanday)

Published at : 29 Jul 2022 04:37 PM (IST) Tags: Liger Vijay Devarakonda Ananya Pandey Liger Promotions Liger Promotions At Mumbai Local Train

సంబంధిత కథనాలు

Dobaaraa: తాప్సీ సినిమాకి షాక్ - ఆడియన్స్ లేక షోస్ క్యాన్సిల్!

Dobaaraa: తాప్సీ సినిమాకి షాక్ - ఆడియన్స్ లేక షోస్ క్యాన్సిల్!

Ranveer Deepika's New House : కొత్తింట్లో అడుగుపెట్టిన ర‌ణ్‌వీర్ - దీపిక దంపతులు, ఎంత పద్దతిగా పూజలు చేశారో చూశారా?

Ranveer Deepika's New House : కొత్తింట్లో అడుగుపెట్టిన ర‌ణ్‌వీర్ - దీపిక దంపతులు, ఎంత పద్దతిగా పూజలు చేశారో చూశారా?

Anasuya: 'నా మాటలను రాజకీయం చేయొద్దు' - నెటిజన్లకు అనసూయ రిక్వెస్ట్!

Anasuya: 'నా మాటలను రాజకీయం చేయొద్దు' - నెటిజన్లకు అనసూయ రిక్వెస్ట్!

Tees Maar Khan Movie Review - తీస్ మార్ ఖాన్ రివ్యూ : రేసుగుర్రంలా దూసుకు వెళ్ళాలనుకున్న ఆది సాయి కుమార్, సినిమా ఎలా ఉందంటే?

Tees Maar Khan Movie Review - తీస్ మార్ ఖాన్ రివ్యూ : రేసుగుర్రంలా దూసుకు వెళ్ళాలనుకున్న ఆది సాయి కుమార్, సినిమా ఎలా ఉందంటే?

Wanted PanduGod Review: వాంటెడ్ పండుగాడ్ రివ్యూ: సుధీర్, అనసూయ, సునీల్‌ల పండుగాడు మెప్పించాడా?

Wanted PanduGod Review: వాంటెడ్ పండుగాడ్ రివ్యూ: సుధీర్, అనసూయ, సునీల్‌ల పండుగాడు మెప్పించాడా?

టాప్ స్టోరీస్

High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

Ram Charan: రామ్ చరణ్ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్న ఉపాసన - ఫొటో వైరల్

Ram Charan: రామ్ చరణ్ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్న ఉపాసన - ఫొటో వైరల్

Google Maps: మీకు కావాల్సిన వాళ్లు ఎక్కడున్నారో తెలుసుకోవాలా? జస్ట్ ఇలా చేస్తే సరిపోతుంది..

Google Maps: మీకు కావాల్సిన వాళ్లు ఎక్కడున్నారో తెలుసుకోవాలా? జస్ట్ ఇలా చేస్తే సరిపోతుంది..

Raashii Khanna: అమ్మ బ్రహ్మ దేవుడో ఎంత గొప్ప సొగసురో- హాట్ ఫోజుల్లో హీట్ పెంచేస్తున్న రాశీ ఖన్నా

Raashii Khanna: అమ్మ బ్రహ్మ దేవుడో ఎంత గొప్ప సొగసురో- హాట్ ఫోజుల్లో హీట్  పెంచేస్తున్న రాశీ ఖన్నా