Vidya Vasula Aham First Look: డిఫరెంట్ గా ‘విద్య వాసుల అహం’ ఫస్ట్ లుక్ - ఫిదా అవుతున్న ప్రేక్షకులు
రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విద్య వాసుల అహం’. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ వీడియో విడుదలయ్యాయి..
![Vidya Vasula Aham First Look: డిఫరెంట్ గా ‘విద్య వాసుల అహం’ ఫస్ట్ లుక్ - ఫిదా అవుతున్న ప్రేక్షకులు Vidya Vasula Aham Movie Starring Rahul Vijay Shivani Rajashekhar first look out on Ganesh Chaturthi 2022 movie based on newly married couple Vidya Vasula Aham First Look: డిఫరెంట్ గా ‘విద్య వాసుల అహం’ ఫస్ట్ లుక్ - ఫిదా అవుతున్న ప్రేక్షకులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/01/0e1873a109b74e952afab2666e6120a41662012450313544_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
యువ హీరో రాహుల్ విజయ్ (Rahul Vijay), యాంగ్రీ స్టార్ రాజశేఖర్ - జీవిత దంపతుల పెద్ద కుమార్తె శివాని రాజశేఖర్ (Shivani Rajasekhar) జంటగా నటిస్తున్న చిత్రం ‘విద్య వాసుల అహం’ (Vidya Vasula Aham Movie). ఈ సినిమాకు 'తెల్లవారితే గురువారం' ఫేం మణికాంత్ గెల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఏటర్నిటీ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ నెంబర్ 2 గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ యానిమేషన్ కాన్సెప్ట్ వీడియోను వినాయక చవితి సందర్భంగా విడుదల చేశారు.
Here's the First Look & Title animation of Vidya Vasula Aham 🎥
— Manikanth Gelli (@gellimanikanth) August 31, 2022
▶️ https://t.co/DMKymwKgPr#VVAFilm @actorRahulVijay @gellimanikanth @Rshivani_1 @mdmoturu @kumar_kodali @LMakkapati @itsKalyaniMalik @venkateshrsr @PentiAnish @SreedharSri4u pic.twitter.com/WKmPQRM74P
ఆకట్టుకుంటున్న టైటిల్
టైటిల్ చాలా ప్రత్యేకంగా ఉంది. యువతను, ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంటుంది. అహం వెనుక ఉన్న చరిత్రను యానిమేషన్ రూపంలో చెబుతూ వినూత్నంగా ఫస్ట్ లుక్ విడుదల చేసింది సినిమా యూనిట్. పెళ్లైన ఓ కొత్త జంట మధ్య ఉన్న పంతాలు, పట్టింపుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సినిమా యూనిట్ తెలిపింది. విద్యవాసుల అహం సినిమా కోసం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఓ భారీ సెట్ వేశారు. ప్రస్తుతం అక్కడే సినిమా షూటింగ్ జరుగుతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇప్పటికే చాలా వరకు సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. త్వరలోనే మిగతా షూటింగ్ పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి, వీలైనంత త్వరలో ఈ సినిమాను థియేటర్స్ లో విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు ప్రత్నిస్తున్నారు.
Here's the First Look & Title animation of Vidya Vasula Aham 🎥
— Manikanth Gelli (@gellimanikanth) August 31, 2022
▶️ https://t.co/DMKymwKgPr#VVAFilm @actorRahulVijay @gellimanikanth @Rshivani_1 @mdmoturu @kumar_kodali @LMakkapati @itsKalyaniMalik @venkateshrsr @PentiAnish @SreedharSri4u
సినీ ప్రముఖులు ఫిదా
విద్య వాసుల అహం సినిమాకు సంబంధించిన విభిన్నమైన టైటిల్, ఫస్ట్ లుక్ కు ప్రేక్షకులతో పాటు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఫిదా అవుతున్నారు. సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని ఆశిస్తున్నారు. ఇక ఈ సినమాకు కల్యాణి మాలిక్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం అన్ని పనులు పూర్తి చేసుకొని థియేటర్స్‌లో విడుదల కావడానికి సిద్దం అవుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు సహా ఇతర వివరాలను త్వరలో ప్రకటిస్తామని యూనిట్ వెల్లడించింది.
స్టైలిష్ ఫోటో షూట్స్ తో శివానీ...
శివానీతో పాటు రాజశేఖర్, జీవిత దంపతుల చిన్న కుమార్తె శివాత్మిక సైతం సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టారు. ఆమె 'దొరసాని' అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. శివానీ రాజశేఖర్ ఫస్ట్ మూవీ ‘అద్భుతం’ టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమాలో తన నటన బాగానే ఉన్నా... ఓటీటీలో విడుదల కావడంతో పెద్దగా గుర్తింపు దక్కలేదు. రెండో సినిమా 'డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ' కూడా ఓటీటీలో విడుదలైంది. ఆ తర్వాత తండ్రి రాజశేఖర్ 'శేఖర్' సినిమాలో కీలక పాత్ర చేశారు. ఇప్పుడు తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తున్నారు. ఈ సారి 'విద్య వాసుల అహం' సినిమాతో థియేటర్లలో విజయం అందుకోవాలని చూస్తున్నారు. ఈ మధ్య స్టైలిష్ ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)